OTR: బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాలతో గ్రేటర్ బీజేపీ కాన్ఫిడెన్స్
- గ్రేటర్ బీజేపీలో బృహన్ ముంబై కార్పొరేషన్ రిజల్ట్ జోష్
- రాబోయే గ్రేటర్ పోరులో ముంబై రిజల్ట్ రిపీట్ అంటూ లెక్కలు
- అక్కడి గెలుపు సంబరాలేనా...ఇక్కడెప్పుడు అని పార్టీలో చర్చ
- పట్టణ ఓటర్లపై కమలం గంపెడాశలు
- గ్రేటర్ బీజేపీకి అంత సత్తా వుందా?
- బీజేపీ వ్యూహాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఛైర్ పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పురపోరుకు సిద్దమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఉత్సాహంతో, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగతా కార్పొరేషన్లలోనూ పాగా వేస్తామని చెబుతోంది.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య..
Also Read
GHMC ఎన్నికలపై క్యాడర్‌కు దిశానిర్దేశం
ఇప్పటికే విజయ సంకల్ప సమావేశం నిర్వహించి కేడర్‌కి దిశా నిర్దేశం చేసింది బీజేపీ. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ వికసిస్తున్న తీరును పార్టీ నేతలు వివరించారు. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట తిరువనంతపురంలో బీజేపీ జెండా ఎగురవేసిన విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ర్ట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరును గుర్తు చేశారు. అక్కడ కార్పొరేషన్లు గెలిచినందుకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోనూ సంబరాలు చేసుకున్నారు. అయితే, బీజేపీ నేతలపై ఒక విమర్శ వుంది. ఎక్కడా గెలిచిన ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకునే బీజేపీ…మరి ఇక్కడి కార్పొరేషన్‌లో గెలిచేదెప్పుడు అని సెటైర్లు పేలుస్తున్నారు.
గ్రేటర్‌లో బృహన్ ముంబై రిజల్ట్ రిపీట్ అంటూ లెక్కలు
మహారాష్ట్ర ఫలితాలతో ఉప్పొంగిపోతున్న తెలంగాణ బీజేపీ నేతలు…గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయని ఢంకా బజాయిస్తున్నారు. గతం వేరు, ప్రస్తుతం వేరని అంటున్నారు. తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించిన ప్రజలు …మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లు వేశారని చెబుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరేనని..ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎన్నో లెక్కల్లో తలనమునకలైన కమలనాథులు…చివరికి ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
READ ALSO: AI ఉద్యోగులను తొలగిస్తుందా..? కొత్త అవకాశాలు సృష్టిస్తుందా..? సంచలన నివేదిక..
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!