Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Bikunda Police Station

రగడ రాజేసిన బిచ్కుంద పోలీస్ స్టేషన్!

Published Date :July 31, 2021 , 12:48 pm
By Lakshmi Narayana
రగడ రాజేసిన బిచ్కుంద పోలీస్ స్టేషన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు.. అధికారుల మధ్య అవగాహన ఉన్నంతకాలం ఎలాంటి గొడవలు రావు. తేడా కొట్టిందో.. రచ్చ రచ్చే. ఆ జిల్లాలో ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేకు.. జిల్లా ఎస్పీకి మధ్య అదే జరుగుతోందట. తమ పని తప్ప మరో అంశం పట్టని ఇద్దరికీ ఎక్కడ చెడిందనే చర్చ మొదలైంది. ఇంతకీ వారెవరు?

రగడ రాజేసిన బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌!

ఈయన కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే. ఇక శ్వేతారెడ్డి ఆ జిల్లా ఎస్పీ. బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌ విషయంలో వచ్చిన వైరం ఇద్దరి మధ్యా గ్యాప్‌ తీసుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎప్పుడూ పెద్దగా చర్చల్లోకి రాని ఎమ్మెల్యే షిండే.. ఎస్పీ శ్వేతారెడ్డిలు.. వారి మధ్య వచ్చిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు.. బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌పై అందరి ఫోకస్‌ పడింది. అక్కడేం జరుగుతుందని ఆరా తీసిన వారికి అసలు విషయం తెలిసి.. గట్టిపట్టే పట్టారని చెవులు కొరుక్కుంటున్నారు.

ఎమ్మెల్యేకు తెలియకుండా సీఐకి పోస్టింగ్‌?

కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద ఓ మారుమూల ప్రాంతం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. బిచ్కుంద పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతుంది. బీర్కూర్‌ క్వారీ ఈ విషయంలో పెట్టింది పేరు. ఇటీవల కొన్ని ఆరోపణలతో బిచ్కుంద సిఐ, ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ పోస్టులన్నీ ఇక్కడ పీఎస్‌లో ఖాళీ. ఇటీవలే బిచ్కుంద పోలీస్‌ స్టేషన్‌లో ఓ సీఐకు పోస్టింగ్‌ ఇచ్చారు. అది స్థానిక ఎమ్మెల్యే హనుమంతు షిండేకు తెలియదట. దీనికంతటికీ ఎస్పీ శ్వేతారెడ్డే కారణమని అనుమానించారట ఎమ్మెల్యే. అంతే ఎస్పీకి ఆయనకు మధ్య వైరం మొదలైందని పార్టీ వర్గాల టాక్‌.

బదిలీ అయిన సీఐ కోసం పట్టుబడుతున్నారా?

ఇన్నాళ్లూ సీఐ పోస్ట్‌ ఖాళీగా ఉంటే ఎలాంటి చర్చ లేదు. కానీ.. మరో అధికారికి పోస్టింగ్‌ ఇవ్వగానే రగడ మొదలైంది. ఎస్పీ వైఖరిపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారట. తన నియోజకవర్గంలో.. తనకు చెప్పకుండా ఎలా పోస్టింగ్‌ ఇస్తారని ఫైర్‌ అవుతున్నట్టు సమాచారం. అంతేకాదు… ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ అయిన పాత సీఐనే మళ్లీ తీసుకురావాలన్నది అధికారపార్టీ నేతల ఆలోచనగా చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు కొనసాగుతుండగానే.. కొత్త సీఐని ఎలా వేస్తారన్నది ఎమ్మెల్యే అనుచరులు వేస్తున్న ప్రశ్న.

ఎస్పీ చొరవ రాంగ్‌ సిగ్నల్‌ పంపిందా?

ఈ వివాదం ముదురు పాకన పడటంతో బిచ్కుందలో ఛార్జ్‌ తీసుకోవడానికి కొత్త సీఐ జంకుతున్నారట. ఎమ్మెల్యే, ఎస్పీల గొడవ మధ్య తలదూర్చితే సీన్‌ సితారం అయిపోతుందనే టెన్షన్‌లో ఉన్నట్టు సమాచారం. బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌పై వరసగా ఆరోపణలు వస్తుండటంతో.. వాటికి చెక్‌ పెట్టేందుకు ఎస్పీ శ్వేతారెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారట. సదుద్దేశంతో చేపట్టిన చర్యలు రాంగ్‌ సిగ్నల్‌ పంపాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాకపోతే ఇన్నాళ్లూ వివాదాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే, ఎస్పీల మధ్య ఒక పోలీస్‌ స్టేషన్‌లో సీఐ పోస్టింగ్‌ గ్యాప్‌ తీసుకొచ్చింది. అనుమానాలకు.. ఆగ్రహాలకు బీజం వేసింది. వాస్తవానికి నియోజకవర్గాల్లో సీఐలు, ఎస్‌ఐల పోస్టింగ్‌లు చాలా చిన్నవే అయినా.. ప్రజాప్రతినిధుల ఆశీస్సులు లేకపోతే ఇబ్బందే. ఎమ్మెల్యేలు ప్రతిష్టగా తీసుకుంటారు. అందుకే ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bikunda Police Station
  • off the record
  • TRS

తాజావార్తలు

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

  • Off The Record : సీఎం రేవంత్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పై ఎమ్మెల్యేల మధ్య చర్చ

  • Story Board : అల్టిమేటం ఇచ్చిన అమెరికా.. ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏమవుతుంది యుద్ధం ?

  • Harshil Kalia: విషాదం.. కారు ప్రమాదంలో నటి హర్షిల్ కాలియా కన్నుమూత

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions