Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telangana Bjp Municipal Elections Nominations Imbalance North South

OTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై BJP హైకమాండ్ ఫుల్ ఫోకస్

Published Date :February 4, 2026 , 10:04 pm
By Shiva Ganesh
  • తెలంగాణ బీజేపీలో విచిత్రమైన వాతావరణం
  • కొన్నిచోట్ల పోటాపోటీ, మరికొన్ని చోట్ల అభ్యర్థులు కరవు
  • మొత్తం 123 మున్సిపాలిటీలు, 2 వేల 996 వార్డులు
  • బీజేపీ తరపున 5 వేల 457 నామినేషన్స్‌ దాఖలు
  • ఉత్తర తెలంగాణలో బీజేపీకి అతివృష్టి
  • కరీంనగర్‌లో 66 డివిజన్స్‌కు బీజేపీ తరఫున 375 నామినేషన్లు
  • నిజామాబాద్‌లో 60 డివిజన్స్‌కు 253 నామినేషన్స్‌
  • ఆదిలాబాద్‌లోని 49 డివిజన్స్‌కు 124 నామినేషన్లు
  • కొన్ని మున్సిపాలిటీల్లో కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి
  • అశ్వారావుపేటలో 22 వార్డులకు 15 నామినేషన్సే
  • ఉమ్మడి ఖమ్మం, వరంగల్ , నల్గొండ జిల్లాల్లో తీసికట్టు వ్యవహారం
OTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై BJP హైకమాండ్ ఫుల్ ఫోకస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

OTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్స్‌ ఘట్టం ముగిసింది. అన్ని పార్టీల తరపున అభ్యర్థులు పోటాపోటీగా దాఖలు చేశారు. ఒకే పార్టీ నుండి ఒకే వార్డ్‌లో ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్స్‌ కూడా వేశారు. అయితే ఈ విషయంలో బీజేపీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోందట. ఆ పార్టీ పరిస్థితి అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్టుగా మారిపోయిందని అంటున్నారు. సాధారణంగా ఒక వార్డ్‌లో ఒక పార్టీ తరపున ఒకరికే బీ ఫామ్‌ ఇస్తారు. కానీ…బీజేపీలో కొన్ని చోట్ల పోటాపోటీగా నామినేషన్స్‌ వేస్తే… మరికొన్ని చోట్ల అభ్యర్థులు కరవయ్యారట. మొత్తం 123 మున్సిపాలిటీల్లోని 2 వేల 996 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం బీజేపీ తరపున 5 వేల 457 నామినేషన్స్‌ దాఖలయ్యాయి. చూడ్డానికి ఈ సంఖ్య బాగానే ఉన్నా… లెక్క ఇక్కడే తేడా కొడుతోందని అంటున్నాయి పార్టీ వర్గాలు.

READ ALSO: T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!

తన సంప్రదాయ కంచు కోటల్లో, పట్టణ కేంద్రాల్లో తిరుగులేని ఉత్సాహాన్ని ప్రదర్శించింది బీజేపీ కేడర్‌. అక్కడ నామినేషన్ల సంఖ్య వార్డుల కంటే ఐదారు రెట్లు ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలోని ఎక్కువ మున్సిపాల్టీల్లో పార్టీ పరిస్థితి అతివృష్టి అన్నట్టుగా ఉంది. అక్కడ రెబెల్స్ బెడద కూడా పెరిగిపోయింది. ఉప సంహరణ గడువు ముగిసే లోపు ఎంతమంది తప్పుకుంటారన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్స్‌ ఉంటే.. బీజేపీ తరఫున 375 నామినేషన్లు పడ్డాయి. అంటే ప్రతి వార్డులో సగటున ఐదుగురు అభ్యర్థులు కమలం గుర్తు కోసం పోటీ పడుతున్నారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్స్‌కుగాను 253 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్‌లోని 49 డివిజన్స్‌కు 124 నామినేషన్లు వేశారు. దీన్ని బట్టి చూస్తుంటే…. ఉత్తర తెలంగాణలో పార్టీ ఎంత బలోపేతం అవుతోందో, పార్టీ టిక్కెట్‌ కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని సంబరపడుతున్నారు తెలంగాణ కాషాయ పెద్దలు. కానీ….. అదే సమయంలో ఇంకోవైపు మాత్రం లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అక్కడ అభ్యర్థుల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతోంది. అన్ని వార్డుల్లో నామినేషన్స్‌ వేయడానికి కూడా అభ్యర్థులు కనిపించడం లేదు. ఉదాహరణకు అశ్వారావుపేట మునిసిపాలిటీనే తీసుకుంటే…. ఇక్కడ 22 వార్డులు ఉంటే బీజేపీ తరఫున 15 నామినేషన్లే పడ్డాయి. అంటే సుమారు 30% వార్డుల్లో పార్టీ పోటీ పెట్టలేకపోయింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ , నల్గొండ జిల్లాల్లో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉందని అంటున్నారు. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మంచిగానే నామినేషన్ లు దాఖలైనా… ఇంకొన్ని చోట్ల కనీస అభ్యర్థులు కూడా లేకపోవడం లోటేనంటున్నారు పరిశీలకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ గద్దెనెక్కాలని కలలుగంటున్న పార్టీ ఇలా ఉంటే ఎలాగన్నది పరిశీలకుల ప్రశ్న. ప్రస్తుతానికైతే….పార్టీ అభ్యర్థులు లేని చోట ఇండిపెండెంట్స్‌కు మద్దతిచ్చి రేపు గెలిస్తే… వాళ్ళు మా వాళ్ళేనని చెప్పుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.

READ ALSO: Loan App Blackmail Case: ప్రాణం తీసిన ఇన్‌స్టంట్ లోన్.. బ్లాక్ మెయిల్ తట్టుకోలేక సూసైడ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad BJP elections
  • Ashwaraopet BJP issue
  • BJP candidate shortage
  • BJP nominations Telangana
  • BJP Telangana politics

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions