YCP : వైసీపీలో ఆ ఆరుగురు “గడప గడపకి” కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ.. ప్రధానంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్వరూపం. మొత్తంగా నెలకు 20 రోజులు ఫీల్డ్‌లోనే ఉండాలి ఎమ్మెల్యేలు. అయితే ఏ ఎమ్మెల్యే ఫీల్డ్‌లోకి వెళ్లారు.. క్షేత్రస్థాయిలో వారేం చేశారో సమగ్ర చిట్టా ప్రభుత్వానికి చేరిపోయింది. డైలీ రిపోర్ట్స్ రూపంలో వివరాలు సీఎం జగన్ దగ్గర ఉన్నాయి.
ఎమ్మెల్యేల పనితీరుపై సచివాలయ సిబ్బందితోపాటు ఐపాక్ టీమ్ నిఘా వేశారు. సమగ్ర నివేదికలు ఇచ్చేశారు. ఇంత పక్కాగా వేగుల వ్యవస్థ ఉన్నప్పటికీ.. కొందరు ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. లాస్ట్ బెంచ్ స్టూడెంట్‌ల మాదిరే వ్యవహరించారు. మరికొందరు మొక్కుబడిగా హాజరు వేయించుకున్నారట. ఇదంతా ఒక్క ఎత్తు అయితే అసలు గడప దాటని.. కాలు కదపని బ్యాచ్ కూడా ఉందని తెలిసి అధికార పార్టీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండటంతో వారు చూట్టూనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
Also Read
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కాలు కదపని జాబితాలో ఉన్నారట. మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా హాజరు కాకపోయినా.. విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ చీపురుపల్లిలో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ విదేశాలకు వెళ్లడంతో మైలవరంలో ఆయన తిరగలేదని చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆళ్ల నాని ఏలూరులో పర్యటించలేదట. మంత్రి పదవి రాలేదనే నిరాశలో ఉన్న ప్రసన్న కుమార్‌రెడ్డి.. అనారోగ్య కారణాలతో కోవూరులో గడప దాటలేదని తెలుస్తోంది. శిల్పా చక్రపాణి రెడ్డి మాత్రం అనారోగ్య కారణాలతో అధిష్ఠానం దగ్గర అనుమతి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక కుమారుడి వివాహం కారణంగా ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడప కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు టాక్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారట. అయితే జిల్లాలో ఆత్మకూరు ఉపఎన్నిక ఉండటంతో ఇప్పట్లో గడప గడపకు మన ప్రభుత్వం ఉండబోదని అనుకుంటున్నారు. అయితే డుమ్మా బ్యాచ్‌ను ప్రస్తుతానికి ఎక్స్‌క్యూజ్ చేసినా.. తీరు మారకపోతే ఏం చేస్తారన్నదే ప్రస్తుతం ప్రశ్న.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!