తెలంగాణలోని కొందరు సీనియర్ ఐఏఎస్‌ల లబోదిబో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
>> వడ్డించేవాడు మనవాడే అయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు. తేడా వచ్చిందో కడుపు మాడ్చుకోవాల్సిందే. తెలంగాణలో కొందరు సీనియర్ ఐఏఎస్‌ల పరిస్థితి కూడా అలాగే ఉందట. ప్రాధాన్యం లేని పోస్టుల్లోనే రిటైరైపోతున్నారు. కళ్లముందే జూనియర్లు కీలక పోస్టుల్లో ఉంటే.. తమకీ దుస్థితి ఏంటని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట.
లూప్లైన్లోనే సీనియర్ ఐఏఎస్‌ల పదవీ విరమణ!
Also Read
అనుభవం ఆధారంగా సీనియర్ IASలు కీలక పోస్టుల్లో కొనసాగుతారు. కొందరైతే రిటైర్మెంట్ టైమ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. కానీ.. తెలంగాణలో తమ పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారట పలువురు సీనియర్ ఐఏఎస్‌లు. సీనియారిటీ ఉన్నా.. ప్రాధాన్యం లేని పోస్టుల్లో కొనసాగాల్సి వస్తోందని..అక్కడే రిటైర్ కావాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. రిటైర్మెంట్ చివరి రోజుల్లో పనిష్మెంట్ ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కొందరు అధికారులు లూప్లైన్లో పోస్టుల్లోనే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉన్నవారి పరిస్థితి అంతేనని అనుకుంటున్నారట. దీనిని అవమానంగా భావిస్తున్నారట కొందరు ఐఏఎస్‌లు.
సీనియర్ ఐఏఎస్‌లపై అధికారుల్లో చర్చ!
ఇటీవల రిటైర్ అయిన IASలలో బీపీ ఆచార్య, జగదీశ్వర్, రాజేశ్వర్ తివారీ, బీఆర్ మీనా ఉన్నారు. ఒకప్పుడు వీరంతా ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన వారే. పదవీ విరమణ దగ్గరకు వచ్చే సరికి ఫ్రేమ్ నుంచి ఫేడ్ అవుట్ అయ్యారు. అలాగే ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఇదే విధంగా సర్వీస్ ముగించుకునే ఐఏఎస్‌లు ఎవరనే దానిపై ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న శాలినీమిశ్రా సాధారణ పరిపాలన విభాగంలో పనిలేని స్థానంలో ఉన్నారు. ఆమెకు మంచి పోస్ట్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ వరకు సర్వీస్ ఉంది. సీఎస్ కావాలని ఆశపడ్డ మరో సీనియర్ ఐఏఎస్ అదర్ సిన్హాను EPTRI డీజీగా బదిలీ అయ్యారు. ఈయన వచ్చే ఏడాది మార్చిలో రిటైర్ అవుతారు. ప్రస్తుతం స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌లో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇలాంటి సీనియర్లపై కథలు కథలుగా చెప్పుకొంటున్నారట అధికారులు.
సర్వీస్ ఉన్నవారు మంచి పోస్టింగ్‌ల కోసం ఎదురుచూపులు!
ఏప్రిల్‌లో రిటైర్ కాబోతున్న సీనియర్ ఐఏఎస్ చిత్రా రామచంద్రన్‌కు ఒక్కో బాధ్యతను తగ్గిస్తూ ప్రస్తుతం విద్యాశాఖకు పరిమితం చేశారు. గతంలో CMOలో, ఆరోగ్య శాఖలో పనిచేసిన మరో ఐఏఎస్ శాంతి కుమారి అటవీశాఖకు వెళ్లక తప్పలేదు. HMDA కమిషనర్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ చిరంజీవులను MCHRDకి బదిలీ చేశారు. ఇదే విధంగా మరికొందరు ఐఏఎస్‌లు.. సెక్రటేరియట్లో సీనియర్ ఉద్యోగులు చేసే పోస్టుల్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంకా సర్వీస్ ఉండటంతో.. భవిష్యత్‌లో తమకు మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.
సీఎంకు నచ్చక కొందరు.. సీఎస్‌తో పడక మరికొందరు..!
ఇలా లూప్ లైన్లో ఉన్న ఐఏఎస్‌లలో ఒకరిద్దరు మినహా మిగతా వారి ట్రాక్ రికార్డు బాగానే ఉన్నా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయకపోవడం, కొందరు పనితీరు సీఎంకు నచ్చక, తనకంటే జూనియర్ అయిన సీఎస్ సోమేశ్ కుమార్‌తో పడక.. నాన్ ఫోకల్ పోస్టింగ్స్‌లో పనిచేస్తున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో ఉందట. దీంతో ఐఏఎస్ కావడం ఒక ఎత్తు.. మంచి పోస్టు పట్టడం మరో ఎత్తులా మారిందని చెవులు కొరుక్కుంటున్నారట సీనియర్లు.
- Tags
- Senior IAS officers
- TRS
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!