Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఎప్పటికప్పుడు ఎదురుచూపులే
- ఎప్పటికప్పుడు ఊపు రావడం, ఉసూరుమనడం
- సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా విస్తరణ కబుర్లే
- ప్రస్తుతం కేరళం వ్యవహారాల్లో అధిష్టానం తల మునకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా…..? ఉండదా..? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనడమేగానీ…. ఆ విషయంలో మాత్రం ఎందుకు క్లారిటీ రావడం లేదు? ప్రతిసారీ ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే…. అయ్యయ్యో అని ఉసూరుమనడం ఎందుకు సర్వసాధారణమైపోయింది? అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్లు? తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ముహూర్తాలయితే అప్డేట్ అవుతున్నాయి గానీ… పని మాత్రం జరగడం లేదు. ఆశావహులంతా చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. చూస్తుండగానే… రెండున్నర ఏళ్ళు గడిచిపోయింది. మిగిలింది ఇంకో రెండున్నరేళ్ళు. ఆ కొద్ది టైం అయినా…. మినిస్టర్ హోదాలో రయ్ రయ్‌న దూసుకుపోతామా లేదా అన్న ఆందోళన ఆశావహుల్లో పెరుగుతోందట. మంత్రివర్గ విస్తరణపై ప్రతిసారి కొన్ని తేదీలు ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత అలాంటిదేం లేక ఉసూరుమనడం సర్వ సాధారణమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారంటే చాలు…. క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలే. ఆఖరికి రాష్ట్ర గవర్నర్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయినా… ఎవరి స్టోరీలు వాళ్ళు అల్లేసుకోవడమే, ముహూర్తాలు పెట్టేసుకోవడాలే. ఆ రకంగా ముఖ్యమంత్రి అడుగు తీసి అడుగేస్తే… కేబినెట్ కబుర్లు చెప్పుకునే లెవెల్‌కి వెళ్ళిపోయింది పరిస్థితి. కానీ… ఎవరేం చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా… మంత్రివర్గంలో మార్పులు చేర్పుల ముచ్చట మాత్రం ఉండటం లేదు. ఇక చివరిసారిగా…. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందని లెక్కలు వేసుకున్నారు కొందరు.
కానీ… కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కేరళంలో ప్రభుత్వ ఏర్పాటు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అక్కడి కాంగ్రెస్ నేతల పంచాయతీతోనే పార్టీ అధిష్టానానికి తల బొప్పికడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. అంతకు ముందు మే మొదటి వారంలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ జరిగింది. ఇప్పుడు రెండో వారంలోకి ఎంటరైనా…. ఎక్కడా అలాంటి వాసన కూడా లేదు. దీంతో… కనీసం ఈ నెలాఖరుకైనా క్యాబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనే చర్చ ఆశావహుల్లో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో… రెండున్నరేళ్ళుగా కేబినెట్ లోకి వెళదామని చూస్తున్న నేతలకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
Also Read
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- Off The Record : నిశ్శబ్ద విప్లవమా.. వ్యూహాత్మక విస్తరణా? తెలంగాణలో బీజేపీ దూకుడు
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా…. కేబినెట్ విస్తరణ ఉంటుందనిగానీ, ఉండదని గానీ… చెప్పడం లేదు. అసలా విషయంలో ఆ స్పందించడం లేదు. మీడియా చిట్‌చాట్‌లో దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా… నేరుగా సమాధానం చెప్పడం లేదాయన. కేబినెట్ విస్తరణ గురించి నేను ఎవరితో మాట్లాడలేదు, నాకు తెలియదని మాత్రమే చెప్పుకొస్తున్నారాయన. ప్రస్తుతం అధిష్టానం కేరళం పంచాయతీలో మునిగి తేలుతున్నందున అది కొలిక్కి వచ్చిన తర్వాతే తెలంగాణ కేబినెట్ విస్తరణ పై దృష్టి పెడతారా..? లేక తర్వాత చూసుకుందామని పోస్ట్‌పోన్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు. ఈనెలలోనే విస్తరణ ఉంటుందా..? లేదంటే జూన్ 2 తర్వాతేనా అన్నది లేటెస్ట్ డిస్కషన్. కేబినెట్ బెర్త్ కోసం ఆశగా చూస్తున్న నేతలు మాత్రం ఇంకా ఎంతకాలం అంటూ ఉసురుమనే ఫీలింగ్‌లోకి వెళ్తున్నారు. వారి నిరీక్షణలు ఫలిస్తాయో లేదా… ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలన్నది పొలిటికల్ వాయిస్.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!