అనగాని బాలయ్యను అడ్డంగా బుక్ చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా టికెట్ల ధరల విషయంలో ఆ ఎమ్మెల్యే సొంతపార్టీ హీరోనూ బుక్ చేశారా? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో పార్టీ ఉండగా.. ఆయన కామెంట్స్ టీడీపీ శిబిరాన్నే ఇరుకున పెట్టేలా ఉన్నాయా? తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
సినిమా టికెట్ ధరలపై టీడీపీ నేతల ఆసక్తికర కామెంట్స్
సినిమా టిక్కెట్ల వ్యవహారం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్. టిక్కెట్ రేట్లు మొదలుకుని.. థియేటర్ల సీజ్ వరకు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఈ సమస్యపై స్పందిస్తుంటే.. మరికొందరు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్‌ను టీడీపీ అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్సే ఆసక్తిగా మారి.. పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి.
Also Read
రీల్ హీరోలుగా మిగిలిపోతున్నారని అనగాని ప్రెస్‌నోట్..!
సినీ పరిశ్రమతోపాటు.. థియేటర్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. అందులో ప్రస్తావించిన అంశాలే చర్చగా మారాయి. సినీ రంగాన్ని వేధిస్తుంటే.. సినిమా పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదు? సినిమాల్లో చూపించే మీ హీరోయిజాన్ని.. వైసీపీ సర్కార్‌పై ఎందుకు చూపించడం లేదని ఓ రేంజ్లో ప్రెస్‌నోట్ ద్వారా ఫైర్ అయ్యారు అనగాని. రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారు తప్ప.. రియల్ హీరోలుగా మారరా..? అని సూటిగా.. సుత్తి లేకుండానే ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే.
బాలయ్యను కూడా అనగాని ప్రశ్నించారా?
ఇంతకీ అనగాని కామెంట్స్ చేసింది ఎవరిని అనే సన్నాయి నొక్కులు టీడీపీలో మొదలయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో ఎమ్మెల్యేగా ఉన్న హీరో బాలకృష్ణ కూడా ప్రధానమైన వ్యక్తే. ఆ విషయాన్ని అనగాని మర్చిపోయారా అన్నది కొందరి ప్రశ్న. రీల్ హీరోలు.. రియల్ హీరోలు అని బాలయ్యను కూడా ప్రశ్నించారా? ఆ కామెంట్ బాలకృష్ణను ఉద్దేశించి కూడా చేశారా అని అంతర్గత సమావేశాల్లో చర్చ పెడుతున్నారట.
బాలయ్యనూ రీల్ హీరోగానే చూశారా?
సినిమా టికెట్ల విషయంలో ముందుగా పవన్ కల్యాణ్, ఆ తర్వాత హీరో నాని, సిద్ధార్థలు స్పందించారు. తర్వాత ఒక్కొక్కరుగా ఈ అంశంపై మాట్లాడుతున్నారు. అయితే ఈ అంశం నుంచి తప్పించుకున్న లేక స్పందించని వాళ్లల్లో బాలయ్య కూడా ఉన్నారని కొందరు గుర్తు చేస్తున్నారు. అఖండ సినిమా రిలీజ్ తర్వాత బెజవాడలో బాలయ్య మాట్లాడినా.. అది పెద్దగా చర్చల్లోకి రాలేదు. దాంతో బాలయ్యను కూడా రీల్ హీరోగానే అనగాని చూసి ఉంటారని పార్టీలో మరికొందరు అభిప్రాయపడుతున్నారట.
ప్రెస్‌నోట్ గురించి అనగానికి తెలుసా?
ఇదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. అసలు ప్రెస్‌నోట్ ఇస్తున్న విషయం అనగానికి తెలుసా .. లేక పార్టీనే ప్రెస్‌నోట్ తయారు చేసేసి పంపేసిందా అనే అనుమానాలు ఉన్నాయట. గతంలో స్పీకర్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు పేరుతో ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ అయింది. దాంతో అచ్చెన్న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సి వచ్చింది. ఆ సందర్భంగా అచ్చెన్న వివరణపై ఆసక్తికర చర్చ జరిగింది. ఆ ప్రెస్‌నోట్‌లో తన సంతకం లేదని.. పార్టీ కార్యాలయం తనకు తెలియకుండానే ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిందని వివరణ ఇచ్చారు అచ్చెన్న. ఇప్పుడు అనగాని విషయంలోనూ అదే జరిగిందా అన్నది పార్టీ కొందరి డౌట్. మరి.. అనగాని మనసులో ఏముందో.. ఏమో?
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!