Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Telangana Cabinet 3

Off The Record : తెలంగాణ కేబినెట్ కట్టు తప్పుతోందా? సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?

Published Date :October 7, 2025 , 9:04 pm
By Gogikar Sai Krishna
  • కొందరు మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు
  • ప్రతిపక్షాలు తగులుతున్నా తీరు మారని మంత్రులు
  • తాజాగా పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ ఎపిసోడ్‌ కలకలం
  • ప్రెస్‌మీట్‌లో కొన్ని వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్‌
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ని ఉద్దేశించేనంటూ వైరల్‌
  • చిట్‌చాట్‌లో పొన్నం వ్యాఖ్యల్ని తప్పుపట్టిన శ్రీధర్‌బాబు
Off The Record : తెలంగాణ కేబినెట్ కట్టు తప్పుతోందా? సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ కేబినెట్‌ కట్టు తప్పుతోందా? మంత్రుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా? ఏమవుతుందిలే అనుకుంటూ.. నోటికి పనిచెప్పే బ్యాచ్‌ పెరుగుతోందా? అసలు అజెండా కంటే… సొంత అజెండానే కొందరికి ఎక్కువైపోయిందా? కొంచెం తగ్గించుకుంటే మేలేమో….. అని సొంత పార్టీ నేతలే ఎందుకు అనాల్సి వస్తోంది? మంత్రులు ఔటాఫ్‌ కంట్రోల్‌ అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? తెలంగాణ కేబినెట్‌ మంత్రుల్లో కొందరు అసలు పని గాలికొదిలేసి…. అనవసర విషయాల్లో అతిగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. మేం ఏం మాట్లాడినా నడిచిపోతుంది, ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న ధోరణి బాగా పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. నోరు అదుపులో పెట్టుకోలేక కంట్రోల్‌ తప్పడం వల్లే సమస్యలు పెరుగుతున్నట్టు కేబినెట్‌ సహచరులే మాట్లాడుకుంటున్నారట. ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే… అది రిపీట్ అవకుండా చూసుకోవడమన్నది కామన్‌. కానీ.. ఇక్కడ మాత్రం ముందు కొందరు మంత్రులు సమస్యలు ఎదుర్కొంటున్నా… మిగతా వాళ్ళు వాటిని చూసి కూడా అలర్ట్‌ అవడం లేదట. అసలే చీమ చిటుక్కుమన్నా….ప్రతిపక్షాలు తగులుకుంటున్నాయి. అయినా.. మంత్రుల తీరు మాత్రం మారడంలేదని కాంగ్రెస్‌ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

 

ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. తాజాగా పొన్నం, అడ్లూరి ఎపిసోడ్. కొండా సురేఖ నుండి మొదలైన ఈ వివాదం తాజాగా పొన్నం వరకు వచ్చింది. కొండా అప్పట్లో చేసిన కామెంట్స్ పరువు నష్టం కేసు వరకు వెళ్ళాయి. ప్రత్యర్థి మీద చేసిన ఆరోపణలతో కేసులు ఎదుర్కోవచ్చు కానీ… సొంత పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం నాలుక కరుచుకోవడంతోపాటు పీకలు తెంచుకునే వరకు వస్తోందంటున్నారు. తాజాగా ప్రెస్‌మీట్‌ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ సమావేశానికంటే ముందు… కొన్ని కామెంట్స్ చేశారు. అవి సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని ఉద్దేశించేనంటూ క్షణాల్లో ఆ మాటలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత పొన్నం కార్యాలయం నుంచి నేను అట్లూరి లక్ష్మణ్‌ని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదంటూ ప్రకటన వచ్చింది. ఇక ఆ ఎపిసోడ్‌ ముగిసిందని అనుకుంటున్న టైంలో… సోమవారం మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్‌లో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

సహచర మంత్రులపై అలాంటి మాటలు సరికాదంటూ శ్రీధర్ బాబు కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే… ఇవాళ ఉదయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో విడుదల చేశారు. దళిత నేతలంటే గౌరవం లేదంటూ రియాక్ట్ అయ్యారు. క్షమాపణ చెప్తారనుకున్నాగానీ… ఇప్పటివరకు స్పందించలేదంటూ వీడియోలో పేర్కొన్నారు అడ్లూరి. ఆ ప్రెస్‌మీట్‌లో పొన్నం పక్కనే మంత్రి వివేక్ ఉన్నా… తన సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా… కనీసం స్పందించక పోవడం ఏంటంటూ వివేక్‌ని కూడా తప్పుపట్టారు. దాంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేసే పనిలో ఉన్నారట ఆయన. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు… బీసీ రిజర్వేషన్ లాంటి సమస్యలన్నీ ఉండగా… మంత్రులు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోతే పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కేడర్‌లో. మాట్లాడేటప్పుడు వెనకా ముందూ చూసుకోకపోతే ఇలాంటి తలనొప్పులు తప్పవంటున్నారు పరిశీలకులు. కానీ…. కొద్ది మంది మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవడం లేదని.. దాంతో వాళ్ళతో పాటు పార్టీ కూడా చిక్కుల్లో పడాల్సి వస్తోందని అంటున్నారు కొందరు సీనియర్ నేతలు. ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలు… ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు ఇలాంటి రచ్చ విషయంలో మాత్రం దూకుడుగా ఉంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌ని నిశితంగా పరిశీలిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఇలా వివాదాల్లోకి వెళ్లడం పట్ల ఆయన కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అనే పేరుతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరించి తలనొప్పులు తెచ్చుకుంటున్నారన్న అభిప్రాయం మాత్రం బలపడుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • ntv
  • OTR

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions