Off The Recordd : తెలంగాణ బీజేపీ నేతలపై మాజీ గవర్నర్ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చారా?
- తెలంగాణ బీజేపీలో ఇప్పటికీ తేలని పాత-కొత్త పంచాయితీ
- రెండు వర్గాల మధ్య కంటికి కనిపించని అడ్డుగోడలు
- రాష్ట్ర పార్టీలో సీక్రెట్ రిపోర్ట్ గురించిన చర్చలు
- ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ మీద ఫోకస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కమలం ఎదుగుదలకు సంబంధించిన అత్యంత కీలకమైన సీక్రెట్ రిపోర్ట్ ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలో సమన్వయ లేమి, నాయకుల మధ్య గ్యాప్‌లాంటి అనేక ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చాపకింద నీరులా హైకమాండ్ తెప్పించుకుందా? అసలు రాష్ట్ర నాయకులు ఎవ్వరూ ఊహించలేని వ్యక్తి ఒకరు సమగ్ర సమాచారాన్ని పైకి పంపారా? దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ అదే నిజమా? డిటైల్డ్ రిపోర్ట్ ఎవరు పంపారని స్టేట్ పార్టీలో చర్చ జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ. కొన్ని పైకి కనిపిస్తే…. ఎక్కువ వివాదాలు లోలోపలే పెరిగిపోయి అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తున్నాయి. పార్టీలో పాత-కొత్తల పంచాయితీ ఇప్పటికీ తేలలేదు, ఎప్పటికి తేలుతుందో ఎవరికీ తెలియదు. ఎన్నికల్లో అందరం పార్టీ కోసం పని చేశాం, జెండా మోశాం, ఇక పాతేంది? కొత్తేంది? అన్న వాదన ఒకవైపు నడుస్తుండగానే… మరోవైపు రెండు వర్గాల మధ్య కంటికి కనిపించని అడ్డుగోడ ఇప్పటికీ బలంగానే ఉందని చెప్పుకుంటున్నాయి కాషాయ వర్గాలు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్ళూరుతోంది కేంద్ర నాయకత్వం. ఆ దిశగా ఇక మీదట దృష్టి పెట్టవచ్చంటున్న రాష్ట్ర పార్టీ వర్గాలు… అదే క్రమంలో ఓ సీక్రెట్ రిపోర్ట్ గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నాయి. మొత్తం… పిన్ టు పిన్….. అస్సలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందో డిటైల్డ్ రిపోర్ట్‌ను ఓ పెద్దాయన ఢిల్లీకి పంపారన్నది ఆ చర్చల సారాంశం.
ప్రస్తుతం పార్టీ లీడర్‌షిప్ మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి పెట్టినందున అవి అయిపోగానే… తెలంగాణ, కర్ణాటక మీద ఫోకస్ పెడతారని సమాచారం ఉంది. దీంతో ఆ సీక్రెట్ రిపోర్ట్ గురించి కొందరు నాయకులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆశించినట్టుగా లేదన్న అభిప్రాయంతో ఉన్నారు ఢిల్లీ పెద్దలు. దీని గురించి ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. ప్రధాని మోడీ స్వయంగా క్లాస్ తీసుకున్నా… ఇక్కడి నేతలు మారలేదని, వ్యవహారం మొత్తం కుక్క తోక వంకరే అన్నట్టుగా ఉందంటూ పార్టీ అభిమానులు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. చాలామంది నేతలు పార్టీ బాగు కోసం పని చేస్తున్నారా? లేక తమ వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆరాటపడుతున్నారా అనే చర్చ కూడా ఉంది. అధికారంలోకి రావడం కోసం ఉమ్మడిగా పనిచేయాల్సింది పోయి పెద్దలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి కాషాయ వర్గాల నుంచి. ఈ పరిణామాలన్నిటినీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్న హస్తిన నాయకులు… తెలంగాణలో అసలేం జరుగుతోందంటూ అప్పుడప్పుడూ ఆరా తీస్తూనే ఉన్నారట. ఈ క్రమంలో రాష్ట్ర మాజీ గవర్నర్ ఇచ్చారని చెబుతున్న రిపోర్ట్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ అంతకు ముందు తెలంగాణ గవర్నర్‌గా పని చేశారు. ఆయన మహారాష్ట్రకు వెళ్ళడానికి ముందు తెలంగాణలో అసలు పార్టీ ఎలా ఉంది? నాయకుల తీరు, తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక పూర్తిస్థాయి రహస్య నివేదికను ఢిల్లీ పంపినట్టు తాజాగా పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
Also Read
తెలంగాణ నుంచి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందే వర్మ ఆ రిపోర్ట్ ఇచ్చారంటూ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదిక సంగతి కొందరు ముఖ్య నేతల దృష్టికి వచ్చిందని, ఒకరిద్దరైతే దాని గురించి డిస్కస్ చేసినట్టు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కమలం లీడర్స్. దీంతో ఆ రిపోర్ట్‌లో ఏముందంటూ ఆసక్తిగా ఢిల్లీలో తమకు తెలిసిన నాయకుల్ని ఆరా తీస్తున్నారట స్టేట్ లీడర్స్. తెలంగాణలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయం లేక పోవడం, క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు, ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు లాంటి చాలా అంశాలు ఆ రిపోర్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని ఫైనల్ కన్‌క్లూజన్ ఇచ్చారట. అయితే ఆ నివేదికకు సంబంధించిన ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. గవర్నర్ ఆఫీస్ నుంచి అఫీషియల్‌గా ఎలాంటి రిపోర్ట్ పంపలేదని చెబుతున్నాయి రాజ్‌భవన్ వర్గాలు. అధికారిక ధృవీకరణ సంగతి ఎలా ఉన్నా….జిష్ణుదేవ్‌వర్మ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు మాత్రం పూర్తి నివేదిక కేంద్ర పార్టీకి చేరిందని బలంగా నమ్ముతున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.
- Tags
- NTV Telugu
- OTR
- Telangana BJP
తాజావార్తలు
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!