భూ వివాదంలో హైకోర్టుకు వెళ్లిన అధికార పార్టీ మంత్రి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో ఉంటే అన్నీ కాళ్ల దగ్గరకు వస్తాయని అనుకుంటారు. అందులోనూ మంత్రిగా ఉంటే ఇక చెప్పేది ఏముంది? కానీ.. ఆ మంత్రి మాత్రం డిఫరెంట్‌గా ఆలోచించారో ఏమో… భూమి హక్కుకోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంపై పిటిషన్ వేశారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా భూమి కథా?
సీఎస్ ఇతర అధికారులు ప్రతివాదులుగా హైకోర్టులో మంత్రి గంగుల పిటిషన్!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
తెలంగాణ ప్రభుత్వం భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా సంస్కరణలు చేపట్టింది. ఇందులో బాగంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఒక భూ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే ఇప్పుడు అధికార వర్గాల్లోనూ.. అధికార పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది. మంత్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ కలెక్టర్, వక్ఫ్‌బోర్డులను చేర్చారు. స్వయంగా రాష్ట్ర మంత్రి ఈ విధంగా భూమి హక్కుల కోసం హైకోర్టు తలుపు తట్టడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.
భూ హక్కుల కోసం గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు!
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని 126 సర్వే నెంబర్‌లో 15 ఎకరాల భూమిని మంత్రి గంగుల కమలాకర్ గతంలోనే కొనుగోలు చేశారట. అదే భూమిపై 95 లక్షల రుణం తీసుకుని బ్యాంకుకు చెల్లించినట్టు సమాచారం. అయితే మంత్రి చెబుతున్న భూమి తమదే అంటోంది వక్ఫ్‌బోర్డు. తగాదాలు రావడంతో కొంతమంది రైతులతోపాటు గంగుల కూడా భూ హక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు ఇస్తూ వచ్చారు.
హాట్ టాపిక్‌గా మంత్రి గంగుల నిర్ణయం
ఇప్పుడీ భూమిని వక్ఫ్ ల్యాండ్‌గా పరిగణిస్తూ.. భూ రిజిస్ట్రేషన్ విభాగం నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దాంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారట గంగుల. గతంలో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలలో సదరు భూమిపై మంత్రి గంగులకు హక్కు ఉందని తేల్చారట. వక్ఫ్ బోర్డు ఈ భూమిని డీ నోటిఫై చేయకపోవడం వల్లే సమస్య వచ్చిందని హైకోర్టులో వేసిన పిటిషన్‌లో మంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మంత్రి పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో ఏమో..ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ సందర్బంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సమస్య నుంచి బయటపడతారా?
ధరణిపైనా.. భూమి హక్కుల నిర్ధారణపైనా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంలో మంత్రి గంగుల కమలాకర్ సైతం భాగస్వామి. అందుకే ఇప్పుడు గంగుల చర్యలు చర్చకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే రాజకీయంగా వైరిపక్షాల నుంచి టీఆర్‌ఎస్‌లోని స్వపక్షాల నుంచి ఇబ్బంది పడుతున్న గంగుల కమలాకర్..ఈ సమస్య నుంచి బయటపడతారో? వివాదం మరిన్ని మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి