CMR Shopping Mall: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ టెక్స్‌టైల్ అండ్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ఈరోజు (డిసెంబర్ 5న) ఉదయం 10:08 గంటలకు సౌందర్య జంక్షన్ లో పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు బోనెల విజయ్చంద్ర మాట్లాడుతూ.. సీఎంఆర్ లాంటి పెద్ద సంస్థ పార్వతీపురంలో నెలకొల్పటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలు పార్వతీపురానికి రావటం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇది వరకు ఏదైనా శుభకార్యాలకు షాపింగ్ చేయాలంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లో లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది, దీని వలన సమయం అదే విధంగా రవాణా ఛార్జీలు మరింత భారంగా ఉండేవి అన్నారు. పార్వతీపురం పరిశ్రమ ప్రాంతాల ప్రజలకు సీఎంఆర్ ఇక్కడ నెలకొల్పటం వలన మరిన్ని ఉద్యోగావకాశాలు రావటం చాలా ఆనందదాయకం అన్నారు.
Read Also: Google Search Trends: ధోని, కోహ్లీ, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇతడ్నే!
సీఎంఆర్ ఫౌండర్ అండ్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. తమ సంస్థను గత 4 దశాబ్ధాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ నాలుగు రాష్ట్రాలలో 40కు పైగా శాఖలను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎంఆర్ లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అన్ని రకాల వేడుకలకు సీఎంఆర్ తగు విధంగా అన్ని మోడల్స్ లో కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సీఎంఆర్ ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సీఎంఆర్ అందిస్తుందన్నారు.
Read Also: Solis JP 975 Tractor: దేశపు మొట్టమొదటి కొత్త తరం ట్రాక్టర్ JP 975 ను పరిచయం చేసిన సోలిస్..
అదే విధంగా సంస్థ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. సీఎంఆర్ అంటే ది వన్ స్టాప్ షాప్ అని ఏ శుభకార్యానికైనా ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన అన్నీ ఒకే చోట లభించే ఏకైక షాపింగ్ మాల్ సీఎంఆర్ అన్నారు. ఇక్కడ లేటెస్ట్ ఫ్యాషనికి అనుగుణంగా అన్నీ రీజనబుల్ ప్రైస్లో లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీతార రితికానాయక్, నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అన్ని సెక్షన్లు తిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించి ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు క్వాలిటీ చాలా బాగుందని, రీజనబుల్ ప్రెస్ లో లభిస్తున్నాయన్నారు, అంతే కాకుండా తమ డ్యాన్సులతో ఫ్యాన్సును
ఉర్రూతలూగించారు.