Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Shock To Tdp Bhavani Will Not Contest In The Coming Elections

TDP : టీడీపీకి షాక్! వచ్చే ఎన్నికల్లో మహిళా నేత భవాని పోటీ చేయడం లేదా?

Published Date :June 17, 2022 , 10:52 am
By Premchand Chowdary
TDP : టీడీపీకి షాక్! వచ్చే ఎన్నికల్లో మహిళా నేత భవాని పోటీ చేయడం లేదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో రాజమండ్రి ఒకటి. ఇక్కడి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉండటమే దానికి కారణం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా.. ఇప్పటి నుంచి పావులు కదుపుతున్న నేతలు ఎక్కువే. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమె దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారు. అర్బన్‌లో భవాని నెగ్గితే.. రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో మూడేళ్లుగా ఇక్కడి రాజకీయాలు ఆసక్తిగా ఉంటున్నాయి. ఇంతలో అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌ నుంచి తన భర్త శ్రీనివాసు పోటీ చేస్తారని చెప్పారు ఎమ్మెల్యే భవాని. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదన్నది ఆమె మాట. వాస్తవానికి 2019లోనూ చివరి నిమిషంలో తనను టీడీపీ అధిష్ఠానం పోటీ చేయిందనీ చెప్పుకొచ్చిన ఆమె.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తనకంటే భారీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాసుయేనని చెప్పడంపై కేడర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందట. అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా ప్రకటన చేశారా? లేక సొంత స్టేట్‌మెంటా అనేది చర్చగా మారింది.

వాస్తవానికి ఆదిరెడ్డి కుటుంబంలో శ్రీనివాస్‌ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా రాజకీయంగా పదవులు అనుభవించినవాళ్లే. వాసు తండ్రి అప్పారావు ఎమ్మెల్సీగా, తల్లి వీరరాఘవమ్మ రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు. వాసు భార్య భవాని ఎమ్మెల్యే. 2019లో వాసునే టీడీపీ టికెట్‌పై పోటీ చేయాల్సి ఉంది. కానీ.. భవానీకి టికెట్‌ ఇచ్చింది పార్టీ. అందుకే వచ్చే ఎన్నికల్లో వాసును బరిలో దించి ఎమ్మెల్యేగా చేయాలని ఆదిరెడ్డి కుటుంబం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట.

రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి అర్బన్‌ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఆయన ఇప్పటికే కర్చీఫ్‌ వేసుకుని కూర్చున్నారు. పైగా ఆదిరెడ్డి కుటుంబంతో ఆయనకు పడటం లేదు. రాజమండ్రి రూరల్‌ నుంచి రెండుసార్లు. రాజమండ్రి అర్బన్‌ నుంచి నాలుగుసార్లు గెలిచారు బుచ్చయ్య చౌదరి. సిటీని వదిలేసి తప్పు చేశానన్న ఫీలింగ్‌లో ఆయన ఉన్నారట. పైగా అర్బన్‌లో అనుచరగణం ఉండటంతో రాజమండ్రిపై గట్టి ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే భవాని ముందుగానే ప్రకటన చేశారా? అనేది డౌట్‌.

ఆ మధ్య ఆదిరెడ్డి శ్రీనివాసు రాజమండ్రి లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఆయన మాత్రం అసెంబ్లీకే బరిలో ఉంటానని అనుచరులకు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో రాజమండ్రిలో పట్టు నిలుపుకొనేందుకు ఆదిరెడ్డి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఆదిరెడ్డి, గోరంట్ల వర్గాల మధ్య నిత్యం గొడవలు కామనైపోయాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తున్నది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adireddy Bhavani
  • Adireddy Srinivas
  • gorantla butchaiah chowdary
  • rajahmundry
  • tdp

తాజావార్తలు

  • Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?

  • Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!

  • Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

  • Municipal Ward Delimitation: మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచిన సర్కార్..

  • Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions