Agadha Review: అగధ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Kamakshi Bhaskarla, Sravan Reddy, Jovika, Ulka Guptha and others
- DIRECTOR: M.s Raju
- MUSIC: Rakesh Venkatapuram
- PRODUCER: Kasi Visalakshi
ఇప్పటి స్టార్ హీరోలతో వరుసగా అప్పట్లో నిర్మాతగా సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టిన ఎం.ఎస్. రాజు, ఆ తర్వాత స్పీడ్ తగ్గించారు. అయితే ఆయన ఈ మధ్యకాలంలో దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ‘అగధ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో భానుచందర్, వనితా విజయ్ కుమార్, జోవికా విజయ్ కుమార్ సహా శ్రవణ్ రెడ్డి వంటివారు ఇతర పాత్రలలో నటించారు. ప్రమోషన్స్‌తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
అగధ కథ:
కథ అంతా ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల మధ్య జరుగుతూ ఉంటుంది. దేవి ఆరాధనలో ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) అనునిత్యం ఆత్మలతో మాట్లాడుతూ ఎంతోమంది ఇబ్బందులను తొలగిస్తూ ఉంటుంది. అయితే తన బాబాయ్ భానుచందర్ కూతురు మహిమ (వుల్కా గుప్తా) కడుపులో బిడ్డ ఉండగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలుసుకుని కలత చెందుతుంది. తన కుటుంబానికి చెందిన చాలామంది అనూహ్య పరిస్థితులలో మరణించిన విషయం తెలుసుకుని, తన దగ్గరకు ఒక పుస్తకం రాసేందుకు వచ్చిన ఓ జంటతో కలిసి తన సొంత ఊరికి బయలుదేరుతుంది.
Also Read
అలా వెళ్లాక, అక్కడ తన పిన్ని (వనితా విజయ్ కుమార్), తన చెల్లి హరిణి (జోవికా) వింతగా ప్రవర్తించడం గమనిస్తుంది. తన చెల్లి మహిమ మరణానికి కారణం తెలుసుకునే ప్రయత్నంలో, ఆమె ప్రియుడు సింహ (శ్రవణ్ రెడ్డి) కూడా వింతగా ప్రవర్తించడాన్ని మహాదేవి గమనిస్తుంది. అయితే అసలు మహిమ మరణానికి కారణం ఏంటి? హరిణి, సింహ వింతగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? అనే విషయాలను మహాదేవి కనిపెట్టిందా? అసలు ‘అగధ’ అంటే ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగానే సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ సినిమాల మీద ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాను కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయడంతో, ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఇక సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినిమా మీద అంచనాలు పెంచుతూ వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక స్నేహితుల బృందం ఏదో ఒక అటవీ ప్రాంతంలోకి వెళ్లడం, అందులో కేవలం ఒక్కరు మాత్రమే బతికి బయటకి రావడం, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అంటూ ఫస్టాఫ్‌లోనే సినిమా మీద ప్రేక్షకులలో ఒక రకమైన ఉత్సుకత పెంచడానికి ప్రయత్నం చేశారు.
వాస్తవానికి సినిమా ప్రారంభమైన చాలాసేపు ఈ సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు అగధ అంటే ఏమిటి అనే విషయాన్ని ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకుండానే కథను నడిపించే ప్రయత్నం చేశారు. అది కొంతవరకు ఆసక్తి రేకెత్తించినా, ఒకసారి అది రివీల్ అయ్యాక కొంత రొటీన్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్న విధంగానే దైవ, దుష్టశక్తుల మధ్య పోరు రొటీన్ అనే అనిపిస్తుంది. అయితే దాన్ని ఎలా సినిమాటిక్‌గా చూపించామనే దాని మీద ఆధారపడి రిజల్ట్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో దాన్ని పూర్తిస్థాయిలో ఎంగేజింగ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విషయంలో మాత్రం టీమ్ తడబడింది.
ఫస్టాఫ్‌లో ఎదురైన ప్రశ్నలకు సమాధానం సెకండాఫ్‌లో మహాదేవి ప్రయాణంతో చూపించారు. అది కొంతవరకు ఆసక్తికరమే. అసలు అగధ అంటే ఏమిటి? దాని లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా కట్టడి చేస్తారు? అనేది థ్రిల్లింగ్‌గా రూపొందించడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. సినిమాలో ఉన్నవి కొన్ని క్యారెక్టర్లే అయినా కూడా, అన్నింటినీ అర్థవంతంగా రాసుకోవడంలో టీమ్ సక్సెస్ అయినట్లు అనిపించింది. ఎక్కడ కూడా అనవసరమైన పాత్రలు చూస్తున్న ఫీలింగ్ కలగకుండా, ఉన్న పాత్రలతోనే కథ చెప్పించే ప్రయత్నం చేశారు. రాసుకున్నంతవరకు బాగానే ఉన్నా, స్క్రీన్ మీద ప్రేక్షకులను ఎక్సైట్ చేసే మోమెంటమ్ క్రియేట్ చేయడంలో మాత్రం టీమ్ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయింది.
ఫస్టాఫ్ అంతా కూడా కథ పూర్తిగా రివీల్ కాకుండానే సాగుతూ వెళ్లగా, ఒకసారి ‘అగధ’ అంటే ఏమిటి అనే క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ మాత్రం కాస్త భిన్నంగా అనిపిస్తుంది. మామూలుగా అయితే దుష్టశక్తులను సంహరిస్తారు, కానీ ఇక్కడ దుష్టశక్తిని లాక్ చేసిన విధానం కొంత ఇన్నోవేటివ్‌గా అనిపించింది.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’ అంటూ ఒక కీలక పాత్రలో కనిపించింది. చాలా బరువున్న పాత్రలో ఆమె తనదైన శైలిలో ఆకట్టుకునేలా నటించింది. కొన్నిచోట్ల కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నటిస్తూ రావడం ఆ పాత్రకు బాగా ప్లస్ అయింది. ఇక జోవికా విజయ్ కుమార్‌కి కూడా మంచి పాత్ర పడింది; కొన్ని సీన్స్‌లో భయపెట్టడం, షాక్ ఇవ్వడం చేసింది. ఇక వుల్కా గుప్తా, శ్రవణ్ రెడ్డి, భానుచందర్, షిజు వంటివాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే మాత్రం బిజిఎమ్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లడంలో ఉపయోగపడింది. అలాగే విజువల్స్ కూడా సినిమాను చాలా గ్రాండియర్‌గా చూపించాయి. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది; నేచురల్ ఫీలింగ్ కలగకుండా సెట్స్‌లోనే చేసిన ఫీలింగ్ రావడం కొంత ఇబ్బందికర అంశం. ఇక దర్శకుడిగా ఎమ్.ఎస్. రాజు ఎంచుకున్న కథ కొంచెం కొత్తగా అనిపించినా, ట్రీట్మెంట్ మాత్రం పాతగానే అనిపిస్తోంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్‌గా: ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘అగధ’ థ్రిల్లర్ లవర్స్‌కు నచ్చొచ్చు.
తాజావార్తలు
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?