సమాజంలో ఫెర్టిలిటీ అవగాహన పెంపొందించడానికి మరో ముందడుగు.. రాజాంలో ఓయాసిస్ జనని యాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ కోట, 26 నవంబర్ 2025: భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థల్లో ఒకటైన ఓయాసిస్ ఫెర్టిలిటీ, దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఓయాసిస్ జనని యాత్ర రాజాం చేరింది. టైర్ I, II, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ ఎం సి చైర్మన్ జి సి క్లబ్ సెక్రెటరి, శ్రీ గురువన నారయణ రావు హాజరై, ఫెర్టిలిటీ అవగాహనను కుటుంబాలకు దగ్గర చేస్తూ, సమాజ స్థాయి ఆరోగ్య చైతన్యాన్ని బలోపేతం చేస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ ప్రయత్నాలను అభినందించారు.
జీవనశైలి మార్పులు, ఆలస్య వివాహాలు, శాస్త్రీయ అవగాహన లోపం వంటి కారణాలతో ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఓయాసిస్ జనని యాత్ర బస్సు దంపతులకు ఉచిత ఫెర్టిలిటీ సంప్రదింపులు, ఉచిత AMH పరీక్ష, ఉచిత వీర్య పరీక్ష, ఉచిత హీమోగ్లోబిన్ పరీక్షలు వంటి సేవలను అందిస్తోంది. శుభ్రమైన, సురక్షితమైన నమూనా సేకరణ ప్రాంతాలతో ఈ సేవలు మరింత సౌకర్యవంతంగా అందించబడుతున్నాయి. రాజాం తర్వాత ఈ జనని యాత్ర అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లి మరిన్ని సముదాయాలకు అవగాహనను తీసుకెళ్తుంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్య అతిథి ఏఎంసి చైర్మన్ జిసి క్లబ్ సెక్రెటరి, శ్రీ గురువన నారయణ రావు గారు, “శాస్త్రీయ సమాచారం సమాజానికి చేరితే కుటుంబాలు శక్తిమంతం అవుతాయి, భయాలు, అపోహలు తొలగుతాయి, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. జనని యాత్ర వంటి కార్యక్రమాలు భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజనన ఆరోగ్యంపై అనివార్యమైన అవగాహనను పెంపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఓయాసిస్ ఫెర్టిలిటీని అభినందిస్తున్నాను”, అని అన్నారు.
డా. దుర్గా జి. రావు, మెడికల్ డైరెక్టర్ & కో-ఫౌండర్, ఓయాసిస్ ఫెర్టిలిటీ, “సైన్స్ ఫెర్టిలిటీ రంగాన్ని మారుస్తున్న ఈ సమయంలో, ఓయాసిస్ జనని యాత్ర ఆధునిక, సాక్ష్యాధారిత ఫెర్టిలిటీ గురించిన సమాచారాన్ని సమాజాల మధ్యకు నేరుగా తీసుకెళ్తోంది. ఫెర్టిలిటీ యాత్రను ప్రారంభిస్తున్న దంపతులకు తొందరగా వైద్య మార్గదర్శకాన్ని అందించడం ద్వారా భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన మార్గం సృష్టిస్తుంది.” అని వ్యక్తపరిచారు.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
శ్రీ పుష్కరాజ్ షెనాయ్, సీఈఓ, ఓయాసిస్ ఫెర్టిలిటీ, “భారతదేశ ఫెర్టిలిటీ రేటు నిరంతరం పడిపోతున్న ఈ సమయంలో, సమయానుకూలమైన, అందుబాటులో ఉన్న ఫెర్టిలిటీ సంరక్షణ మరింత ముఖ్యమైంది. నిపుణుల కన్సల్టేషన్, డయగ్నస్టిక్స్, అవసరమైన మార్గదర్శకంతో ‘గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్’ను గ్రామీణ స్థాయికి విస్తరించుతున్నాం. ప్రతి దంపతి సరైన నిర్ణయాలు తీసుకునేలా సకాలంలో సహాయం అందించడం మా ధ్యేయం.” అని తెలిపారు.
డా. రాధిక పొట్లూరి, రీజినల్ మెడికల్ హెడ్ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, “మునుపటి జనని యాత్రకు వచ్చిన అపార స్పందన దంపతులు సరైన మార్గదర్శకాన్ని ఎంత విలువగా తీసుకుంటారో చూపించింది. ఇంకా ఫెర్టిలిటీపై అవగాహన తక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో సరైన సమాచారం, సానుభూతితో కూడిన సహాయాన్ని అందించడం మా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.” అని అన్నారు.
Oasis Fertility గురించి:
2009లో స్థాపించబడిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, భారతదేశవ్యాప్తంగా 34 కేంద్రాలతో అగ్రగామి రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్. శాస్త్రీయ నైపుణ్యం, నైతిక వైద్యపద్ధతులు, అత్యున్నత IVF విజయశాతాలతో ప్రసిద్ధి చెందిన ఓయాసిస్, ఇన్నాళ్లుగా అనేక కుటుంబాలకు ఆరోగ్యకరమైన బిడ్డలను అందించింది. పురుషులు మరియు మహిళల కోసం IVF, IUI, ICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి విస్తృత సేవలను ఆధునిక ల్యాబ్ టెక్నాలజీ, వ్యక్తిగత సంరక్షణ, సంపూర్ణ వెల్‌నెస్ సహకారంతో అందిస్తోంది.
తాజావార్తలు
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!