YCP : మంగళగిరిలో పట్టు బిగించే పనిలో.. వైసీపీ వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా మంగళగిరి. 2014 నుంచి మంగళగిరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. సీఎం జగన్‌తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా మందుకెళ్తుంటాయి. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు లోకేష్. ఈక్రమంలో మంగళగిరిలో మరింత పట్టు బిగించేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ వ్యూహం చుట్టూనే చర్చ సాగుతోంది.
మంగళగిరిలో పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లు సుమారు 50వేల వరకూ ఉన్నారు. వీరంతా ఎటు మొగ్గు చూపితే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువ. గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఆర్కేకు మంగళగిరి టౌన్ మైనస్ అయ్యింది. రెండుసార్లూ ఆయనకు మెజారిటీ రాలేదు. తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. మంగళగిరి టౌన్‌లో ఎదురైన మైనస్‌ను అలా భర్తీ చేసుకుంటూ వచ్చారు. ఈసారి వైసీపీ ప్లాన్ మార్చిందని టాక్. మంగళగిరిలో ఉన్న బీసీ నేతలందరినీ క్యాప్చర్ చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే పద్మశాలీ నేతగా ఉన్న చిల్లపల్లి మోహన్‌రావుకు ఆప్కో ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. తెలుగుదేశానికి రాజీనామా చేసిన వైసీపీలో చేరకముందే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది వైసీపీ. మంగళగిరి పట్టణ అధ్యక్ష పదవి కూడా చేనేత సామాజికవర్గానికి చెందిన మునగాల మల్లేశ్వరావుకు ఇచ్చారు. ఆయన భార్య భాగ్యలక్ష్మిని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి వరించింది. మంగళగిరి యార్డు చరిత్రలో ఇప్పటివరకూ చేనేతలకు ఛైర్మన్ పదవి ఇవ్వలేదు. మొదటిసారిగా ఆ పదవిని చేనేతలకు కట్టబెట్టి ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించే ఎత్తుగడ వేసింది.
Also Read
ఇంతటితో ఆగకుండా చేనేత సామాజికవర్గం ఓటర్లను పూర్తిస్థాయిలో తమవైపు తిప్పుకునేందుకు మరిన్ని పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంగళగిరిలో ప్రచారం జరుగుతుంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాండ్రు కమలకు కీలక పదవి ఇవ్వబోతున్నారట. తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు కమలను మేయర్‌ను చేస్తారని అనుకుంటున్నారు. కమల బరిలో ఉంటే గెలుపు ఈజీ అనే లెక్కలు వేస్తున్నారట. మురుగుడు హనుమంతరావుకు కాండ్రు కమల వియ్యపురాలు. హనుమంతరావు గతంలో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాండ్రు కమల కూడా మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. చేనేత సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు ఆ సామాజికవర్గంలో మంచి పట్టుంది. అందుకే ఇద్దరికీ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గం మొత్తం వైసీపీకి అండగా ఉంటుందనేది అధిష్టానం ఆలోచన. అంతేకాదు ఎన్నికల సమయానికి టీడీపీలో ఉన్న చేనేత సామాజికవర్గానికి చెందిన కీలక నేతను కూడా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారట. మరి.. ఈ వ్యూహం అధికారపార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
- Tags
- Chandra babu
- jagan
- Mangalagiri
- tdp
- ycp
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!