OTR: వర్మ కొత్త నియోజకవర్గం ఆశలు, వ్యూహాలు ఫలిస్తాయా?
- కొత్త అవకాశాల అన్వేషణలో పిఠాపురం వర్మ
- నూతన నియోజకవర్గాలపైనే వర్మ ఆశలు
- కొత్త సెగ్మెంట్ ఏర్పాటైతే కుటుంబ వ్యూహానికి పదును
- మహిళా రిజర్వేషన్ వస్తే వర్మ భార్య పోటీ
- యువతకు అవకాశం ఇవ్వాలనుకుంటే కుమారుడు గిరీష్ రెడీ
- కుటుంబ సభ్యులతో నియోజకవర్గంలో వర్మ పర్యటనలు
- పవన్ కల్యాణ్ ఆశీస్సులు ఉండాలంటూ సరికొత్త మెలికలు
- పిఠాపురం తాను పుట్టి పెరిగిన ప్రాంతమంటున్న వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: పొలిటికల్గా ఫ్యూచర్ బాగుంటుందనుకొని ఆయన తన సహజసిద్ధమైన నైజాన్ని వదులుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని పట్టుబట్టినా…హైకమాండ్ అడ్డుచెప్పటంతో పక్కకు తప్పుకున్నారు. అప్పుడు బరిలోకి దిగలేకపోయినా….ఇప్పుడు సరికొత్తగా అవకాశాలు సృష్టించుకునే పనిలో పడ్డారు. మరి…కొత్త నియోజవర్గాల ఏర్పాటుతో ఆ మాజీఎమ్మెల్యే దూకుడు పెంచారా?ఎటు నుంచి ఎటు వెళ్లినా…ఈసారి పోటీ మాత్రం పక్కా అంటున్నారా? కుటుంబ కథాచిత్రానికి రెడీ అవుతున్నారా? ఇంతకీ…ఎవరా నేతా? ఏంటా స్టోరీ?
READ ALSO: OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!
Also Read
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. తొలిసారి 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచారు. 2019లో పోటీ చేసినా…ఆయనకు ఓటమి తప్పలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో వర్మ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ప్రమోషన్ ఇస్తామని అప్పట్లో పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలోనూ వర్మకు రాజకీయంగా తాను సపోర్ట్ చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ తనకు ఎలాంటి రాజకీయ పదవి రాలేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారట వర్మ. పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండటం లేదనేది వర్మ వాదనగా తెలుస్తోంది. మరోవైపు వర్మను ప్రమోట్ చేయడానికి జనసేన నుంచి అభ్యంతరాలు వస్తున్నాయనే టాక్ నడుస్తోంది. ఐతే…ఈసారి మాత్రం ఎలాగైనా పోటీ చేయాలని వర్మ విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నారట.
ఇక…ఈ మధ్యనే పిఠాపురం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భార్య, కుమారుడితో కలిసి పాల్గొన్నారు పిఠాపురం టిడిపి కోఆర్డినేటర్ వర్మ. కొత్త నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయని… పిఠాపురం స్వరూపం మారబోతోందని కేడర్కు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఈసారీ తన కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని అనుచరులతో చెప్పినట్లు సమాచారం. మహిళా రిజర్వేషన్ వస్తే తన భార్య పోటీ చేస్తారని…అందులో అనుమానమే లేదని అంటున్నారనే టాక్ నడుస్తోది. పార్టీ యువతకు అవకాశం ఇవ్వాలనుకుంటే తన కుమారుడు గిరీష్ కూడా రెడీగా ఉన్నాడని అప్పుడే చెప్పేస్తున్నారట వర్మ. ఈసారి ఎవరు చెప్పినా తాము త్యాగరాజులుగా మాత్రం మిగిలిపోయే పరిస్థితి ఉండబోదని కుండబద్దలు కొట్టేస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట.
పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. దానికి అనుగుణంగా మండలాల వారీగా ముగ్గురు కుటుంబ సభ్యులు పంచుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సైతం దానికి అనుగుణంగా కుటుంబ సభ్యులతో పర్యటనలు చేశారు వర్మ. కొత్త నియోజకవర్గం సరిహద్దులు ఏ విధంగా ఉన్నప్పటికీ అంతా ప్రిపేర్ అయిపోతున్నారని తెలుస్తోంది. జనసేన కూడా ఈ వ్యవహారంపై రియాక్ట్ అవుతోందని సమాచారం. నియోజకవర్గాల స్వరూపం మారినా…పాత సెగ్మెంట్ కోటాలో గ్లాసు పార్టీ బలంగా ఉంటుందని గుర్తుచేస్తున్నారట జనసైనికులు. పవన్ కల్యాణ్ ఆశీస్సులు కూడా ఉండాలంటూ సరికొత్తగా మెలికలు పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దానికి వర్మ వర్గం కూడా అంతే స్థాయిలో రిప్లై ఇస్తోందట. ఎవరి బలం ఎవరికి ఉపయోగపడిందో అందరికీ తెలుసని పాత సంగతులు గుర్తుచేస్తున్నారట. దాని రిజల్ట్ ఎవరికి ఉపయోగపడిందో కూడా రాజకీయ అవగాహన ఉన్న వాళ్లకు అర్థమవుతుందని ఏకంగా సెటైర్లు సైతం వేస్తున్నారని టాక్. పిఠాపురం తాను పుట్టి పెరిగిన ప్రాంతమని గుర్తుచేస్తున్నారట వర్మ. పదవి ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉంటానని అడ్వాన్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ ప్లానింగ్ గట్టిగానే సిద్ధం చేసుకుంటున్నారు వర్మ. జనసైనికులు మాత్రం అంత స్పీడ్ అయిపోతే ఉపయోగం ఉండదని అంటున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మొత్తానికి…కొత్త నియోజకవర్గాలు రానుండటంతో ఈసారి పక్కా పోటీ అంటున్నారు. భార్యను, కుమారుడిని కూడా ఫీల్డ్లోకి తీసుకొచ్చి సై అంటున్నారు. మరోవైపు జనసేన కూడా వర్మకు అంత సీన్ లేదని రిప్లై ఇస్తోందని టాక్. మరి ఎవరి లెక్కలు వర్కౌట్ అవుతాయో చూడాలి.
READ ALSO: OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్‌ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్‌ప్లే, 144Hz డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..