కారు చిచ్చుకి కారణం ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం అధికారపార్టీలో చీలిక తెచ్చిందా? వర్గపోరు బయటపడిందా? ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ విభేదాలను మరో అంకానికి తీసుకెళ్లాయా? ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే?
బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు..!
సైలెంట్ రాజకీయాలకు పెట్టింది పేరైన తణుకులో ప్రస్తుతం రాజకీయం వాడీవేడిగా ఉంది. అదీ అధికార వైసీపీలో కావడంతో మరింత అటెన్షన్ వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. ఆ సమస్య పెద్దగా బయట పడింది లేదు. తెరవెనక ఎత్తుగడలకు పరిమితమైన ఈ రగడ.. గత నెలలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బయటపడింది. ఆహ్వాన పత్రాల్లో, ఫ్లెక్సీలలో MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్ పేరు కావాలనే పెట్టలేదని కాపు సామాజికవర్గం ప్రతినిధులు భగ్గుమన్నారు. ఆ గొడవ చల్లారకముందే జనవరి 2న YSR పెన్షన్ కానుక పార్టీ నేతల మధ్య మరో చిచ్చు పెట్టింది.
Also Read
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- Off The Record : నిశ్శబ్ద విప్లవమా.. వ్యూహాత్మక విస్తరణా? తెలంగాణలో బీజేపీ దూకుడు
ప్రొటోకాల్ విషయంలో వైసీపీ టౌన్ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే ఫైర్
ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు లేకుండానే వంకా రవీంద్రనాథ్ పెన్షన్లు పంపిణీ చేశారు. దీంతో ఎవరిని అడిగి ఆ కార్యక్రమం నిర్వహించారని వైసీపీ తణుకు అధ్యక్షుడు MSS రెడ్డిని నిలదీశారు ఎమ్మెల్యే. ప్రొటోకాల్ పాటించకపోవడంపై భగ్గున్నారు. ఎమ్మెల్యే ఆగ్రహం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి MSS రెడ్డి రాజీనామా చేశారు. వాస్తవానికి ఎమ్మెల్యే నోరు విప్పితే అడ్డూ ఆపూ ఉండదనే విమర్శ ఉంది. ఈ గొడవలో MSS రెడ్డి ఆయన తమ్ముడు రాంరెడ్డిని ఎమ్మెల్యే తిట్టడంవల్లే రాజీనామాల వరకు వెళ్లిందని తణుకు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సీఎంను తీసుకొచ్చి బర్త్‌డే చేయడం తన కొంప ముంచిందన్న ఎమ్మెల్యే..!
నిన్న మొన్నటి వరకు ఒక్కటిగా కనిపించిన తణుకు వైసీపీ.. ప్రస్తుతం వర్గాలుగా విడిపోయింది. జరిగిన పరిణామాలను ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి పార్టీ నేతలు చెప్పారట. అయితే ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఓపెన్‌గా చేసిన కామెంట్స్ చుట్టూనే ప్రస్తుతం వివాదం తిరుగుతోంది. సీఎంను తీసుకొచ్చి బర్త్‌డే చేశాను.. అదే నా కొంప ముంచింది. అర్జంటుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిపోవాలి. నేను దిగిపోవాలని అని కోరుకుంటున్నాడు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని సొంతపార్టీ నాయకులే చూస్తున్నారు అని ఎమ్మెల్యే అనడంతో దుమారం రేగుతోంది. ఎదురుగా వచ్చే వారితో పోరాడవచ్చు. వెనక ఉండి పొడి చేసేస్తున్నారు అని సొంత పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు కారుమూరి నాగేశ్వరరావు.
తణుకుపైనే అధికారపార్టీలో అందరి దృష్టి
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో పెద్దగా చర్చల్లోకి రాని తణుకు.. ఈ విధంగా అధికారపార్టీలో అలజడి రేపడంతో అందరి దృష్టీ ఇటు పడింది. కులాల కుంపట్లు సెగలు రాజేయకుండా.. రాజీనామాలు, వెన్నుపోట్లు శ్రుతిమించకుండా పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటారో లేదో అని కేడర్ ఎదురు చూసే పరిస్థితి ఉంది. మరి.. తణుకు ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డు ఉందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!