Rainbow Children’s Hospital : గోదావరి జిల్లాల ప్రజలకు సమగ్రమైన చిన్నారులు, మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే లక్ష్యంతో, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ (Rainbow Children’s Hospital), బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్ (BirthRight by Rainbow Hospitals) రాజమహేంద్రవరంలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం డిసెంబర్ 17, 2025 నాడు ఉదయం 10:30 గంటలకు జరగనుంది.
ఈ కార్యక్రమం రాజమండ్రిలోని గాంధీపురం 1, ఏవీఏ రోడ్‌లో ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఈ ప్రత్యేకమైన ప్రారంభోత్సవానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేసిన శ్రీమతి బ్రాహ్మణి నారా, USAలో MBA పూర్తి చేసి Philanthropist గా సేవలందిస్తున్న శ్రీమతి తేజస్విని నందమూరి మాతుకుమిల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ కొత్త ఆసుపత్రుల ప్రారంభం గోదావరి జిల్లాల వైద్య రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది.
MLA Madhavaram: IDPL ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ సర్కార్..
