Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Mansas Trust

అప్పన్న భూముల అప్పనంగా కొట్టేసింది ఎవరు…?

Published Date :July 6, 2021 , 11:22 am
By Manohar
అప్పన్న భూముల అప్పనంగా కొట్టేసింది ఎవరు…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సింహాచలం, మాన్సస్ అక్రమాల అంతు తేలుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. భగవంతుడి సొమ్ము తిన్న వాళ్లకు అరెస్టులు తప్పవని హింట్ ఇస్తోంది. ఈ హెచ్చరికల వెనక ప్రభుత్వ పెద్దలకు పకడ్బందీ వ్యూహమే ఉందా? విచారణ కోసం సీఐడీ రంగంలోకి దిగనుందా? తాజా పరిణామాలు దేనికి సంకేతం?

నాటి ఈవో రామచంద్రమోహన్‌ సమయంలోనే రికార్డుల్లో మార్పు?

విజయనగర సంస్థానం వారసత్వ వివాదం తర్వాత మాన్సస్ ట్రస్ట్.. సింహాచలం దేవస్థానం భూముల తేనెతుట్ట కదిలింది. 2016 సమయంలో సుమారు 800 ఎకరాల ఆలయ భూములు చేతులు మారాయనేది ప్రభుత్వం అంచనా. నిబంధనలకు విరుద్ధంగా టెంపుల్‌ ప్రాపర్టీ రిజిస్టర్లోనూ మార్పులు జరిగినట్టు నిర్ధారించుకుంది. అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అశోక గజపతిరాజుకు ఇష్టుడైన ఆఫీసర్‌గా ముద్రపడ్డ కోడూరి రామచంద్ర మోహన్‌ను విధుల నుంచి తప్పించింది. సింహాచలంలో ఆరేళ్లపాటు ఆయన ఈవోగా పని చేశారు. రామచంద్రమోహన్‌ హయాంలోనే ప్రాపర్టీ రిజిస్టర్లో దేవుడి భూముల రికార్డులను మార్చారనేది అభియోగం. ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ స్థాయిలో పనిచేస్తున్న రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయడం ద్వారా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్టేననే చర్చ జరుగుతోంది.

అశోక్‌, రామచంద్రమోహన్‌ కలిసి తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష!
సింహాద్రి అప్పన్నకు 11 వేల ఎకరాలకుపైగా భూములు!

అశోక గజపతిరాజు సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా ఉన్న కాలంలో ట్రస్ట్ బోర్డు మనుగడలో లేదు. మాన్సస్ వ్యవహారాలకు సైతం రామచంద్ర మోహనే ఇంచార్జ్‌గా ఉన్నారు. దీంతో అశోక గజపతిరాజు, రామచంద్ర మోహన్ ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఇటీవల దేవుడి ఆస్తులు-దేవాలయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సింహాచలం పంచ గ్రామాల వివాదం పరిష్కారం కోసం చర్చ జరిగినప్పుడు అనేక కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. సుమారు 11వేల ఎకరాలకు పైగా సింహాద్రి అప్పన్నకు భూములు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. వీటిలో రైతులు, బడబడా వ్యక్తుల చేతుల్లోనే సింహభాగం ఉన్నట్టు నిర్ధారణైంది.

1948 నుంచి మాన్సాస్‌లో జరిగిన లావాదేవీలపై ఫోకస్‌!
70 ఏళ్లనాటి రికార్డులు, ఫైళ్లు సిద్ధం చేస్తున్నారు!

మొత్తం భూముల వాస్తవ పరిస్థితులను లెక్క తీసేందుకు జియో టాగింగ్, రికార్డ్స్ డిజిటలైజేషన్ ప్రారంభమైంది. ఆ సందర్భంగానే ప్రాపర్టీ రిజిస్టర్లో తేడాలు గమనించారట. ఈ భూముల విలువ పదివేల కోట్ల రూపాయల పైమాటేనని ప్రభుత్వ పెద్దలు లెక్కగడుతున్నారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్‌ యాక్ట్ అమలులోకి రాగా.. అప్పటి నుంచి మాన్సస్‌లో జరిగిన లావాదేవీలు అన్నింటినీ పరిశీలించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించగా వీటిని సమన్వయం చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. దేవాదాయ, రెవెన్యు శాఖల దగ్గర ఉన్న మొత్తం రికార్డులను తనిఖీలు చేసి కులంకుషంగా విచారణ జరపాలని సూచించింది. దేవాదాయ, రెవెన్యు, రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాలతో కూడిన ఆరు బృందాలు ఆ పనిలో ఉన్నాయి. 70ఏళ్ల నాటి రికార్డులను తవ్వి తీయాలని నిర్ణయించడంతో.. వాటికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నాయి విచారణ బృందాలు.

అశోక్‌ మినహాయింపు కాదని ఇప్పటికే అధికారపార్టీ పెద్దలు ప్రకటన!

అశోక్‌ అక్రమాలను బహిర్గతం చేస్తామని ప్రకటించిన అధికారపార్టీ పెద్దలు ఇప్పుడు కొత్త ప్లాన్‌ను తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ఆయన ట్రస్ట్‌ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన కాలంలో భూముల బదలాయింపు జరిగిందని స్వయంగా మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్రమాలు నిరూపణైతే బాధ్యులను జైలుకు పంపడానికి వెనుకాడబోమని కుండబద్ధలు కొడుతున్నారు. ఇందుకు అశోక్ మినహాయింపు కాదని ఎంపీ విజయసాయిరెడ్డి ఖరకండిగా చెబుతున్నారు కూడా. అశోక్‌పై చర్యలు అనివార్యమైతే విజయనగర సంస్థానంపై ప్రజలకు ఉన్న అభిప్రాయాల ఆధారంగా తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే దూకుడుగా కాకుండా ప్రణాళిక బద్ధంగా వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనట.

విచారణ అధికారిగా డీసీ పుష్పవర్దన్‌ నియామకం
సీఐడీ ఎంట్రీ ఇచ్చాక ఒక దెబ్బకు రెండు పిట్టలు!

రికార్డుల మార్పు, భూములు బదలాయింపులను కుట్రపూరిత చర్యలుగా భావిస్తున్నారు అధికారపార్టీ పెద్దలు. తాజాగా విచారణ అధికారిగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌ను నియమించి స్పీడ్‌ పెంచారు. త్వరలో దర్యాప్తు కోసం సీఐడీని రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు భోగట్టా. దర్యాప్తు సంస్థగా సీఐడీకి ఉన్న అనుభవంతో సమగ్ర విచారణ జరిపించడం ద్వారా వన్ షాట్ ఎట్ టు బర్డ్స్ అనిపించాలన్నది అసలు ఉద్దేశంగా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తే పరిణామాలు కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Mansas Trust
  • Simhachalam Temple

తాజావార్తలు

  • Tollywood: సమ్మర్‌ అంటే ఎందుకంత భయం?

  • The Original Hitman: అప్పట్లోనే ఒకడు ఉండేవాడు.. 500 సిక్సర్లతో రోహిత్‌శర్మను మించిన హిట్‌మ్యాన్ ఇతను!

  • LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

  • Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions