Site icon NTV Telugu

Off The Record: వైసీపీలో అత్యంత కీలక మార్పులు.. వైఎస్ జగన్ క్లియర్ కట్ ఇండికేషన్స్

Jagan

Jagan

Off The Record: వైసీపీలో అత్యంత కీలకమైన మార్పులు జరగబోతున్నాయా? పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆ దిశగా క్లియర్‌కట్‌ ఇండికేషన్స్‌ ఇచ్చేశారా? ఇప్పటికే ఆ దిశగా ప్రక్రియ మొదలైపోయిందా? జగన్‌ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది నిజమేనా? ఏ విషయంలో ఆయన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పార్టీ పరంగా జరుగుతున్న మార్పులేంటి?

Read Also: Off The Record: సొంత నేతలే అధికార కాంగ్రెస్ పార్టీ పరువు బజారుకీడుస్తున్నారా?

పార్టీ రీఛార్జ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా తాడేపల్లి సెంట్రల్‌ ఆఫీస్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్‌. కింది స్థాయి నుంచి కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు, జిల్లా అధ్యక్షులతో మీటింగ్‌లు నడుస్తున్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవుల్ని సైతం భర్తీ చేస్తున్నారు. ఇలా… అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగా పార్టీ యాక్టివిటీ నడుస్తుండటంతో.. ఏదో.. ఉంది, ఏం జరుగుతోందన్న అమమానాలు మొదలయ్యాయట రాజకీయ వర్గాల్లో.
పార్టీని బౌన్స్ బ్యాక్ చేసేందుకు కార్యక్రమాల్లో వేగం పెంచారన్న మాటలు వినిపిస్తున్నా… ఎక్కువ మంది సంతృప్తి చెందకుండా ఇంకా ఏంటని తెగ ఆరాలు తీసేస్తున్నారట. ఘోరమైన ఓటమి నుంచి మూడు నెలలకే కోలుకున్నారు జగన్‌. పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పార్టీ నేతలపై వరుస కేసులు, జైళ్ళ ఎపిసోడ్స్‌ నడుస్తున్నా పెద్దగా కుంగి పోయినట్టు కనిపించలేదు. పైగా… మళ్ళీ వచ్చేది మనమేనంటూ కార్యకర్తలకు జగన్ 2.0 ను పరిచయం చేశారు. కానీ… అప్పుడెప్పుడూ లేనంత ఉలికిపాటు, హడావిడి ఇప్పుడు మాత్రమే ఎందుకు మొదలైందన్న చర్చ జరుగుతోందట ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఈ క్రమంలోనే…. అది లిక్కర్‌ ఎపిసోడ్‌ ప్రభావం అయి ఉండవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా లిక్కర్‌ స్కామ్‌ వైసీపీ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. అది స్కామా? కాదా? అన్న సంగతి పక్కనబెడితే… అందుకు సంబంధించి బిగ్‌బాస్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం మాత్రం పార్టీ వర్గాలను కంగారు పెడుతోందట. జగన్ మీదున్న పాత కేసుల వ్యవహారం ఇప్పటికిప్పుడు తేలకున్నా.. లిక్కర్ కేసులో మాత్రం కూటమి సర్కార్ టార్గెట్ చేయవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి.

Read Also: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

అయితే, ఈ పరిస్థితుల్లో.. ఒకవేళ నిజంగానే మేటర్ జగన్‌ అరెస్ట్‌దాకా వెళితే.. పరిస్థితి ఏంటి? పార్టీని నడిపేది ఎవరన్న చర్చ జరుగుతోందట అంతర్గతంగా. దీంతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడేలా… అటు క్యాడర్, ఇటు లీడర్స్‌ ఆత్మస్దైర్యం నింపే కార్యక్రమమే ఈ వరుస మీటింగ్స్‌ అన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. పార్టీని రీసెట్ చేసి.. ఎక్కడికక్కడ ఎవరి బాధ్యతలు వారికి అప్పగిస్తే.. వాళ్ళు ఆ పనిలో ఉంటారని జగన్‌ అంచనా వేస్తుండవచ్చని అంటున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ, జిల్లా అధ్యక్షుల మీటింగ్‌లోనూ జగన్ చేస్తున్న దిశా నిర్దేశాన్ని గమనిస్తుంటే.. ఈ విషయమే బోధపడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జిల్లా అధ్యక్షుల సమావేశంలో అయితే, ఆయన ఓ అడుగు ముందుకేసి పార్టీకి జిల్లా అధ్యక్షులే బాస్ లు.. మీ జిల్లాల్లో మీరే పార్టీ.. పార్టీయే మీరు అని క్లారిటీగా చెప్పేశారట. అవసరమైన సమయాల్లో అన్ని రకాల నిర్ణయాలు మీరే తీసుకోవచ్చని, ఎవరి ఆదేశాల కోసమో చూడాల్సిన పనిలేదంటూ ఫుల్ ఫ్రీడం ఇచ్చేసినట్టు తెలిసింది.

Read Also: GT vs SRH: వీరబాదుడు బాదిన జీటి బ్యాటర్లు.. ఎస్ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్!

ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లతో కలుపుకుని కార్యక్రమాలు చేపట్టాలని, ఒకవేళ అక్కడ రెండు వర్గాలు ఉంటే వారిని కో ఆర్డినేట్ చేసి సమస్యలు పరిష్కరించే బాధ్యత కూడా భుజానికెత్తుకోవాలని సూచించినట్టు తెలిసింది. పనిచేయని ఇన్ఛార్జ్‌లు ఎంత చెప్పినా దారికి రాకుంటే… మార్చే విషయంలో తుది నిర్ణయం కూడా మీదేనని చెప్పేశారట. మొత్తంగా జిల్లాలో మీరే సుప్రీం అంటూ అధ్యక్షులకు క్లారిటీ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. అంటే… అధికారాన్ని వికేంద్రీకరించి… రేపటి రోజున గడ్డు పరిస్థితులు వస్తే…. ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళేలా జగన్‌ ప్లాన్‌ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే క్రమంలోనే… ఈ ముందు జాగ్రత్తలని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా… పాలిటిక్స్‌లో జగన్‌ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మరోవైపు ఇప్పటికిప్పుడు అరెస్టు అయినా కాకున్నా…. క్షేత్ర స్థాయిలో పార్టీ పునాదుల్ని పటిష్టం చేయడానికి ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా…. ప్రభుత్వం మీద గట్టిగా పోరాడటానికి జగన్‌ డిసైడై ఉండవచ్చని, అందుకే ముందు తనను తాను సిద్ధం చేసుకుని.. ఆ తర్వాత పార్టీని.. సిద్ధం చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు కొందరు. వైసీపీ అధ్యక్షుడి నయా పాలిటిక్స్‌ పార్టీకి ఎంత మేర ఉపయోగపడతాయి? నిజంగా ఆయన ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version