Off The Record: అసలే ఓడిపోయిన బాధలో ఉన్న ఆ పార్టీకి పంచ్‌ల మీద పంచ్‌లు పడుతున్నాయా? ఎద్దు పుండును కాకి పొడిచినట్టుగా సలుపుతోందా? బీఆర్‌ఎస్ టార్గెట్‌గా కవిత చేస్తున్న తాజా కామెంట్స్‌ని ఎలా చూడాలి? ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ విఫలమైందని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం వెనక ప్రత్యేక వ్యూహం ఉందా? ఉంటే… అదేంటి?
Read Also: Off The Record: జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ లో జోష్ .. మరో రెండు చోట్ల ఉప ఎన్నికలకు సిద్ధం?
జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా కొట్టింది. కనిపించకుండా కాంగ్రెస్ వేసిన స్పీడ్ బ్రేకర్స్ దెబ్బకు పల్టీలు కొడుతూ పడిపోయింది. తన సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు వికటించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా వర్కౌట్ అవలేదు. అదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఆ ఓటమిని మించిన బాధ మరోటి తెగ సలుపుతోందట గులాబీ అధిష్టానాన్ని. ఆయన కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా వ్యవహారం ఉందని అంటున్నారు పరిశీలకులు. జూబ్లీహిల్స్‌లో పార్టీ ఓటమి ఒక ఎత్తయితే… దాన్ని కోట్ చేస్తూ… ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌లో మెసేజ్‌లు పోస్ట్ చేయడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారట పార్టీ పెద్దలు. ఫలితం వెలువడ్డ గంటలోనే ఎక్స్ పోస్ట్‌తో మొదలుపెట్టిన కవిత… ఈరోజు మెదక్‌లో డైరెక్ట్ అటాక్ చేశారు. ఫలితం వచ్చిన వెంటనే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు కవిత. ఎవరు చేసిన కర్మ వారికే తిరిగి కొడుతుందన్న అర్ధం వచ్చేలా ఆమె పెట్టిన పోస్ట్ బీఆర్‌ఎస్ పెద్దలకు తగిలేలా ఉందంటున్నారు పరిశీలకులు. అంతటితో ఆగకుండా… ఇవాళ మెదక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేతలపై విరుచుకుపడ్డారామె.
Read Also: Varanasi Movie: ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్..: మహేష్ బాబు
కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి ఎన్నో రోజులు ఉంచలేరంటూ కామెంట్ చేశారు. గతంలో తన మీద ఆరోపణలు చేసిన జగదీశ్ రెడ్డి, పార్టీ సీనియర్ లీడర్స్ హరీష్‌రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్‌రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు కవిత. ఇలా… సరిగ్గా ఓడిపోయిన టైం చూసి కవిత బీఆర్‌ఎస్ మీద మళ్లీ దాడి మొదలు పెట్టడంతో… అస్సలు తగ్గట్లేదుగా… అన్న చర్చలు మొదలయ్యాయి. పార్టీ నుంచి బయటికి వెళ్ళాక తర్వాత ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని కవిత… ఈ మధ్యకాలంలో కాస్త ఉధృతి తగ్గించారు. జాగృతి జనం బాట పేరుతో ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. ఈ సమయంలో మరోసారి బీఆర్‌ఎస్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడ్డం వెనక పెద్ద వ్యూహమే ఉండి ఉండవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్‌ఎస్ ఫెయిల్ అయిందని మెదక్‌లో అనడాన్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉందని అంటున్నారు. బీఆర్‌ఎస్ విఫలమైతే.. మేం ఆ పాత్ర పోషిస్తామని చెప్పడాన్ని ఆషామాషీగా, గాలివాటపు మాటగా చూడకూడదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇలా చెప్పడం వెనక చాలా మేటర్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
Read Also: Priyanaka Chopra: ఇక తగలబెడదామా.. మందాకిని దూకుడు మాములుగా లేదుగా..!
జాగృతి జనం బాట తర్వాత కవిత రాజకీయ పార్టీ పెడతారన్న చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. అదే నిజమైతే…. న్యూట్రల్ నాయకులతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో లీడర్స్, కార్యకర్తలను తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్ ఉన్న బీజేపీ నుంచి వలసల్ని పెద్దగా ఆశించలేమన్న క్లారిటీ కవితకు ఉంది. అదే సమయంలో తనకు బాగా తెలిసిన, ఇన్ని రోజులు కలిసి తిరిగిన పార్టీ నుంచి కార్యకర్తలను ఆహ్వానించడం తేలికవుతుంది. అందుకనే.. బీఆర్‌ఎస్‌ను విఫల పార్టీగా ముద్ర వేసి… వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి ప్రత్యామ్నాయం మేమేనని చెప్పాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు. అలా గట్టిగా చెప్పడం ద్వారా… బీఆర్ మీద నమ్మకం కోల్పోయిన కొందర్ని తన పార్టీ వైపునకు ఆకర్షించే వ్యూహం కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: SS Rajamouli: టెస్టింగ్ కోసం ప్లే చేసిన వీడియో లీక్.. ఈవెంట్లో రాజమౌళి అసహనం
భవిష్యత్ మనదేనని చెప్పడం ద్వారా.. తనతో ఉన్న వాళ్ళలో భరోసా కల్పించే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత… ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు బీఆర్ఎస్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనుకున్నా సాధ్యం కాలేదు. ఇలాంటి సమయంలో పార్టీ మళ్లీ పికప్ అవ్వాలంటే ఏం చేయాలనుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానానికి కవిత షాక్ ఇచ్చేలా మాట్లాడ్డం అస్సలు మింగుడు పడ్డం లేదట. ఈ విషయమై గులాబీ దళంలో కూడా తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న వాళ్ళను విమర్శించాల్సింది పోయి… ఇన్ని రోజులు ఉండి, అన్నీ అనుభవించిన పార్టీని కవిత టార్గెట్ చేయడం ఏంటన్న డిస్కషన్ నడుస్తోందట బీఆర్‌ఎస్‌లో.అసలే ఉప ఎన్నిక ఓడిపోయిన బాధలో ఉన్న తమను కవిత గిల్లి మరీ… ముల్లుతో గుచ్చుతున్నారని, మరింత డ్యామేజ్ చేస్తున్నారని అభిప్రాయ పడుతున్నారట గులాబీ పెద్దలు.
