చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..? టీడీపీని చక్కదిద్దుకునేందుకు చికిత్స మొదలుపెట్టిన ఆయనకు.. వాస్తవాలు తెలుస్తున్నకొద్దీ కోపం నషాళానికి ఎక్కుతోందా? కొందరు కోవర్టులుగా మారారనే అనుమానం రోజు రోజుకూ బలపడుతోందా? చేతలు కాలక ఆకులు పట్టుకున్న బాబు.. ఆగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా..? మధ్యలోనే మెత్తబడతారా..?
పార్టీ చీఫ్‌కు వచ్చిన కోపంపై తమ్ముళ్లలో చర్చ..!
Also Read
టీడీపీలో కోవర్టులున్నారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మండలం.. నియోజకవర్గం.. జిల్లా స్థాయిల్లో కాదని.. ఏకంగా రాష్ట్రస్థాయిలోనే కోవర్టులు ఉన్నారని.. వారిని ఏరిపారేస్తానని కుప్పం సమీక్షలో చెప్పారు చంద్రబాబు. టీడీపీ ప్రక్షాళన సైతం కుప్పం నుంచే మొదలుపెడతానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమీక్షలో ఉగ్రరూపమే ప్రదర్శించారు టీడీపీ అధినేత. ఒక్క డివిజన్‌ను కూడా గెలవలేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసీపీకి సహకరించారనే ఆరోపణలపై ఇద్దరు స్థానిక నేతలను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. పార్టీ చీఫ్‌కు వచ్చిన ఈ కోపమే ఇప్పుడు తమ్ముళ్లలో చర్చగా మారింది.
అధికారపార్టీతో సన్నిహితంగా ఉన్నవారిపై బాబు ఫోకస్..!
కుప్పంలో ప్రక్షాళన ప్రారంభిస్తానని చంద్రబాబు చెప్పినా.. ఆయన నెల్లూరు నుంచే ఆ పని మొదలుపెట్టారని చెప్పాలి. ప్రస్తుతం బాబు యాక్షన్ పార్ట్ చూస్తుంటే నియోజకవర్గ, డివిజన్ స్థాయిల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని.. వెన్నుపోటు పొడిచిన వాళ్లనూ గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. అయితే నియోజకవర్గంతోపాటు రాష్ట్రస్థాయిలో కోవర్టులుగా మారిన నేతలను గుర్తించారా.. లేదా? అనే చర్చ జరుగుతోంది. కొందరు పార్టీ నేతల తీరుపై అధినేత దగ్గర పక్కాగా సమాచారం ఉందట. బాబు ఫోకస్‌లో ఉన్న నాయకులు.. అధికారపార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉండటమో.. ఇక్కడి సమాచారాన్ని అక్కడికి చేరవేస్తుండటమో చేస్తున్నారట. ఈ లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న నాయకులపై ఒక అవగాహనకు వచ్చారట చంద్రబాబు.
చంద్రబాబు ఇదే స్పీడ్ కొనసాగిస్తారా? ఇక్కడితో ఆపేస్తారా?
చంద్రబాబు దగ్గరున్న కోవర్టుల జాబితాలో కొందరు ముఖ్యనేతలు మొదలుకొని.. పార్టీ బ్యాక్ ఆఫీస్‌లో పనిచేసేవాళ్లు… రోజువారీ ప్రెస్‌మీట్స్ పెట్టేవాళ్లుకూడా ఉన్నట్టు సమాచారం. ప్రక్షాళనకు చంద్రబాబు చూపిస్తున్న ఈ స్పీడ్ కొనసాగుతుందా? లేక ఇక్కడితో ఆగిపోతుందా? అనే చర్చ పార్టీలో ఉంది. ఏదైనా వ్యవహారంలో చాలా స్పీడ్‌గా వెళ్లడం.. తర్వాత చప్పున చల్లారిపోవడం పార్టీ అధినేతకు.. పెద్దలకు రొటీన్ అనే చర్చ ఉంది. కోవర్టులపై సీరియస్‌గా ఫోకస్ పెడితేతప్ప.. పార్టీ గాడిలో పడదన్నది తమ్ముళ్ల వాదన. ప్రస్తుతానికి చంద్రబాబు అడుగులు కరెక్ట్‌గానే పడుతున్నాయని.. ఇదే ఒరవడి కొనసాగితే బాగుంటుందన్నది మరికొందరు నేతల ఆశ. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!