Ameer Log Review: : అమీర్ లోగ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు
- DIRECTOR: రమణారెడ్డి సోమ
- MUSIC: స్మరన్ సాయి
- PRODUCER: మాధవి రెడ్డి సోమ
దగ్గుబాటి రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్‌పై విడుదల కావడం, హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌తో ప్రమోషన్స్ జరగడంతో ‘అమీర్ లోగ్’ చిత్రంపై సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. సహజత్వానికి దగ్గరగా ఉండే బస్తీ లైఫ్‌ను వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
అమీర్ లోగ్ కథ:
హైదరాబాద్‌లోని ఓ బస్తీలో శ్రీను (MC హరి), ఫరూక్ (మనోజ్), మల్లేష్ (శశిధర్) అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఎలాంటి పనిపాటా లేకుండా తిరుగుతూ, తాగుతూ జులాయిగా గడిపేస్తుంటారు. ఓ రోజు అదే బస్తీకి చెందిన నజీర్ (సాయియోగి)తో క్రికెట్ గొడవ పెద్దదవుతుంది. వీరి పరిస్థితిని గమనించిన అదే బస్తీకి చెందిన గీత (వేద జలంధర్) వీరిని తమ్ముళ్లుగా భావించి బుద్ధి చెప్పి మారమని సూచిస్తుంది. ఆమె సాయంతో శ్రీను ఓ ఆఫీస్‌లో ఆఫీస్ బాయ్‌గా చేరతాడు. అక్కడ ఆఫీస్ ఉద్యోగులతో క్రికెట్ ఆడిన శ్రీను.. ‘మా బస్తీ వాళ్లు మీకంటే బాగా ఆడతారు’ అని పంతానికి పోయి బెట్ కడతాడు. ఆ మ్యాచ్‌లో బస్తీ టీమ్ గెలిచిందా? ఓడిపోయిందా? బస్తీలోని పెద్దాయన చాచా (విశ్వేందర్) వీరికి ఏ విధంగా సహాయపడ్డాడు? ఈ కథలోకి ‘బిర్యానీ’ కాన్సెప్ట్ ఎలా ప్రవేశించింది? గీత ప్రియుడు రవి (రావణ్) ఎంట్రీతో వీరి జీవితాలు ఎలా మారాయి? చివరికి ఈ ముగ్గురు కుర్రాళ్లు జీవితంలో ఎలా సెటిల్ అయ్యారనేదే మిగతా కథ.
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
విశ్లేషణ:
‘అమీర్ లోగ్’ కథాంశం రొటీన్‌గానే అనిపిస్తుంది. ఖాళీగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు, బాధ్యత తెలుసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వడం అనే పాయింట్ చుట్టూ గతంలో పలు హైదరాబాదీ చిత్రాలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లో మొదటి అరగంట కుర్రాళ్ల అల్లరి, తిరుగుడు సన్నివేశాలతో రొటీన్‌గా సాగుతుంది. అయితే వారు ఏదైనా సాధించాలి అనుకున్న దగ్గర్నుంచి, ఇంటర్వెల్ ముందు వచ్చే బస్తీ వర్సెస్ ఆఫీస్ టీమ్ క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ వరకు కథనం వేగం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో బిర్యానీ నేపథ్యంతో సాగే ఎమోషనల్ ట్రాక్, కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్‌లో పార్ట్-2కి లీడ్ ఇవ్వడం ఆసక్తికరం. ఈ సినిమాకు ప్రధాన బలహీనత భాష. తెలుగు సినిమాగా ప్రచారం చేసినప్పటికీ, ఇందులో తెలుగు కంటే డక్కనీ ఉర్దూ, హిందీ డైలాగులే ఎక్కువగా ఉన్నాయి. ఉర్దూ మిక్స్ అయిన దక్కనీ భాష అది. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న క్రమంలో సబ్ టైటిల్స్ కూడా వేయక పోవడం వల్ల సాధారణ తెలుగు ప్రేక్షకులకు చాలా సంభాషణలు అర్థం కావడం కష్టమే. అయితే ‘అమీర్ లోగ్’ (ధనవంతులు) అనే టైటిల్‌కు పెట్టిన జస్టిఫికేషన్ సీన్ ఆకట్టుకుంటుంది. అలానే ఫస్టాఫ్ రొటీన్ ఫీల్ ఇచ్చినా హైదరాబాదీలకే సాధ్యమైన ఆత్మీయత, ఒకరికొకరు అండగా నిలిచే సీన్స్ కొన్ని మంచిగా అనిపించాయి. ఒకరకంగా ఇది రూటేడ్ హైదరాబాద్ బస్తీ కుర్రాళ్ళ కధ. రొటీన్ అయినా, కొంతవరకు ఎంగేజ్ చేసేలానే ఉంది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ప్రధాన పాత్రలు పోషించిన హరి, మనోజ్, శశిధర్ కొత్తవారైనప్పటికీ తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. గీత పాత్రలో వేద జలంధర్ హుందాగా కనిపించారు. చాచా పాత్రలో నటించిన విశ్వేందర్ ఎమోషనల్ సీన్లలో మంచి పరిపక్వత కనబరిచారు. రావణ్ నిట్టూరు, సాయియోగి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. లోకల్ బస్తీ నటీనటులు తెరపై సహజత్వాన్ని తీసుకొచ్చారు. దర్శకుడు రమణా రెడ్డి సోమ ఎంచుకున్న కథ పాతదే అయినా, హైదరాబాద్ బస్తీ నేటివిటీని ప్రతిబింబించేలా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నేపథ్య సంగీతం సన్నివేశాల స్థాయిని పెంచగా, పాటల కంపోజిషన్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీలో క్రికెట్ మ్యాచ్ షాట్స్ సినిమాటిక్‌గా ఉన్నాయి, అయితే కొన్ని చోట్ల కలర్ గ్రేడింగ్ లోపాలు కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లోని ల్యాగ్ సీన్లను ఎడిటింగ్‌లో మరింత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. బడ్జెట్ పరిమితులకు తగ్గట్టు నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి.
ఫైనల్లీ ఈ అమీర్ లోగ్ దక్కనీ భాషపై పట్టుంటే మెప్పిస్తుంది!
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!