Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record There Is A Clash Between The Mla And The Corporator In Trs

Maganti Gopinath : టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ కు మధ్య సెగలు రేపుతున్న రగడ

Published Date :July 22, 2022 , 3:25 pm
By Premchand Chowdary
Maganti Gopinath : టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ కు మధ్య సెగలు రేపుతున్న రగడ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maganti Gopinath : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అదో కీలక అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ ఎమ్మెల్యేకు.. అధికార పార్టీకే చెందిన GHMC కార్పొరేటర్‌కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కలిసి సాగడం లేదు.. కలిసి కనిపించడమూ లేదు. పార్టీ వర్గాలకు ఈ రగడ పెద్ద పజిల్‌. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటే కానీ.. సమస్య పరిష్కారం కాదనే స్థాయికి చర్చ చేరుకుందట.

మాగంటి గోపీనాధ్‌. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జూబ్లీహిల్స్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల నాటికే నియోజకవర్గ టీఆర్ఎస్‌లో పాత.. కొత్త నాయకుల మధ్య గ్యాప్‌ ఉంది. అది పెరిగి పెద్దది అయ్యిందే కానీ.. తగ్గలేదు. ఆ మధ్య జరిగిన GHMC ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. అప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌గా ఉన్న బాబా ఫసియుద్దీన్‌ మరోసారి బోరబండ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. ఇది జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ పరిధిలో ఉన్న డివిజన్‌. వీరిద్దరికీ అస్సలు పడటం లేదనేది పార్టీ వర్గాల మాట.

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

సంస్థాగత మార్పులు చేర్పుల్లో భాగంగా.. హైదరాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గోపీనాథ్‌ను నియమించింది పార్టీ. ఇది ఇద్దరు నేతల మధ్య మరింత గ్యాప్‌ తీసుకొచ్చిందని సమాచారం. అసలే ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలు మరింత ముదురు పాకాన పడ్డాయట. గోపీ, ఫసియుద్దీన్‌ మధ్య గొడవలు ఎక్కడ మొదలయ్యాయో ఏమో.. ఒకరికొకరు ఎదురుపడటానికి కూడా ఇష్ట పడటం లేదట. ఇద్దరూ కలిసి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ ఇద్దరిదీ చెరోదారిగా మారిపోయింది.

బోరబండ డివిజన్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోపీనాథ్‌తో కలిసి పాల్గొనడం లేదు ఫసియుద్దీన్‌. పైగా తనకు చెప్పకుండానే డివిజన్‌లో కార్యక్రమాలు పెడుతున్నారనేది కార్పొరేటర్‌ ఆరోపణ. అయితే ఫసియుద్దీన్‌కు సమాచారం ఇచ్చే చేస్తున్నామని వాదిస్తోంది ఎమ్మెల్యే శిబిరం. తనకు పోటీగా బోరబండలో కొందరు వ్యక్తులను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారనేది ఫసియుద్దీన్‌ వాదన. ఈ అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి ఆయన తీసుకెళ్లారట. ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరు.. తన డివిజన్‌లో చేస్తున్న కార్యక్రమాలు.. చేపడుతున్న పనులను వెల్లడించారట. పైకి ఈ సమస్య చిన్నదిగా కనిపించినా.. క్షేత్రస్థాయిలో సెగలు రేపుతోందని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఈ సమస్యపై పార్టీ పెద్దలు సకాలంలో దృష్టి పెట్టకపోతే.. శ్రుతి మించిపోతుందనే అభిప్రాయం టీఆర్ఎస్‌ వర్గాల్లో ఉందట. ఇద్దరికీ ఎక్కడ చెడింది..? ఎందుకు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారో.. కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాతావరణం తేలికపడొచ్చని కొందరు అనుకుంటున్నారట. లేదంటే రాజకీయంగా ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారట. ఇప్పటికే సమస్య పార్టీ పెద్దల దృష్టిలో ఉండటంతో.. వారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. పిలుపు రాగానే రెండు వర్గాలు గట్టిగా తమ వాదన వినిపించేందుకు సిద్ధ పడుతున్నాయట. మరి.. సిటీలోని కీలక నియోజకవర్గంలో రేగిన రగడను టీఆర్‌ఎస్‌ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baba Fasiuddin
  • borabanda
  • Jubilee Hills Assembly constituency
  • Maganti Gopinath
  • Telangana Rashtra Samithi

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions