Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Yennam Srinivas Reddy

Off The Record : పాలమూరులో హస్తంలో చీలికలు

Published Date :December 31, 2025 , 7:51 pm
By Gogikar Sai Krishna
  • పాలమూరు హస్తంలో చీలికలు
  • ఎమ్మెల్యే యెన్నం వర్సెస్‌ డీసీసీ సంజీవ్‌
  • నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్న రెండు వర్గాలు
  • షాడో ఎమ్మెల్యేలుగా యెన్నం అనుచరులు
Off The Record : పాలమూరులో హస్తంలో చీలికలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కుక్క తోకను ఆడించాలిగానీ… తోక కుక్కని ఆడించకూడదన్న సామెతను అక్కడ పదే పదే గుర్తు చేసుకుంటున్నారా? నలుగురు షాడో ఎమ్మెల్యేలు తయారై నియోజకవర్గాన్ని నలిపేస్తున్నారా? ఎమ్మెల్యే పేరు చెప్పి పీఏలు పనులు చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారా? ఆ కాంగ్రెస్ శాసనసభ్యుడు వాళ్ళని ఎందుకు కంట్రోల్‌ చేయలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతోందా తంతు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున గెలిచారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలకు ముందు అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న యెన్నం…బీఆర్ఎస్‌ మీదున్న వ్యతిరేకత, ఇతర టికెట్ ఆశావహులంతా కలిసి పని చేయడం లాంటి కారణాలతో ఈజీగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అంత వరకు బాగానే ఉన్నా….. కొన్నాళ్ళ పాటు ఆల్ఈజ్‌వెల్‌ అనుకున్నా… ఇటీవల పాలమూరు హస్తం చీలపోయిందన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఇందులో కొత్త కాంగ్రెస్‌గా పిలిచే ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిది ఒక గ్రూప్ కాగా …. పాత కాంగ్రెస్‌గా చెప్పుకునే డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ది మరో వర్గం.

ఈ వర్గాలతో నియోజకవర్గంలోని సీనియర్ లీడర్స్‌ సైతం రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ టీంకు ఢిల్లీ స్థాయి పెద్ద ఒకరు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… గ్రూపులున్నా, మొదట్లో ఎవరి పని వారు చేసుకునేవారు. కానీ… ఇటీవలి కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దాకా వెళ్తోందట వ్యవహారం. మాది పాత కాంగ్రెస్‌. అంతా మేమేనని ఓ వర్గం అంటుంటే… పాతేంది కొత్తేంది భయ్‌…. అంతా కాంగ్రెసోళ్ళమేనని మరో టీమ్‌ గట్టిగా మాట్లాడుతుంటడం కాక రేపుతోంది. మరోవైపు మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల పెత్తనాలు పెరిగిపోతున్నాయట. ఎమ్మెల్యే కోటరీలోని నలుగురైదుగురు అసలు మేమే ఎమ్మెల్యేలమని ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మేమే.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

మేం ఆర్డరేస్తే ఎమ్మెల్యే వేసినట్టేనంటూ… గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్స్‌లో సైతం హవా నడిపిస్తున్నారట. ఇక ప్రైవేట్‌ సెటిల్ మెంట్స్‌, భూముల పంచాయతీల్లో మునిగి తేలుతున్నట్టు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. జిల్లా కేంద్రం అయిన మహబూబ్‌నగర్‌లో ఎస్ ఐ , మొదలు పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందర్నీ తమ గుప్పిట్లో పెట్టుకుని షాడో ఎమ్మెల్యేలు ఇసుక , మట్టి , ఫిల్టర్ ఇసుక దందాలు చక్కబెడుతున్నారన్న ప్రచారం ఉంది. ఇక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పలువురు బాధితులకు సైతం వన్ టౌన్ సమీపంలోని షాడో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని చెప్పేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా మద్యం షాపుల యజమానులను భయపెట్టి తమ వాళ్ళకు సిట్టింగ్ దుకాణాలు ఇప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇక పట్టణంలోని లిటిగేషన్ ల్యాండ్స్ కన్నేసి పలువురిని భయపెడున్నారట. మరోవైపు మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్దుల ఎంపిక నాదేనని చెప్పుకుంటున్నారట ఎమ్మెల్యే. దాంతో పలువురు ఆశావహులు ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ పనులు ఇప్పించడం, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల్లో పైరవీలన్నీ షాడో ఎమ్మెల్యేల కనుసన్ననల్లో జరుగుతున్నాయన్నది లోకల్‌ టాక్‌. వాళ్ళది ఒక లెక్క అయితే… ఎమ్మెల్యే పీఏలది మరో లెక్క.

ప్రస్తుతం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి నలుగురు వ్యక్తిగత సహయకులు ఉన్నారు. వీరంతా వివిధ డిపార్ట్‌మెంట్స్‌ని పంచుకుని లైజనింగ్‌ వ్యవహారాలు చూస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్టుగా వీరి వ్యవహారశైలి ఉంటోందని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. ఎవరికైనా సాయం చేయమని ఎమ్మెల్యే చెప్పినా సరే… ముందు వీళ్ళు సంతృప్తి చెందాలట. ఇక పోలీస్ పైరవీలు మొదలు అన్ని శాఖల్లో సార్ చెప్పారంటూ సొంత పనులు చక్కబెట్టుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నటైంలో ఆయా డివిజన్ల ఆశావహులకు మున్సిపల్ పనులు ఇప్పించడం, కమీషన్ నొక్కేయడంలో ఒక పీఏ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆ ఆఫీస్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే హాజరయ్యే వివిధ ప్రయివేటు కార్యక్రమాలకు నిర్వాహకుల నుంచి పీఏలు గట్టిగానే పిండుకుంటున్నట్టు టాక్‌. మొత్తం మీద మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మెతక వైఖరికి తోడు తన గెలుపు కోసం క్రుషి చేసిన వారు పవర్ ఎంజాయ్ చేస్తే తప్పేముందిలే అనే భావనలో ఉండటం ఇతరులకు బాగా కలిసి వస్తోందంటున్నారు. షాడోల ఆగడాలు, పిఏల పిండేసుకోవడాలు కలగలిసి ఎమ్మెల్యేని గట్టిగా డ్యామేజ్‌ చేస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. అన్నీతెలిసి కూడా ఎమ్మెల్యే ఇలా వదిలేస్తున్నారంటే ఆయన మరోసారి గెలవాలని అనుకోవడం లేదా అన్న మాటలు వినిపిస్తున్నాయి లోకల్‌గా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • OTR
  • yennam srinivas reddy

తాజావార్తలు

  • Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..

  • Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions