Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Tdp Appoints Gollapalli Amulya As Razole Incharge Senior Leaders Unhappy

Off The Record: రాజోలులో రసవత్తరంగా రాజ‌కీయం.. టీడీపీ ఇంచార్జిగా వైసీపీ ఇంచార్జి కుమార్తె

Published Date :September 29, 2025 , 9:57 pm
By Chandra Shekhar Pamena
  • గొల్లపల్లి అమూల్యకు టీడీపీ రాజోలు ఇన్ఛార్జ్‌ పదవి..
  • షాకవుతున్న నియోజకవర్గ సీనియర్‌ లీడర్స్‌..
  • గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి సూర్యారావు..
  • తండ్రి వైసీపీ, కూతురు టీడీపీ ఇన్ఛార్జ్‌లు..
  • సీనియర్స్‌ని వదిలేసి అమూల్యను ఎలా తెర మీదికి తెచ్చారు?..
  • గొల్లపల్లి సూర్యారావు పథకం ప్రకారం పావులు కదుపుతున్నారా?..
  • కుమార్తెను టీడీపీలోకి పంపి తాను లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నారా?..
  • అమూల్య ఎంట్రీతో రాజోలు టీడీపీలో వర్గపోరు
Off The Record: రాజోలులో రసవత్తరంగా రాజ‌కీయం.. టీడీపీ ఇంచార్జిగా వైసీపీ ఇంచార్జి కుమార్తె
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఆ నియోజకవర్గంలో తండ్రి వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉండగానే… ఆయన కుమార్తెకు టీడీపీ ఇన్ఛార్జ్‌ పోస్ట్‌ ఎలా ఇచ్చారు? కనీసం పార్టీ ప్రాధమిక సభ్యత్వం కూడా లేని నాయకురాలిని ఇన్ఛార్జ్‌గా ఎలా నియమించారు? సడన్‌గా తెరపైకి వచ్చిన కూతురు పొలిటికల్ ఏంట్రీకి తెర వెనుక ఏం జరిగింది…? తండ్రి పార్టీ మారడానికి ముందస్తు స్కెచ్‌ వేస్తున్నారా? ఎవరా తండ్రీ కూతుళ్ళు? ఏంటా పొలిటికల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌?

Read Also: Chiranjeevi Fans : చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాం కానీ మా పోరాటం ఆగదు!

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
  • Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసక్తి రేపుతున్నాయి. ఇవి ఒకరకంగా….లోకల్‌ టిడిపిలో వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయట . ఇక్కడ సీనియర్స్‌ని కాదని, అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యకు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ బాధ్యతలు ఇవ్వడం చూసి అంతా షాకవుతున్నారట. గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం రాజోలు వైసీపీగా ఉన్నారు. అలాంటిది ఆయన కూతురికే టీడీపీ ఇన్ఛార్జ్‌ ఇవ్వడం ఏంటో అర్ధంగాక లోకల్‌ తమ్ముళ్లు తలలు బాదుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు టిడిపి ఇన్ఛార్జ్‌ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు గొల్లపల్లి సూర్యారావు. రాజోలు టిక్కెట్‌ను జనసేనకు ఇవ్వడంతో… ఇక తనకు ఛాన్స్‌ రాదనుకుని సైకిల్‌ దిగేశారు సూర్యారావు. గత ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయారాయన. ఆయన వెళ్లిపోయినప్పటి నుంచి టిడిపికి ఇన్ఛార్జ్‌ లేరు. దీని కోసం చాలా మంది సీనియర్లు ప్రయత్నం చేసినా ఎవరికీ దక్కలేదు. లోకేష్‌ పాదయాత్రలో ఆంతా తామై నడిపిన నాయకులు, ఇతర ముఖ్య నేతలు గట్టి ప్రయత్నం చేసినా వర్కౌట్‌ కాలేదు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే…రాపాక వరప్రసాదరావు కూడా ఇన్ఛార్జ్‌ పదవి కోసం టిడిపిలో చేరడానికి ముమ్మరంగా ప్రయత్నించారట. కానీ 16 నెలలుగా ఎవ్వరికీ ఛాన్స్‌ ఇవ్వకుండా అలాగే ఉంచేశారు.

Read Also: Vijay TVK Karur stampede: విజయ్ కావాలనే ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట..ఎఫ్ఐఆర్లో సంచలన అంశాలు

అలా.. అందర్నీ పక్కన పెట్టేసి ఆకస్మికంగా టీడీపీలో కనీసం ప్రాధమిక సభ్యత్వం కూడా లేని, రాజోలు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని గొల్లపల్లి అమూల్యను తెర మీదికి తీసుకురావడం ఏంటో అర్ధం కావడం లేదట. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాలపై టిడిపి శ్రేణుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లపల్లి సూర్యారావు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నంలో ఉన్నారా అన్నది వాళ్ళ అనుమానం. పథకం ప్రకారం ముందు కుమార్తెను పంపి పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. పార్టీలో చేరటానికి ముందే కమిట్మెంట్ తీసుకుని, తర్వాత కొద్ది నెలలకు లైన్ క్లియర్ చేసుకొని వెళ్ళడం సూర్యారావుకు కొత్తేమీకాదు. గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి జనవరి నెలలోనే కమిట్మెంట్ తీసుకుని ఎన్నికలకు ముందు మే నెలలో పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. రానున్న కొద్ది రోజుల్లోనే గొల్లపల్లి సూర్యారావు టిడిపిలో చేరుతారని స్థానికంగా విస్తృత ప్రచారం జరుగుతోంది.

Read Also: Rashmika Mandanna : జిమ్ లో కత్తిలాంటి అందాలకు చెమటలు పట్టిస్తున్న రష్మిక..

ఇదే విషయాన్ని వైసీపీ శ్రేణులు సూర్యారావు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన కౌంటర్‌ మరోలై ఉందట. అమూల్య నా కూతురే కాదంటూ ఆయన సీరియస్‌ అవుతున్నట్టు సమాచారం. అటు అమూల్యకు ఇన్చార్జి పదవి ఇవ్వడం పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అసలు పార్టీ సభ్యత్వంలేని అమూల్యకు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. దీని వెనక స్థానిక మంత్రి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు టిడిపి సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్న రాజోలు… పునర్విభజనలో జనరల్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని సొంత నియోజకవర్గంగా మార్చుకుంటాన్నది ఇంకో వెర్షన్‌. దీంతో రాజోలులో కూటమి పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amulya TDP appointment
  • Andhra Pradesh TDP updates
  • Gollapalli Amulya TDP Rajolu
  • Gollapalli Suryarao YSRCP
  • off the record

తాజావార్తలు

  • Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్‌బై!

  • Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!

  • PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..

  • Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు

  • RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions