Site icon NTV Telugu

OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?

Otr

Otr

OTR: తెలంగాణలోకి జనసేన ఎలక్షన్‌ ఎంట్రీ ఇస్తోంది. అందుకు మున్సిపల్‌ ఎన్నికల్ని లాంఛ్‌ప్యాడ్‌గా ఎంచుకుంది. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని డిసైడైన జనసేనాని పవన్‌కళ్యాణ్‌ ఈ వారంలో ఇక్కడ మైకందుకోబోతున్నారు. మరి జనసేన ప్రచారం తెలంగాణలో బీజేపీకి లాభనా? లేక నష్టమా? తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్‌ మళ్ళీ సెంటిమెంట్‌ని రాజేస్తుందా? లెట్స్‌ వాచ్‌.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన జనసేన ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకున్నా…. వాటిని బేస్‌ చేసుకునే రాష్ట్రంలో తనకు కూడా పునాదులు వేసుకోవాలని భావిస్తోంది. ఈ ఎలక్షన్స్‌లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించిన పవన్‌కళ్యాణ్‌ ఈవారంలో రంగంలోకి దిగబోతున్నారు. దీంతో… జనసేన ఎంట్రీ వెనక అసలు వ్యూహం ఏంటి? ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం? అన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక లోటు ఉంది.

Off The Record: ట్రెండ్ మార్చిన ఎమ్మెల్యే.. కాకినాడ పోలీసులకు వింత కష్టం

కేంద్రంలో అధికారం ఉన్నా… రాష్ట్ర స్థాయిలో మాత్రం పుంజుకోలేక ఒక క్రౌడ్‌ పుల్లర్‌ కోసం చూస్తోంది. మహామహులైన నేతలు ఉన్నా… జనాకర్షణ కలిగిన వాళ్ళు కావాలన్నది కింది స్థాయిలో బలంగా ఉన్న అభిప్రాయం. ఈ లోటును భర్తీ చేయడానికే యూత్‌ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌ను ముందుకు తీసుకురావాలన్నది కాషాయ పార్టీ వ్యూహంగా విశ్లేషిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇక జనసేన కోణంలో చూస్తే… ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా బలపడిన పార్టీ తెలంగాణలో కూడా పాగా వేయడానికి ఇదే అదననుగా భావిస్తోందట. దీన్నో విస్తరణ ప్రయత్నంగా పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే కూటమి ధర్మంగా బీజేపీ మున్సిపల్‌ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి ఒకే చెప్పారట.

తమ పార్టీకి తెలంగాణలో సంస్థాగత బలం లేకపోయినా…. పవన్ కల్యాణ్‌కున్న వ్యక్తిగత క్రేజ్‌తో పార్టీకి గుర్తింపు తీసుకురావాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారున్నారు జనసైనికులు. అయితే…. ఇక్కడే అసలు రిస్క్ ఉంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. ఇంటి పార్టీగా చెప్పుకునే భారత రాష్ట్ర సమితికి పవన్‌ ఎంట్రీ ఒక అవకాశంగా మారే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రానికి చెందిన పార్టీ, అందులోనూ టిడిపి-బిజెపి కూటమిలో ఉన్న పవన్‌ తెలంగాణలో ప్రచారం చేస్తే మళ్లీ సెంటిమెంట్‌ను రాజేయాలని కారు పార్టీ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు తెలంగాణ పార్టీ అనే నినాదాన్నిమరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం బీఆర్‌ఎస్‌కు దక్కిందని అంటున్నారు కొందరు.

HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..

మున్సిపల్ ఎన్నికలే అయినా ఇలాంటి పొలిటికల్ ఎంట్రీల ప్రభావం రేపటి అసెంబ్లీ రాజకీయాలపై కూడా పడుతుందని అంటున్నారు అనుభవజ్ఞులు. పవన్ కల్యాణ్ క్రేజ్‌ పట్టణ యువతను ఆకర్షిస్తుందా? లేక అదే క్రేజ్ బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్ ఆయుధంగా మారుతుందా? అన్నది ఇక్కడ బిగ్‌ క్వశ్చన్‌. ఇది బీజేపీకి ఒక ఇమేజ్ బిల్డింగ్ ప్రయత్నం, జనసేనకు పొలిటికల్ ఎక్స్‌పాన్షన్ ప్రయోగం. కానీ… ఈ ఎంట్రీ అసలు లాభం తెలంగాణ సెంటిమెంట్‌ను రాజకీయంగా మలుచుకునే బీఆర్‌ఎస్‌కేనా? అన్న ప్రశ్నే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల దాకా వేచి చూడాల్సిందే.

Exit mobile version