Site icon NTV Telugu

Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం..! జగన్‌ స్వయంగా రూట్‌ మ్యాప్‌ రెడీ చేస్తున్నారా..?

Offthe

Offthe

Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఇప్పట్నుంచే సిద్ధమవుతోందా? అందుకోసం పార్టీ అధ్యక్షుడు జగన్‌ స్వయంగా రూట్‌ మ్యాప్‌ రెడీ చేస్తున్నారా? సీరియస్‌ నిర్ణయాలు ఉంటాయని కొందరు ముఖ్య నాయకులకు వార్నింగ్స్‌ కూడా వెళ్ళిపోయాయా? ఇంతకీ ఏం చేస్తున్నారు వైసీపీ ప్రెసిడెంట్‌? నాయకులకు డైరెక్ట్‌ హెచ్చరికల వెనకున్న కారణాలేంటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందా..

READ MORE: OTR : స్థానిక ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షేనా ?.. ఎమ్మెల్యే ఎంపీలకు ఎన్నికల సవాల్

అధికారం పోయాక పార్టీ మీద పూర్తిగా దృష్టి పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌…. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. పార్టీ కార్యక్రమాల్లో నేత‌లు పాల్గొంటున్నారా.. లేదా..? గ్రౌండ్ లెవ‌ల్ కార్యక‌ర్తల‌తో మ‌మేక‌మై ప‌నిచేస్తున్నారా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రెస్పాన్స్ ఎలా ఉంది.. ఇన్ఛార్జ్‌లు ఎంత ఎఫర్ట్‌ పెడుతున్నారు లాంటి వాటికి సంబంధించి వివిధ మార్గాల్లో నివేదిక‌లు తెప్పించుకుని ప‌రిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గ‌త అసెంబ్లీ ఎన్నికలప్పుడు దాదాపు 80 మంది ఇన్ఛార్జ్‌లను మార్చి దెబ్బతిన్న జ‌గ‌న్.. ఈసారి అంతదాకా ఆగకుండా… ముందుగానే ఫిక్స్ చేసేలా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఇక నుంచి ఎలాంటి మొహమాటాలు లేకుండా… కార్యక‌ర్తల‌తో క‌ల‌సి ప‌నిచేసే వాళ్లను కొన‌సాగించ‌టం.. పార్టీ కార్యక్రమాల్లో వెనుక‌బ‌డ్డ వాళ్లను ఇక వెన‌క్కు పంపడం లాంటివి చేయాలనుకుంటున్నారట. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు వైసీపీకి గట్టి పాఠాలే నేర్పాయి. 151 సీట్ల తిరుగు లేని ఆధిక్యం నుంచి ఐదేళ్లలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరాని 11 సీట్లకు ప‌రిమిత‌మవడం అసలు ప్రత్యర్థి టీడీపీ కూడా ఊహించని పరిణామం. 2024 ఎన్నికల్లో దాదాపు 80 మంది సిట్టింగ్‌లను మార్చి విఫ‌ల ప్రయోగాలు చేసిన జ‌గ‌న్… ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏ చిన్న పొర‌పాటు కూడా జ‌ర‌గ‌కుండా అన్నిటినీ స్వయంగా చూసుకుంటున్నట్టు చెబుతున్నారు పార్టీ లీడర్స్‌.

READ MORE: The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి అని తెలుసా..?

2019 ఎన్నిక‌ల త‌ర‌హాలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ప్రతీ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థిని తానే స్వయంగా ఎంపిక చేసేలా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్టు స‌మాచారం. ఆ దిశగా ఇప్పటి నుంచే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టార‌ట. క్షేత్రస్దాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తీరు ఆధారంగా ఇన్ఛార్జ్‌లను పార్టీ కేంద్ర కార్యాల‌యానికి పిలిచి క్లాస్ తీసుకుంటున్నారు వైసీపీ అధ్యక్షుడు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో రెండు రోజుల పాటు ప‌లువురు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ఛార్జ్‌లతో మీటింగ్స్‌ పెట్టారు జగన్‌. జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ ప‌రిశీల‌కుడు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌ స‌మ‌క్షంలో ఇన్ఛార్జ్‌లతో నిర్వహించిన ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. శ్రీకాకుళం నుంచి బాప‌ట్ల జిల్లా వ‌ర‌కూ తొలిరోజు, ప‌ల్నాడు నుంచి అనంత‌పురం జిల్లా వ‌ర‌కూ రెండ‌వ రోజు ఈ అంత‌ర్గత స‌మావేశాలు జ‌రిగాయి. ఇటీవ‌ల పార్టీ ఆధ్వర్యంలో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గ ర్యాలీలు, రచ్చబండ, కోటి సంత‌కాల సేక‌ర‌ణ స‌హా ప‌లు కార్యక్రమాల్లో వెనుక‌బ‌డిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ఛార్జ్‌లను పిలిచి గట్టిగానే తలంటేశారట జగన్‌. త‌న ద‌గ్గరున్న పూర్తి స‌మాచారంతో వారిని ప్రశ్నించిన‌ట్లు తెలిసింది. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోలిస్తే మీరు వెనుక‌బ‌డ‌టానికి కార‌ణాలేంటి.. ప్రజ‌ల‌తో ఎందుకు మ‌మేకం కాలేక‌పోతున్నార‌ంటూ బ్యాడ్‌ రిపోర్ట్‌ ఉన్న ఇన్ఛార్జ్‌లను డైరెక్ట్‌గా ప్రశ్నించినట్టు సమాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిన్న పొర‌పాటు కూడా జ‌ర‌గ‌టానికి కూడా వీల్లేదు. ఇప్పటి నుంచే నియోజ‌క‌వ‌ర్గాల‌పై గ‌ట్టి ప‌ట్టు సాధించి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించండంటూ… క్లాస్‌ ఇచ్చినట్టు సమాచారం.

READ MORE: Marijuana Addiction: మగాళ్లే కాదు.. మహిళల్లోనూ పెరుగుతున్న గంజాయి వ్యసనం..!

పార్టీ కార్యక్రమాల నిర్వహ‌ణ‌లో వెనుక‌బ‌డితే ఉపేక్షించేది లేద‌ని.. సీరియ‌స్ డెసిష‌న్స్ ఉంటాయ‌ని సూటిగా… సుత్తిలేకుండా చెప్పేశారట. పార్టీ బాగుంటేనే అంద‌రూ బాగుంటారు.. ప్రతీ ఒక్కరూ పార్టీ నిర్ణయాల ప్రకారం ప‌నిచేయాల్సిందేన‌ని క్లారిటీ ఇచ్చేసినట్టు సమాచారం. ఇక నుంచి పార్టీ ప్రోగ్రామ్స్‌ని మీరు లైట్‌ తీసుకుంటే…. మిమ్మల్ని నేను సీరియస్‌గా తీసుకుంటానని వన్‌ టు వన్‌ మీటింగ్స్‌లో వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. యాధృచ్చికంగా జ‌రిగినా.. ఎలా జ‌రిగినా… ఈ వన్‌ టు వన్‌ మీటింగ్స్‌ అయిపోయిన వెంటనే… జ‌మ్మల‌మ‌డుగు ఇన్ఛార్జ్‌గా పి.రామ‌సుబ్బారెడ్డిని నియ‌మిస్తూ పార్టీ అదేశాలు జారీ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే… రాబోయే రోజుల్లో జ‌గ‌న్ కఠినంగా ఉండబోతున్నట్టు అర్ధమవుతోందని అంటున్నారు వైసీపీ నాయకులు. అదే సమయంలో ఆయన ప్లానింగ్‌ ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.

 

Exit mobile version