Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Trs Narikal Politics

నకిరేకల్ లో మూడుముక్కలాట తప్పదా..?

Published Date :November 27, 2021 , 4:18 pm
By Manohar
నకిరేకల్ లో మూడుముక్కలాట తప్పదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే మధ్య ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. ఇద్దరూ ఒకేపార్టీలో ఉన్నా.. వైరిపక్షాల మాదిరి తగువులాడుకునే పరిస్థితి. ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు మూడో నేత చేరారట. పార్టీ కేడర్‌లో చాలా మంది ఆ నాయకుడి దగ్గరకు వెళ్తుండటం చర్చగా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎవరా నాయకులు?

నకిరేకల్‌లో నేతి విద్యాసాగర్‌ భేటీలపై చర్చ..!

చిరుమర్తి లింగయ్య. 2018లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో టీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్నారు. జంపింగ్‌ ఎమ్మెల్యేకు కిక్కు ఇచ్చినా.. ఆయనపై ఓడిన టీఆర్ఎస్‌ నేత.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మాత్రం రుచించలేదట. ఇద్దరూ ఒకేపార్టీలోనే ఉన్నా.. ఒక్క క్షణం పడదు. ఎవరి వర్గం వాళ్లదే. ఎవరి కుంపటి వాళ్లదే. ఆధిపత్యపోరులో జరిగే గొడవలు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడీ ఎపిసోడ్‌లో శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ సరికొత్త చర్చకు తెరతీశారని గులాబీ శ్రేణులు కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి.

నేతితో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కేడర్‌ భేటీ..!

నేతి విద్యాసాగర్‌ది కూడా నకిరేకల్‌ నియోజకవర్గమే. రాజకీయంగా ఆయనకంటూ ఓ వర్గం కూడా ఉంది. ఎక్కడికెళ్లినా అనుచరులు ఫాలో అవుతారు. ఈ మధ్యే విద్యాసాగర్‌ ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వచ్చి నేతి విద్యాసాగర్‌ను కలిసి మాట్లాడి వెళ్తున్నారట. ఇది ఆ నోటా ఈ నోటా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వరకు చేరింది. లోకల్‌ ప్రజాప్రతినిధులు.. ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన్ని కలిసి మాట్లాడటంపై లింగయ్య అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్‌.

ఎమ్మెల్యే లింగయ్య, నేతి మధ్య గ్యాప్‌ పెరుగుతోందా?

రాజకీయంగా తమకు మద్దతుగా నిలుస్తున్నందుకే నేతి విద్యాసాగర్‌ను కలిసి మాట్లాడుతున్నామని.. ఆయన దగ్గరకు వెళ్లినవాళ్లు చెబుతున్నారట. ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్నవాళ్లు.. ఎటువైపు మొగ్గు చూపాలి అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారట. ప్రస్తుతానికి లింగయ్య, విద్యాసాగర్‌లు ఈ అంశంపై పెదవి విప్పకపోయినా.. రెండు వర్గాలు లోలోపల కత్తులు దూసుకుంటున్నాయని చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్య క్రమంగా గ్యాప్‌ కూడా పెరుగుతోందట. ఈ అంశాలపైనే టీఆర్ఎస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు తప్పదా?

అసలే లింగయ్య, వీరేశానికి పడక.. పార్టీ కేడర్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పుడు విద్యాసాగర్‌ ఎపిసోడ్‌ తెరపైకి రావడంతో నకిరేకల్‌లో మూడు ముక్కలాట తప్పదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు ఉంటాయని అనుకుంటున్నారట. నకిరేకల్‌ ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గం కావడంతో విద్యాసాగర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు. సీటుకోసం లింగయ్య, వీరేశం పోటీ పడొచ్చు. విద్యాసాగర్‌ ఎత్తుగడలే అంతుచిక్కడం లేదట. మరి.. నకిరేకల్‌ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • narikal
  • narikal politics
  • Politics
  • TRS
  • trs narikal politics

తాజావార్తలు

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

  • AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

  • Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions