Off The Record: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు సక్రమంగా జరగలేదా? ట్రాన్స్‌ఫర్స్‌లో గులాబీ ముద్ర కనిపించిందన్నది నిజమేనా? ఎందుకు అలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? అసలు ఐపీఎస్ ట్రాన్స్‌ఫర్స్‌లో ఏం జరిగింది.. తెలంగాణలో ఇప్పుడు పోలీస్ ఉన్నతాధికారుల బదిలీలు చర్చనీయాంశం అవుతున్నాయి. అధికారుల బదిలీలన్నవి సాధారణ పరిపాలనా వ్యవహారాల్లో భాగమే అయినా…. ఇప్పుడు మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయట. అందులోనూ ప్రత్యేకించి ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్ ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలామంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఎస్పీలు, సిటీ పోలీస్ కమిషనర్స్‌గా అప్పటి వరకు ఉన్న వాళ్ళ స్థానాల్లో కొత్తవాళ్ళు వెళ్ళారు. ఇక ఎన్నికలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినా పెద్దగా మార్పులు జరగలేదు. ఈసీ ట్రాన్స్‌ఫర్ చేసిన వాళ్ళలో చాలామంది అదే పోస్టులో కొనసాగుతున్నారు.
Read Also: YS Jagan: చెన్నైలో దక్షిణ భారత అఖిలపక్ష సమావేశం.. వైఎస్ జగన్కు ఆహ్వానం..
అయితే, కాంగ్రెస్ సర్కార్ కొద్ది మందిని కదిలించినప్పటికీ.. మెజార్టీ ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ సీట్లలో అలాగే ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో.. ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయంటూ కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది పోలీస్ వర్గాల్లో అనుకున్నట్టుగానే.. తాజాగా బదిలీలు జరిగాయి. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్‌కు ఆ ట్రాన్స్‌ఫర్స్ అన్నీ ఒక రిథమ్‌లో జరిగినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇవన్నీ ఊహించినట్టు జరగలేదన్నది ఎక్కువ మంది పోలీస్ అధికారుల అభిప్రాయం. పనితీరుకు పట్టం కట్టామని ఉన్నతాధికారులు చెప్తుంటే.. మాకు అవకాశాలు రాలేదని పోస్టింగ్స్‌రానివాళ్ళు అంటున్నారట. వీటన్నిటికీ మించి మరో అబ్జర్వేషన్‌ను చెబుతున్నారు కొందరు. గత ప్రభుత్వంలో… అంటే… బీఆర్‌ఎస్ హయాంలో కీలక స్థానాల్లో పనిచేసిన వాళ్ళకు తిరిగి అవే కీలకమైన స్థానాలు ఇచ్చారని, దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్నది వాళ్ళ క్వశ్చన్. అంటే, వాళ్ళ పాత పరిచయాలు, పాత వాసనలు గట్టిగానే పని చేశాయా? అందులో కాంగ్రెస్ ప్రభుత్వ ముద్ర ఏమీ లేదా? అన్నది ఓ వర్గం ఐపీఎస్‌ల ప్రశ్నగా తెలుస్తోంది.
Read Also: Off The Record: పి.గన్నవరంలో జనసేన, టీడీపీ ఆధిపత్య పోరు?
కాగా, అప్పుడు వాళ్లే చక్రం తిప్పి, ఇప్పుడూ వాళ్ళదే హవా నడిచేలా ఉంటే.. ఇక నిజాయితీ అన్న మాటకు అర్ధం ఏంటని గుసగుసలాడుకుంటున్నారట అధికారులు. రామగుండం సీపీ శ్రీనివాస్ తిరిగి తన పూర్వాశ్రమం అయిన సిఐడికి వెళ్ళిపోయారు. అలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయట. అయితే… ఇదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. మరోసారి పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో ఈసారి జరిగే ట్రాన్స్‌ఫర్స్‌లోనైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఎక్కువ మంది అధికారులు. ఇటీవల రెండేళ్ల కాలంలో చాలామందికి ఐపీఎస్ పదోన్నతులు వచ్చాయి. వాళ్లలో చాలామంది జిల్లా ఎస్పీలుగా ఆశించారు. కానీ ఎవరికీ అవకాశం దక్కలేదు. దీంతో మా పనితీరుపై అంత అనుమానం ఉందా? ఉంటే ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మా పనితనమేంటో చూపిస్తామంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారట కొందరు ఆఫీసర్స్. మొత్తం మీద తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్స్ చుట్టూ రకరకాల వివాదాలు రేగుతున్నాయి.