Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ అధికారులు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్నే గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? కొత్త అల్లుళ్ళకంటే ఎక్కువగా ఎక్స్ట్రా వేషాలేస్తున్నారా? వాళ్ళు వస్తున్నారంటే… తెలంగాణ ఆఫీసర్స్ హడలిపోవాల్సి వస్తోందా? వాళ్ళు అడిగింది సమకూర్చకుంటే… ఇక్కడ చుక్కలేనా? ఎవరా ఆఫీసర్స్? ఏంటి వాళ్ల కోరికల చిట్టా? కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటలు అంటేనే… తెలంగాణ ఆఫీసర్స్ హడలెత్తిపోతున్నారట. అలాగని… ఇక్కడేదో తప్పులు జరిగిపోతున్నాయి, వాళ్ళేదో చండశాసనుల్లా వ్యవహరిస్తున్నారని కాదు. విజిట్స్ కోసం వచ్చే వాళ్ళ గొంతెమ్మ కోరికలు చూసి…. రాష్ట్ర అధికారులు అవాక్కవుతున్నారు. కేంద్ర నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. భాగస్వామ్యంలో జరిగే కార్యక్రమాల తనిఖీ, పరిశీలన కోసమో, లేదా వాటికి సంబంధించిన వివిధ మీటింగ్స్‌లో పాల్గొనేందుకో… ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులు వచ్చి వెళ్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా….. అసలు సమస్య వాళ్ళకు సదుపాయాలు కల్పించే విషయంలోనే వస్తోందట.రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర అధికారుల అవసరాలు తీర్చలేక వివిధ శాఖలకు చెందిన అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా కేంద్ర నిధుల మీద ఎక్కువగా ఆధారపడే… రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అధికారుల పరిస్థితి అయితే… కక్కలేక, మిగలేక అన్నట్టుగా ఉంటోందట. వాళ్ళను సరిగా చూసుకోకుంటే… ఎక్కడ కేంద్ర నిధులకు కొర్రీలు పెడతారోనన్న భయం ఒకవైపు, అలాగని స్థాయికి మించి వాళ్ళు కోరుతున్న కోరికలు తీర్చలేక మరోవైపు సతమతం అవుతున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి డిపార్ట్మెంట్ జాతీయ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, రాష్ట్ర పర్యటనకు వస్తే…. వారిని స్టేట్ గెస్ట్‌గా గుర్తించి ప్రోటోకాల్ ఇస్తారు. బస కోసం రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహాన్ని కేటాయించి, గార్డ్ ఆఫ్ హానర్, పోలీస్ ఎస్కార్ట్, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు. ఇక జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, ఆ కింద స్థాయి అధికారులు రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయా శాఖల నుంచి అధికారులు రిసీవ్ చేసుకుంటారు. డిపార్ట్మెంట్ బడ్జెట్ ప్రకారం… వచ్చిన కేంద్ర ఉన్నతాధికారికి హోటల్స్ లో రూమ్స్ బుక్ చేస్తారు, వెహికిల్ అరెంజ్ చేస్తారు, ఇతరత్రా ఏవైనా అవసరాలు సమకూర్చుతారు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్యంతా మొదలవుతోంది. పర్యటనకు వచ్చే కేంద్ర అధికారులు తమ స్థాయికి మించిన కోరికల లిస్ట్ చెప్పి అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారట. తమకు ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయాలని, సూట్ రూమ్ కావాలని, పర్యటనలో హైఎండ్ వెహికిల్ ఉండాలని, పేరొందిన హోటల్స్ నుంచి భోజనం తెప్పించాలని, ఫైనల్‌గా ఖరీదైన బహుమతులు ఇవ్వాలని…. పాత రోజుల్లో అలిగిన కొత్త అల్లుళ్ళు చెప్పినట్టు చాంతాడం లిస్ట్ చెబుతున్నారట. అది విని నోరెళ్ళబెట్టడం రాష్ట్ర అధికారుల వంతు అవుతోంది. ఇటీవల హైదరాబాద్ బేగంపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఆ ప్రోగ్రామ్‌కు జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా అటెండ్ అయ్యారు. ముగింపు సందర్భంగా… వచ్చిన అతిధులను రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారి సత్కరించారు. అప్పుడు మర్యాద కోసం కేంద్రం నుంచి వచ్చిన అధికారి ముందు నాలుగు చీరలు పెట్టి మీకు నచ్చిన ఒకటి తీసుకోమని చెప్పగా…. అన్నీ బాగున్నాయి, మొత్తం ప్యాక్ చేసి నా కారులో పెట్టండని చెప్పడంతో రాష్ట్ర అధికారులకు నోట మాట రాలేదట. మరో శాఖలో కేంద్ర ఉన్నతాధికారి రాష్ట్రానికి వచ్చిన తర్వాత తనకు ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసి, నగరంలో టూరిస్ట్ స్పార్ట్స్ చూడడానికి లగ్జరీ వెహికిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ శాఖలోని ఓ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ఓ ఉన్నతాధికారి హాజరయ్యారు. సాధారణంగా ఆయనకు వీఐపీ వెహికిల్ అరేంజ్ చేశారు. అయితే సదరు ఢిల్లీ అధికారి ఆ వీఐపీ వెహికిల్ లో ఫుట్ మ్యాట్స్ లేవు, నాకు ఇంకా పెద్ద కారు కావాలని కోరడంతో … అప్పటికప్పుడు ఓ ప్రైవేటు ట్రావెల్స్ కు ఫోన్ చేసి హైఎండ్ వెహికిల్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరో జాతీయ అధికారి తనకు కాస్ట్లీ గిఫ్ట్ కావాలని అడిగి మరీ.. తెప్పించుకుని వెంట తీసుకు వెళ్లినట్లు డిపార్ట్మెంట్లో చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక శాఖలకు బడ్జెట్ ఇబ్బందులు ఉండవు.. కానీ అంతగా ప్రాధాన్యం లేని శాఖల్లో మాత్రం బడ్జెట్ లెక్కలు తప్పవు. అలాంటి కార్యక్రమాలకు వచ్చే ఢిల్లీ ఉన్నతాధికారుల కోరికలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పడలేకపోతున్నారట. ఫైనల్‌గా నొప్పించక తానొవ్వక… అన్నట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!