MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ మొదలు..
- మిగతా వాళ్ళకంటే దూకుడుగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం..
- సీఎం, డిప్యూటీ సీఎం, అర డజన్ మంది మంత్రుల పరిధిలో ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్లు రెండూ రెడ్లరేనా? ఆ దిశగా అధిష్టానం ఫిక్స్ అయిందా? ప్రస్తుతం గెలుపు గుర్రాలు తప్ప మరో ఆలోచన లేదా? అదే నిజమైతే… సామాజిక న్యాయం సంగతేంటి? ఎన్నికలు జరిగే రెండు సీట్లు రెడ్లకే ఇచ్చేస్తే.. సామాజిక న్యాయం సంగతేంటి? ఆ లోటును ఎలా భర్తీ చేయాలన్నది కాంగ్రెస్ పెద్దల ప్లాన్?
తెలంగాణలో 2027లో జరగబోతున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలుపెట్టడంతో పొలిటికల్ యాక్టివిటీ పెరిగిపోతోంది. అయితే… అధికార పార్టీ కాంగ్రెస్… మిగతావాటన్నిటికంటే కాస్త దూకుడుగా ఈ ఎన్నికల్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ఉంది. ఎన్నికలు జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజక వర్గాల్లో పార్టీ తరపున కీలకమైన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు అర డజనుకు పైగా కేబినెట్ మంత్రులు ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక నుండి మొదలుకుని… అన్నిటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చూస్తోంది అధికార పార్టీ. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే అధిష్టానానికి జాబితా పంపింది పీసీసీ. ఒకటి…రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఒకటికాగా… రెండోది హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్.
ఈ రెండు చోట్ల నుంచి కాంగ్రెస్ తరపున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలనే బరిలో దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెడ్డి నాయకుల పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధి నాయకుడు చనగాని దయాకర్, లోకేష్ యాదవ్ లాంటి బీసీ నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే.. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌లలో ఒకరికి ఖమ్మం-నల్గొండ-వరంగల్ టికెట్ ఖరారు కావచ్చని అంటున్నారు.
ఆ ఇద్దరిలో కూడా సర్వోత్తం రెడ్డికే ఎక్కువ అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల మాట. ఇక రంగారెడ్డి.. హైదరాబాద్.. పాలమూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుండి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధినే బరిలో దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐతే కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజక వర్గమే కొంత సవాల్ కాబోతోంది. ఇక్కడ మన్నే జీవన్ రెడ్డితో పాటు… సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఇద్దరిలో సామ రామ్మోహన్ రెడ్డి వైపు పార్టీ…ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అలా.. రెండు సీట్లకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ల పేర్లే బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో సామాజిక న్యాయం గురించి చెప్పే కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎన్నికలో రెండు సీట్లను రెడ్లకే ఎలా ఇస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. త్వరలోనే గవర్నర్ కోటాలో కూడా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా అవుతున్నాయి. అప్పుడు నియామకంలో బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటా విషయంలో సామాజిక లెక్కల్ని పర్ఫెక్ట్గా పాటించాలనుకుంటోందట పీసీసీ.
తాజావార్తలు
-
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
-
Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!