దర్శకుడు మారుతి ఒక వక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోపక్క తను స్నేహితులు తన టీమ్ నుంచి ఎవరైనా మంచి కథలు తీసుకొస్తే దాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బ్యూటీ అనే ఒక సినిమా సిద్ధం చేశారు. అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి హీరోయిన్‌గా, నరేష్, వాసుకి, మురళీధర్ గౌడ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం బ్యూటీ. బేబీకి సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమాని శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేశాడు. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి.
బ్యూటీ కథ:
విశాఖపట్నంలో నారాయణరావు (నరేష్) ఒక క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య వాసుకి, కుమార్తె అలేఖ్య (నీలఖి), కుమారుడితో జీవనం సాగిస్తూ ఉంటాడు. అలేఖ్య అందరిలాంటి ఆడపిల్ల అయినా తండ్రి స్థాయి తెలుసుకోకుండా ఖర్చు పెడుతూ ఉంటుంది. స్నేహితురాలు స్కూటీ కొనుక్కుందని తనకు కూడా స్కూటీ కావాలని మారం చేసిన ఆమెకు స్కూటీ కొనిచ్చే ప్రయత్నం చేస్తాడు నారాయణరావు. ఈలోపే ఒక చిన్న గొడవగా అర్జున్ (అంకిత్ కొయ్య)తో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత అనుకోకుండా అలేఖ్య అతనితో సన్నిహితంగా ఉంటూ తల్లికి దొరికిపోతుంది. తనను చంపేస్తారేమో అనే భయంతో అలేఖ్య అర్జున్ ను ప్రేరేపించి హైదరాబాద్ పారిపోతుంది అలేఖ్య. ఆ తర్వాత ఏం జరిగింది? నారాయణరావు హైదరాబాద్ వెళ్లి కూతుర్ని కాపాడుకోగలిగాడా? లేదా చివరికి ఏం జరిగింది అనేది సినిమా కథ.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమాలో ఎంత మాత్రమూ కొత్త కథ గాని కథనం గానీ ఉన్నాయని చెప్పలేము. ఎందుకంటే మనం గతంలో ఎన్నో సినిమాల్లో చూసిన విధంగానే ఓ మంచి కుటుంబం, అందులో అమ్మాయి ప్రేమలో పడటం, తర్వాత కుటుంబం విచ్ఛిన్నం కావడం, అనేక ఇబ్బందులు పడటం అంటే అంశాలు చూపించారు. నిజానికి ఇలాంటి కథతోనే గతంలో ఎన్నో సినిమాలు చూశాం. ఈ సినిమా కూడా దాదాపుగా అదే కోవలో సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్‌గా నడిపించడంలో దర్శకుడు కాస్త సక్సెస్ అయ్యాడు. ముందుగా హీరోయిన్ పాత్ర పరిచయం తర్వాత హీరోతో ప్రేమలో పడటం వంటి అంశాలు చూపించారు. అందులో కాస్త రొమాన్స్ కూడా మిక్స్ చేశారనుకోండి. అది వేరే విషయం. ఇక ఆ తర్వాత ఒక మంచి ఆసక్తికరమైన ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కదా మొత్తం మనకు తెలిసిన మరో సినిమా లాగానే అనిపిస్తుంది. తండ్రి హైదరాబాద్ వెళ్లడం, కూతుర్ని వెతుక్కునే పనిలో పడటం వంటివి రొటీన్ అనిపిస్తాయి. అయితే ప్రీ క్లైమాక్స్ షాక్ అనుకున్నారు కానీ అది ఈ మధ్యకాలంలోనే వచ్చిన మరో సినిమాని పోలి ఉండడంతో అది అంతగా పేలలేదు. అయితే ఈ సినిమా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు, తల్లితండ్రులను మోసం చేసే ఆడపిల్లలకు, తల్లితండ్రుల మాట విని జాగ్రత్తగా పెరిగిన ఆడపిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. నిజానికి ఇలాంటి కథలను మనం నిజజీవితంలో ఎక్కడో ఒకచోట ఫేస్ చేసే ఉంటాం. అదే ఈ సినిమాకి కొంత ప్లస్ పాయింట్. అయితే అదే మైనస్ పాయింట్ కూడా. ఎందుకంటే ఈ సినిమాకి అన్ని వర్గాల వారు కనెక్ట్ కాలేకపోవడానికి కూడా అదే రీసన్. అమ్మాయిలను కన్న తల్లిదండ్రులు కనెక్ట్ అయినంత బాగా కామన్ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ కాలేరు.
నటీనటుల విషయానికి వస్తే, అర్జున్ అనే పాత్రలో అంకిత్ కొయ్య పరిణితి కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. అతనికి తన నటనలో మార్పు చూపించే అవకాశం కనపడింది. హీరోయిన్ పాత్రలో నటించిన నీలఖికి ఇది మొదటి సినిమా అనే ఫీలింగ్ లేకుండా ఆమె నటించింది. ఇక నరేష్ మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రలో ఈ విడిపోయాడు. ఆయన భార్య పాత్రలో వాసుకి పరకాయ ప్రవేశం చేసేసింది. ఇక మిగతా పాత్రధారులు అందరు తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, కథ రాసిన సుబ్బుతో పాటు దర్శకుడు వర్ధన్ కూడా సినిమా కోసం చాలా కష్టపడినట్లే కనిపించింది. కానీ రిలేటబుల్ కంటెంట్ అయినా కూడా ఎందుకు మరో సినిమా పోలికలు కనపడటంతో సినిమా పూర్తిస్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. కొంతమందికి బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమా కొంతమందికి మాత్రం కనెక్ట్ కాలేక పోతుంది. అయితే సంగీతం పర్వాలేదు. కన్నమ్మ సాంగ్ బాగా వర్క్ అవుట్ అయింది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ మంచి ప్లేసెంట్ ఫీల్ తీసుకువచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు చాలా ఫ్రేమ్స్‌లో కనిపించింది.
ఫైనల్‌గా ఈ బ్యూటీ కొందరికే.