Off The Record: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడారు? ఆ స్థాయి స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనకున్న బలమైన కారణాలేంటి? వైఎస్‌కు కేవీపీలాగా నాకు ఎవరూ లేదని అనడం వెనక బలమైన రీజన్స్ ఉన్నాయా? అలా ఉంటానని ఆయన దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? తన స్టేట్‌మెంట్‌తో సీఎం క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళకు ఇచ్చేశారా? సీఎంకు దగ్గరి వాళ్ళమంటూ పనులు చక్కబెట్టుకునే బ్యాచ్ పెరిగిపోయిందా? లెట్స్ వాచ్. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ గురించి కాంగ్రెస్ పార్టీలో హాట్ హాట్‌గా డిస్కషన్ జరుగుతోంది. అసలు ఇంతకీ.. ఆయన ఎవర్ని ఉద్దేశించి అలా మాట్లాడారు? వాళ్ళకు నేరుగా చెప్పలేక… అలా పరోక్ష సంకేతాలు పంపారా? మరి ఆ సందేశం చేరాల్సి వాళ్ళకు చేరిందా అంటూ తెగ మాట్లాడేసుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
Read Also: Viral: ప్రజా స్వామ్యానికి ముప్పుగా మారనున్న సోషల్ మీడియా..విషయమేమిటంటే..
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఓ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో… మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు గురించి గుర్తు చేసుకుంటూ… వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉండేదో గాంధీభవన్‌లో మాట్లాడుకుంటున్నారు పార్టీ లీడర్స్. ఇప్పుడు కూడా అలాంటి టీమ్ ఉండాలని సూచించే వాళ్ళు సైతం లేకపోలేదు. అయితే… ఇటీవల జరిగిన సమావేశంలో అలాంటి చర్చోపచర్చలకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సీఎం. ఈ తరానికి రాజశేఖర్ రెడ్డి ఒక్కరే.. కేవీపీ కూడా ఒక్కరే.. మళ్ళీ వాళ్ళు రిపీట్ కారంటూ క్లియర్‌గా, క్లారిటీగా చెప్పేశారాయన. ఒకాయన తన దగ్గరికి వచ్చి.. అంతా నాకు వదిలేయండి, వైఎస్‌కు కేవీపీలా నేనే చక్కబెడతానని అడుగుతున్నారని, కానీ, నా దగ్గర కేవీపీలు ఎవరూ లేరని సభాముఖంగా చెప్పేశారు. దాంతో.. అసలా నయా కేవీపీ ఎవరు? రేవంత్‌రెడ్డిని అలా అగిదే ధైర్యం ఎవరికుందంటూ కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
Read Also: Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట
నాడు వైఎస్, కేవీపీల జోడీ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, అప్పటి పరిస్థితులు వేరు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతకంటే వేరు. అది దశాబ్దాల స్నేహంలో దృఢపడ్డ బంధం కాబట్టి అలాం సింక్ అయింది. కానీ… ఇప్పుడు రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నేనొచ్చి అలా అతుక్కుంటానంటే అది జరిగేపనా అంటూ మాట్లాడుకుంటున్నారు ఎక్కువ మంది పార్టీ నాయకులు. పైగా ఒకప్పటి రాజకీయాల్లా ప్రస్తుతం లేవు. ఆ విషయంలో అన్ని రకాలుగా ఢక్కాముక్కీలు తిన్న రేవంత్‌రెడ్డి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అందుకే ఈ విషయంలో ఇంకో చర్చకు తావు లేకుండా… నా దగ్గర కేవీపీలు ఎవరూ లేరంటూ క్లారిటీ ఇచ్చేసినట్టు అంచనా వేస్తున్నారు. ఆయన క్లారిటీ ఇవ్వడం వరకు బాగానే ఉందిగానీ… అసలు అలా ఉంటానని వచ్చిన ఆ వ్యక్తి ఎవరన్న విషంలో మాత్రం చర్చలు ఆగడం లేదు. సీఎంకు అత్యంత సన్నిహితులని ప్రచారం జరుగుతున్న వాళ్ళ మీద ఇటీవల అనేక విమర్శలు వచ్చాయి. రేవంత్‌కు అన్నీ తానై నడిచే నేతే… సైలెంట్‌గా ఉంటున్నా.. వేరే ఇద్దరు ముగ్గురు మాత్రం మొత్తం మాదే హవా అని ప్రచారం చేసుకుంటున్నారట. ఇది పార్టీలో పెద్ద దుమారానికి కారణమైంది. దానికి సంబంధించి అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా.. దగ్గరికి తీస్తే ఆ సీటు కూడా మాకు ఇవ్వండని అడిగేటట్టుగా ఉందట వాళ్ళ వ్యవహారం. వాళ్ళ వ్యవహారశైలి గురించి చర్చ పెరుగుతున్న క్రమంలో దానికి చెక్ పెట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికే రేవంత్ వ్యూహాత్మకంగా అలా మాట్లాడి ఉండవచ్చంటున్నారు.
Read Also: Ganja Case: ‘మత్తువదలరా’.. యూనివర్శిటీ క్యాంపస్‌లలోకి గంజాయి
ప్రభుత్వానికి, సీఎంకి దగ్గరగా ఉన్న నాయకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ… కొద్ది రోజులుగా అంతా తామేనని కలరింగ్ ఇవ్వడంతో సమస్యలు మొదలవుతున్నాయట. ఆ విషయాన్ని పసిగట్టే.. సీఎం, నా దగ్గర కేవీపీలు ఎవరూ లేరంటూ చెప్పినట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నానని చెప్పుకునే నాయకుడొకరు ఓ శాఖలో జరుగుతున్న పనిని ఆపేయాలంటూ వత్తిడి తీసుకువచ్చి కొత్త ప్రతిపాదనలు పెట్టడం వివాదాస్పదమైంది. అలాంటి వ్యవహారాలు చాలా జరుగుతున్నాయని, పెద్దలకు సన్నిహితులమని చెబుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న ఫీలింగ్ కూడా ఉందట. అలాంటి వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే… పేర్లు బయటికి చెప్పకుండా.. సీఎం కాస్త సీరియస్‌గా, తగలాల్సిన వాళ్ళకి తగిలేట్టుగా కామెంట్ చేసినట్టు చెబుతున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. మొత్తానికి చాలా రోజులుగా నలుగుతున్న వ్యవహారానికి సంబంధించి సీఎం ఫుల్ క్లారిటీ ఇచ్చేశారన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో.
