NTV Telugu Site icon

7 Days 6 Nights Review : రివ్యూ 7 డేస్ 6 నైట్స్

7 Days 6 Nights Movie Review

7 Days 6 Nights Movie Review

ఎం.ఎస్. రాజు పేరు వినగానే ఆయన తీసిన పలు బ్లాక్ బస్టర్స్ గుర్తుకురాక మానవు. అయితే ఇటీవల కాలంలో ఆయన నిర్మాతగానే కాదు దర్శకుడుగానూ వెనకబడ్డారు. అలాగే హీరోగా మారిన ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఖాతాలో కూడా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు. ఈ నేపథ్యంలో తన కుమారుడితో ఎం.ఎస్. రాజు తీసిన తాజా చిత్రమే ‘7 డేస్ 6 నైట్స్’. మరి ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోంది. తన కొడుకుకు హిట్ ఇచ్చి దర్శకుడుగా తను కూడా సక్సెస్ అనిపించుకున్నాడా? అన్నది చూద్దాం.

దర్శకుడు కావాలని కలలు కనే యువకుడు ఆనంద్ (సుమంత్ అశ్విన్). తను తీసే యాడ్ ఫిల్మ్ లలో, షార్ట్ ఫిల్మ్స్ లో నటించే వాడు కుమార మంగళం (రోహన్). విన్నీ అనే అమ్మాయి ప్రేమలో పడ్డ ఆనంద్ ఆమె లైప్ లో సెటిట్ అవటానికి యుస్ వెళ్ళడంతో ఒంటరితనంతో మందుకు బానిస అవుతాడు. మరదల్ని పెళ్ళాడబోతున్న రోహన్ కి ప్రామిస్ చేసిన విధంగా బ్యాచ్ లర్స్ పార్టీ ఇస్తానని గోవా ట్రిప్ వేస్తాడు. అలా గోవా వెళ్ళిన ఈ ఇద్దరివి భిన్న మనస్థత్వాలు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే వాడు కుమార మంగళం అయితే ప్రేమించిన అమ్మాయి రాకకోసం ఎదురు చూస్తూ డైరక్టర్ గా సెటిల్ కావాలనుకునేవాడు ఆనంద్. అయితే విదేశాలకు వెళ్ళిన ప్రియురాలు అక్కడే ఎవరినో పెళ్ళి చేసుకుని సెటిల్ అయిందనే వార్తను ఫ్రెండ్ ద్వారా విని అప్ సెట్ అవుతాడు ఆనంద్. కానీ ఎప్పుడూ గోవాలో తనకు అలవాటున్న రెస్టారెంట్ లో పరిచయం ఉన్న అమ్మాయి రతికకు తనంటే ఇష్టం ఉందని తనని ట్రై చేయమని ప్రోత్సహిస్తాడు మంగళం. ఇక మంగళం కూడా తన పెళ్ళి విషయం దాచిపెట్టి రితిక ప్రెండ్ అమియాతో ఎంజాయ్ చేస్తుంటాడు. మంగళం పెళ్ళి విషయం తెలిసిన అమియా ఎలా రియాక్ట్ అయింది. ఆనంద్ ప్రేమను రతిక అంగీకరిస్తుందా? ఆనంద్ కథ సినిమాగా ఓకె అయిందా? వీటన్నింటికి సమాధానమే ‘7 డేస్ 6 నైట్స్’.

కథగా చెప్పుకోవడానికి ఏం లేదు. కనీసం స్ర్కీన్ ప్లే పరంగా నైనా ఆసక్తి కరంగా ఉందా? అంటే అదీ లేదు. సినిమా ఆసాంతం స్లోగా నిరాసక్తంగా సాగుతుంది. సూపర్ హిట్స్ తీసిన ఎ.ఎస్. రాజు సినిమానా అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే సుమంత్ అశ్విన్ తన పాత్ర పరిధి మేరకు చక్కగానే చేశాడు. అయితే కుమార మంగళం పాత్ర పోషించిన రోహన్ హుషారుగా నటించాడు. మిగిలిన వారి గురించి చెప్పుకోవడానికి అంత ఏమీ లేదు. అయితే సినిమా లొకేషన్లు మాత్రం చక్కగా ఉన్నాయి. ఆ లొకేషన్లను కెమెరామేన్ అద్భుతంగా చూపించాడు. సమర్థ్ గొల్లపూడి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథానుసారంగా ఉంది. డైలాగ్స్ మాత్రం అక్కడక్కడ బాగానే పేలాయి. అయితే దర్శకుడుగా ఎ.ఎస్. రాజు, హీరోగా సుమంత్ అశ్విన్ కోరుకున్న హిట్ మాత్రం ఈ సినిమాతో దక్కకపోవచ్చు.

ప్లస్ పాయింట్స్ :
సినిమా నిడివి
లొకేషన్లు
కెమెరా వర్క్
డైలాగ్స్

మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ, కథనం
స్లో నెరేషన్

ట్యాగ్ లైన్: ‘7 డేస్ 6 నైట్స్’ వృధానే!

Show comments