Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Silent Mode Of Visakha Alliance Mlas Why No Counter To Ysrcp

OTR: వైసీపీ దూకుడు.. విశాఖ కూటమి నేతలు సైలెంట్ మోడ్

Published Date :November 21, 2025 , 10:26 pm
By Shiva Ganesh
  • ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతల సైలెంట్‌ మోడ్
  • వైసీపీ ఓ రేంజ్‌లో నిరసనలు చేస్తున్నా నో కామెంట్స్
  • వైసీపీకి కూటమి నుంచి కరువైన కౌంటర్‌
  • సై అంటే సై అనకుండా సైలెన్స్
  • అమరావతి నుంచి మాత్రమే స్పందనలా?
  • ఉమ్మడి విశాఖ కూటమి ఎమ్మెల్యేల మౌనానికి కారణమేంటి?
  • వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారు?
OTR: వైసీపీ దూకుడు.. విశాఖ కూటమి నేతలు సైలెంట్ మోడ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

OTR: ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ల నేతల మౌనంపై రకరకాల చర్చ జరుగుతోంది. వైసీపీ ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నా…అత్యంత బలంగా వున్న కూటమి పార్టీల నుంచి కౌంటర్‌ అటాక్‌ కరువైంది. ఎందుకు మౌనంగా వున్నారన్నదానిపై వాడివేడి డిస్కషన్ సాగుతోంది. జిల్లా మొత్తంలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్ధానం మాత్రమే కలిగి వున్న వైసీపీ…కూటమి ప్రభుత్వాన్ని అల్లాడించేస్తోంది. ఇష్యూ బేస్డ్ గా ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. కూటమి వాగ్ధానాల్లో మెజార్టీ అమలు సాధ్యంకాని మోసపూరిత హామీలేనని ప్రజల ముందు పంచాయితీ పెడుతోంది. కేడర్ బలంతో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదికే నెగెటివిటీని డెవలప్ చేయడంలో వైసీపీ సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీ చేసిన నిరసనలు సక్సెస్ కావడం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంకు వ్యతిరేకంగా జగన్ చేసిన టూర్ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకట స్ధితిగా మారింది.

READ ALSO: Off The Record: కోల్డ్‌వార్ సోషల్ మీడియా సృష్టే.. విభేధాల్లేవని బండి, ఈటల ప్రకటన!

ఈ స్ధాయిలో ఎదురుదాడి ప్రతిపక్షం నుంచి వస్తున్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు అందిపుచ్చుకుని కడిగిపారేయాలి. ప్రభుత్వం దగ్గర వున్న డేటాతో సహా వాస్తవాలను ప్రజల ముందు ఆవిష్కరించి వైసీపీని ఎండగట్టే ప్రయత్నం జరగాలి. కానీ, అనూహ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు సైలెన్స్…మోడ్ ఎంచుకున్నారా అనేది చర్చ మారింది. బొత్స, గుడివాడ అమర్‌ వంటి నేతల దూకుడుకు బ్రేకులు వేసే సమర్ధత, రాజకీయ అనుభవం టీడీపీ సీనియర్లకు వుంది. కానీ, స్పందనలు రావాల్సింది అమరావతి నుంచే తప్ప మాతరపు నుంచి కాదన్నట్టే వుంటుంది ఇక్కడ నేతల తీరు. వాళ్ళంతా యాక్టి వ్‍ రోల్ తీసుకోకపోవడం వెనుక కారణాలు ఆసక్తికరం గానే వున్నాయి.

వాస్తవానికి, ప్రభుత్వం.., పార్టీ పరంగా లభిస్తున్న ఆదరణ పట్ల సీనియర్ ఎమ్మెల్యేలు అసంత్రుప్తిగా వున్నారు. ఏలూరు వేదికగా జరిగిన మహానాడులో మాడుగుల ఎమ్మెల్యే, మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహారణ. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్స్ విస్త్రత చర్చకు తెరతీశాయి. నిధుల కేటాయింపులో మాడుగుల నియోజకవర్గం వివక్ష ఎదుర్కోంటోందనేది ఎమ్మె ల్యే ఆవేదన. అప్పట్లో ఈ వ్యవహారం మీద పెద్ద డిష్కషనే జరిగింది. ‘మా ప్రభుత్వం-మంచి ప్రభుత్వం’ అనే ఇంటింటీ కార్యక్రమాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. ఇవ్వన్నీ కేవలం కొన్ని ఉదాహరణలే. జనసేన గెలిచిన దగ్గర టీడీపీ, టీడీపీ గెలిచిన చోట జనసేన ఎమ్మెల్యేలు, సీనియర్ల మధ్య గ్యాప్ పెరుగుతోంది. అధిష్టానం దగ్గరకు తీసుకెళ్లినా…చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గొడవను మరింత పెంచుతోంది.

విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సమ్మిట్‌లో 13లక్షల కోట్ల విలువైన ఎంవోయూలను వచ్చాయన్న ప్రభుత్వ ప్రకటన పచ్చి బూటకమని వైసీపీ విమర్శిస్తోంది. ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆచితూచి మీడియా ముందుకు వచ్చింది మాజీ మంత్రి గంటా, ప్రభుత్వ విప్ గణబాబు మాత్రమే. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లారి యాక్షన్‍ పక్కనబెడితే మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏమై పోయారంటే …ష్ గప్ చుప్…!. గంటా సైతం వైసీపీకి చాలెంజ్ విసిరి నిరూపిస్తే రాజీనామా చేస్తానని గాంభీర్యం ప్రదర్శించినా పెద్దగా జనానికి రీచ్ అవ్వలేదు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సీఎం చేసిన వ్యాఖ్యలు అటు కార్మికులు, ఇటు రాజకీయ పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా సీఎం వ్యాఖ్యలను ప్రతి పక్షం వక్రీకరించిందని…..మా కమిట్మెంట్లో ఎటువంటి లోటు లేదని ట్వీట్ చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రజావేదికల మీద వైసీపీతో సై అంటే సై అని చాలెంజ్ చేసి నిరూపించాల్సిన చోట అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్టు కనిపించడం కచ్చితంగా లోటేనంటున్నాయి టీడీపీ వర్గాలు. పిలవని పేరంటం….కోరి కయ్యం రెండూ నష్టమేనని సీనియర్లు గుర్తించడం వల్లే ఈ తరహా వ్యవహారం నడుస్తోందన్న చర్చ జరుగుతోంది.

READ ALSO: WPL 2026 Auction List: ప్లేయర్‌ల వేలం లిస్ట్ విడుదల.. 73 స్థానాల కోసం 277 మంది పోటీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alliance dissatisfaction TDP JanaSena
  • Andhra Pradesh Politics
  • AP coalition government tensions
  • TDP JanaSena internal issues
  • Visakha political analysis

తాజావార్తలు

  • Huawei Pura X Max: 7.7-అంగుళాల స్క్రీన్, 5,300mAh బ్యాటరీతో.. కొత్త ఫోల్డబుల్ 5G ఫోన్ విడుదల

  • KCR : జీవన్ రెడ్డి కి గులాబీ కండువా కప్పి BRS లోకి ఆహ్వానించిన కేసీఆర్

  • AP Government Job Recruitment: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక కేడర్‌ ఖరారు..

  • Kara: ఏప్రిల్ 30న తెలుగులో ధనుష్ ‘కర’ రిలీజ్

  • CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions