రీటైల్ వ్యాపారంలో బ్రాండ్ ఇమేజ్ సృష్టించిన ఆర్.ఎస్.బ్రదర్స్, దక్షిణ భారతదేశంలో విస్తరణలో భాగంగా, 2025 నవంబరు 6వ తేదీన, తెలంగాణలో చరిత్ర సృష్టించిన వరంగల్ నగరంలో తమ సరికొత్త షోరూమ్ అంగరంగ వైభోగంగా శుభారంభం చేసింది. వ్యాపారరంగంలో ప్రముఖ దార్శనికులైన పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు మరియు దివంగత పి.సత్యనారాయణ గార్లు సుదూర దృష్టితో ప్రణాళికాబద్ధంగా నెలకొల్పిన ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థ – సంప్రదాయాన్ని, ఆధునిక ఫ్యాషన్లను మేళవించి భారతదేశ వ్యాప్తంగా కొనుగోలుదారులకు చేరువవుతోంది. అందులో భాగంగా వరంగల్‌లోని సరికొత్త షోరూమ్ వైవిధ్యభరితమైన అభిరుచులు కలిగిన నగరవాసుల హృదయాల్ని చూరగొంది. ప్రముఖ సినీతార శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతిని వెలిగించి, కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె సరికొత్త షోరూమ్‌ను సందర్శించి వరంగల్‌లోని షాపింగ్‌ప్రియులకు ఇది అందమైన కొనుగోలు గమ్యంగా నిలుస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ఆర్.ఎస్.బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, వినియోగదారుల అభిరుచుల వైవిధ్యానికి తగినట్లుగా తమ బ్రాండ్ మరింతగా విస్తరిస్తుందని అన్నారు. మారుతున్న పోకడలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నాణ్యతతో, సరసమైన ధరలతో కొత్తదనాన్ని అందించగలమని, ఇతర ప్రాంతాలలో కొత్త షోరూమ్స్ నెలకొల్పనున్నామని చెప్పారు. వరంగల్‌లో షోరూమ్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచిన వస్త్ర వైవిధ్యంలో- కుటుంబంలోని అన్ని తరాల అభిరుచులను ప్రతిబింబించే వుమెన్స్‌వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్ రూ.149ల ప్రారంభ ధరతో కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. కంచిపట్టు చీరలు, డిజైనర్ లెహెంగాలు మొదలుకుని పర్వదినాల్లో ధరించే కుర్తాలు, ఆకర్షణీయమైన వెస్ట్రన్‌వేర్ వంటివి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
సంస్థ ఛైర్‌పర్సన్, హోల్ టైం డైరెక్టర్ శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు , తమ వరంగల్ షోరూమ్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్, పెళ్లి కుమార్తె సంప్రదాయ వస్త్రాలంకరణకు సంబంధించిన సాధికారికమైన పనితనంలోని ప్రత్యేకత గురించి వివరించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సీర్ణ రాజమౌళి ` భారతదేశ వ్యాప్తంగా కొనుగోలుదారుల అభిరుచుల్ని, తాజా ఫ్యాషన్లను ప్రతిబింబించే వస్త్రశ్రేణి తమ వద్ద లభిస్తోందని చెప్పారు. సంస్థ హోల్ టైం డైరెక్టర్ శ్రీ తిరువీధుల ప్రసాదరావు వరంగల్‌వాసులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వరంగల్‌లోని కొనుగోలుదారులు మెచ్చుకునే వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఆకర్షణీయమైన ఫ్యాషన్లతో, అందుబాటు ధరలలో ఒకే చోట లభిస్తోందని, పండగలు, వివాహాది శుభకార్యాలకు అవసరమైన షాపింగ్ కోసం తమ షోరూమ్‌కి విచ్చేయాల్సిందిగా కోరారు.