NTV Telugu Site icon

Bharateeyans Review: ‘భారతీయన్స్’ రివ్యూ

Bharatheeyans Review

Bharatheeyans Review

Bharateeyans Movie Review: సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ అందుకే ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రమే ప్యాషన్ కొద్దీ తమకి నచ్చిన సినిమాలు చేస్తూ ఉంటారు. దేశభక్తిని చాటే సినిమాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నాయి. అయితే వాటిలో సైనికుల ప్రాణ త్యాగాలు, శత్రు దేశాల కుట్రలను చూపించే సినిమాలు కొంచెం తక్కువే. అయితే అలాంటి వాటిని కళ్లకు కట్టినట్టు చూపించేలా సినిమా చేశారు. ‘భారతీయన్స్’ పేరుతో ప్రవాస భారతీయుడు శంకర్ నాయుడు ఒక సినిమాను నిర్మించగా.. దీనరాజ్ దర్శకుడిగా మారారు. అయితే సినిమాలో పాత్రధారులకి పేర్లు పెట్టకుండా కేవలం ప్రాంతాల పేర్లతో పిలుస్తూ ఉండడం సినిమా మీద ఆసక్తి పెంచింది. మరి అలాంటి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

‘భారతీయన్స్’ కథ:
దేశభక్తి నేపథ్యంలో సినిమా అనగానే పాకిస్తాన్- ఇండియా మధ్య జరుగుతున్న అనేక సంఘటనల గురించి చర్చిస్తూ ఉంటారు. కానీ ఈ ‘భారతీయన్స్’ సినిమా మాత్రం ఆసక్తికరంగా చైనా- ఇండియా మధ్య జరుగుతున్న వ్యవహారాల మధ్య తెరకెక్కించ పడింది.. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో పాత్రలకు పేర్లు ఉండవు .వారి ప్రాంతాల పేర్లతోనే పిల్చుకుంటూ ఉంటారు. తెలుగు (నిర్రోజ్ పుచ్చా), భోజ్‌పురి (శుభ రంజన్), నేపాలీ ((సిక్కిం) సోనమ్ తెందుప్ బర్ఫుంగా), పంజాబీ (సమైరా సంధు), త్రిపుర (పెడెన్ ఓ నామ్‌గ్యాల్), మరియు బెంగాలీ (రాజేశ్వరి చక్రవర్తి)ప్రాంతాలకు చెందిన ఆరుగురిని వేర్వేరు సమస్యలు చుట్టుముడతాయి. వారందరికీ ఆగంతుకుల నుంచి పిలుపు వస్తుంది. వారిచ్చిన ఆఫర్ ప్రకారం ఆయా సమస్యల నుంచి వారిని బయటపడే కాకుండా వారి కుటుంబాలకు కూడా అండగా నిలుస్తామని చెబుతారు, అయితే దానికి ఒక పని చేయాల్సి ఉంటుందని చెబుతూ ఒక సీక్రెట్ మిషన్ కోసం బోర్డర్ దాటి చైనాలోకి ప్రవేశించాల్సి ఉంటుందని సూచనలు ఇస్తారు.అయితే వీరిని పిలిపించిన ఆగంతకులు ఎవరు? ఈ ఆరుగురికి కలిపి అప్పగించిన సీక్రెట్ మిషన్ ఏంటి? ఆ మిషన్ కోసం వీరిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, సీక్రెట్ మిషన్ విజయవంతంగా పూర్తి చేశారా లేదా అనేది సినిమా కథ.

విశ్లేషణ
గతంలో పలు హిట్ సినిమాలకు రచయితగా వ్యవహరించిన దీనరాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. సాధారణంగా ఏదైనా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చూసుకొని ఇలా ఎంట్రీ ఇస్తుంటారు కానీ దీనరాజ్ మాత్రం భిన్నంగా దేశభక్తితో కూడిన సినిమాతో దర్శకుడిగా మారారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా- పాకిస్తాన్ -ఇండియా మధ్య జరుగుతున్న వ్యవహారాల గురించి టచ్ చేయడమే సాహసం అని చెప్పాలి. అయితే ఎవరూ ఊహించని విధంగా దర్శక నిర్మాతలు ఆ సాహసం చేశారు. అలాగే ఈ దేశభక్తి సినిమాను ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా తెరకెక్కించడంలో కొంతవరకు సఫలం అయ్యారు. కొన్నిచోట్ల దేశభక్తికి సంబంధించిన ఎమోషన్స్ బాగా పండాయి. సినిమా ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం వారి వారి నేపథ్యంలో బాటలోనే సాగిపోగా సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు కథ కృష్ణులు ఉంటాయి. అందరిలా కాకుండా ఒక దేశభక్తి కలిగిన సినిమా తెరకెక్కించాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నం అభినందనీయం. అయితే దాన్ని మరింత ఎమోషనల్ గా పూర్తిస్థాయి ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కిస్తే సినిమా వేరే లెవెల్ లో ఉండేది.

ఎవరెలా చేశారంటే
దాదాపు సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే. తెలుగు (నిర్రోజ్ పుచ్చా), భోజ్‌పురి (శుభ రంజన్), నేపాలీ ((సిక్కిం) సోనమ్ తెందుప్ బర్ఫుంగా), పంజాబీ (సమైరా సంధు), త్రిపుర (పెడెన్ ఓ నామ్‌గ్యాల్), మరియు బెంగాలీ (రాజేశ్వరి చక్రవర్తి) తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సమైరా సంధు, పెడెన్ ఓ నామ్‌గ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి అయితే తెరపై గ్లామర్ తో కూడా ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ తమ పరిధి మేర నటించారు. టెక్నికల్ గా చూస్తే రచయితగా ఆకట్టుకున్న దీనరాజ్ దర్శకుడిగా మాత్రం పూర్తిస్తాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ మ్యాజిక్ తో సరిహద్దు ప్రాంతాలను గ్రాండ్ గా చూపించగలిగారు. ఇక సినిమాలోని సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా సాగాయి. నిడివి మీద ఎడిటర్ కొంత దృష్టి పెడితే మరింత క్రిస్పీగా చేసి ఉంటే బాగుండేది.

బాటం లైన్:
దేశభక్తి ఉన్నవారికి నచ్చే ‘భారతీయన్స్’