సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మించిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రానికి శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహించారు. #90s వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ నిర్మాత రాజశేఖర్ మేడారం ఈ చిత్రాన్నిరిలీజ్ చేస్తున్నారు. ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ చిత్రాలలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అంకిత్ కొయ్య హీరోగా నటించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఈ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
హర్ష(అంకిత్ కొయ్య) ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనుకునే కుర్రాడు. డేటింగ్ యాప్ లో ఆహాన(శ్రియ కొంతం) అనే అమ్మాయి ప్రొఫైల్ చూసి తనతో పరిచయం పెంచుకుంటాడు. ఆహాన పేరెంట్స్ ఒక పెళ్లికి వెళ్లడంతో హర్షను ఇంటికి రమ్మంటుంది. అలా గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన హర్ష అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆహాన తల్లిదండ్రులకు, తాతాకు తెలియకుండా అన్ని రోజు హర్ష ఇంట్లోనే ఎలా ఉన్నాడు? హర్షను దాచిపెట్టడంలో ఆహాన ఎలాంటి పాట్లు పడింది? పెళ్లికి వెళ్లికి వెళ్లిన పేరెంట్స్ ఎందుకు త్వరగా తిరిగి వచ్చారు? ఆహానకు వచ్చిన మరో సమస్య ఏంటీ? దాని నుండి ఆహానా,హర్ష ఎలా బయటపడ్డారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఫిల్మ్ మేకర్ కావాలనుకునే కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనుకోని పరిస్థితిలో ఇరుక్కుంటే ఏంటి పరిస్థితి అనే చాలా సింపుల్ పాయింట్ తో కథను అల్లుకున్నాడు దర్శకుడు. దాన్ని తెరమీదకు తేవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అనవసరపు హంగులకి పోకుండా నేరుగా చెప్పాలనుకున్న పాయింట్ కు కామెడీని జోడించి నవ్వులు పూయించారు. కథలో అసలు పాయింట్ హీరో ఇంట్లో లాక్ అవడం. అక్కడి నుంచి కథ రొమాంటిక్ థ్రిల్లర్ గా మారుతుంది. దొరికిపోతాడేమో అన్న టెన్షన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగ పరచుకోవడం అనే పాయింట్ అందరు కనెక్ట్ అవుతారు. అయితే సినిమా అంతా ఒకే ఫ్లాట్ లో జరగడం వలన సీన్స్ రిపీటెడ్ గా వస్తున్నాయి ఫీల్ వస్తుంది. పాటలు అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ లో వచ్చే చిన్న ట్విస్ట్ ను సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశారు. దర్శకుడు శ్రీ హర్ష మన్నే కథను నడిపించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. కామెడీతో పాటు క్లైమాక్స్ లో ఎమోషన్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటులు విషయానికి వస్తే అంకిత్ కొయ్య చాలా సెటిల్డ్ గా నటించారు. చాలా రకాల భావోద్వేగాలను చేసే పాత్రలో అంకిత్ నటన ఆకట్టుకుంది. శ్రియ కొంతం నటన మెప్పించింది. తన ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి.ఈ సినిమాలో ముఖ్యంగా వెన్నెల కిషర్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాను తనదైన కామెడీ టైమింగ్ తో నిలబెట్టాడు. వెన్నెల కిషోర్ యాక్టింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ ఛానెల్ పేరుతో వెన్నెల కిశోర్ ఛానల్ కి వచ్చే కామెంట్స్ నవ్వని వారు ఉండరు. సీనియర్ నటి ఇంద్రజ పాత్ర కొంతే ఉన్నా కూడా మంచి పాత్ర పడింది. మిగతా నటీనటులంతా వారి పాత్రల మేరకు అలరించారు
ఫైనల్లీ : 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో.. కావాల్సినన్ని నవ్వులు.. దోసెడు భావోద్వేగాలు