OTR: కడపలో టీడీపీ, వైసీపీ మిలాఖత్ అయిపోయాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాలదేముంది బ్రో….! మనం మనం లోకల్. నిద్రలేస్తే ముఖముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళం. పరస్పరం అవసరాలుండే వాళ్ళం. అందుకే కలిసి పంచుకుందామని అక్కడి నేతలు అనుకుంటున్నారా? అందులోనూ… రాయలసీమలో, అదీ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయిపోయారా? ముందంతా…రచ్చ చేసుకుని, నామినేషన్ పత్రాలను కూడా చించేసుకుని సడన్‌గా వాతావరణం మారిపోయింది ఎక్కడ? ఎందుకలా? ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పర్వంలో కొన్ని చోట్ల యుద్ధకాండ నడుస్తోంది. అందునా కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఈ తరహా వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే…నంద్యాల జిల్లాలో మాత్రం వ్యవహారం కాస్త డిఫరెంట్‌గా ఉందట. మామూలుగానే ఇక్కడి పాలిటిక్స్ డిఫరెంట్. ఎప్పుడు హీటెక్కుతాయో..ఎప్పుడు చప్పున చల్లారిపోతాయో చెప్పడం కష్టం. ఉన్నట్టుండి మీసం మెలేస్తారు…తొడలు కొడతారు….సవాల్ విసురుతారు. అంతలోనే పాల పొంగులా చప్పున చల్లారిపోతారు. అందుకే చాలామంది సీమ నేతలే మీ నంద్యాల పాలిటిక్స్ వేరప్పా అని సరదాగా అంటుంటారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఇది మరోసారి ఇది ఋజువైందట. నామినేషన్ల గడువు ముగిసే వరకు నంద్యాల జిల్లాలో పలుచోట్ల కూటమి, వైసీపీ వర్గాల గొడవలు, ఆందోళనలతో రాజకీయం హీటెక్కింది. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం కనిపించింది. నంద్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. అందులో రెండు మున్సిపాలిటీల ఎన్నికలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఆ రెండు చోట్ల రొటీన్‌కు భిన్నంగా, ఎవ్వరూ ఊహించని విధంగా… కూటమి, వైసీపీ నేతలు ఒక్కటై మున్సిపల్ చైర్మన్ సహా అన్ని వార్డుల్లో కౌన్సిలర్ పదవులను పంచేసుకున్నారట. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ మధ్యేమార్గంలో పదవుల పంపకాలతో ఏకగ్రీవాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఆత్మకూరు మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా చైర్మన్ టీడీపీకి, వైస్ చైర్మన్ వైసీపీకి ఇచ్చేలా మాట్లాడుకున్నారట. మొత్తం 32 వార్డులకుగాను 18 టీడీపీ, 12 వైసీపీకి పంచుకున్నాయట.
జనసేన, బీజేపీకి చెరొకటి చొప్పున దక్కినట్టు తెలిసింది. వైస్ చైర్మన్‌గా ఒక వార్డులో ప్రస్తుత వైసీపీ చైర్మన్ అభ్యర్థి ప్రియాంకబాయికి అవకాశం కల్పించేలా ఒప్పందం కుదిరిందట. ఈ విధంగా కూటమి, వైసీపీ ఒక్కటై ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి డాక్టర్ గోవిందరాజులును ఓకే చేశాయంటున్నారు. అలాగే 32 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ అయిందట. ఇక ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోనూ… కూటమి, వైసీపీ మధ్య రాజీ ఒప్పందం కుదిరిందంటున్నారు. దీంతో చైర్మన్ సహా వార్డులన్నిటిలో సింగిల్ నామినేషన్లే మిగిలాయి. ఇక్కడ చైర్మన్, 32 వార్డులకు ఒకే నామినేషన్ ఉన్నాయి. అందులో టీడీపీకి మున్సిపల్ చైర్మన్‌తోపాటు 22 వార్డులు, వైసీపీకి 8 వార్డులు, జనసేనకి 2 దక్కాయి. ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్ పర్సన్‌గా షేక్ అనీషా , వైస్ చైర్మన్ కూడా టీడీపీ నుంచి ఏకగ్రీవం అయ్యేలా ఒప్పందం కుదిరిందట.
Also Read
దీంతో… మున్సిపల్ ఎన్నికల తరహాలోనే… పరిషత్ ఎలక్షన్స్ కూడా ఏకగ్రీవం అయ్యేలా కొన్ని నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయట. నిన్నటిదాకా తిట్టుకుంటూ, సవాళ్లు విసురుకున్న వాళ్ళు ఒక్కసారిగా రాజీమార్గంలో పంపకాలు చేసుకోవడంతో… నంద్యాల జిల్లా రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందంటున్నారు. ఎన్నికలు జరిగితే కోట్లు ఖర్చవుతాయని, అల్లర్లతో పరస్పరం కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాలని, కక్షలు పెంచుకునే బదులు…ఇలా రాజీ మార్గాన్ని ఎంచుకున్నామని కొందరు నేతలు సమర్థించుకుంటుంటే మరికొందరు మాత్రం విభేదిస్తున్నారట. పోటీ చేయాల్సిందేనని ఒకవైపు పార్టీ అధ్యక్షుడు జగన్ అంటుంటే… మరోవైపు ఇక్కడ ఈ రాజీ ఫార్ములాలు ఏంటంటూ కొందరు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు పోలింగ్ జరిగితే డబ్బులు పంచేవారని, ఇపుడు వాళ్ళు వాళ్ళు మిలాఖత్ అయిపోయి…. మా నోళ్ళు కొట్టారంటూ లబోదిబోమనే బ్యాచ్ కూడా తయారైందట నంద్యాల జిల్లాలో. ఎవరి గోల వాళ్ళది.
- Tags
- Kadapa
- nandyala
- NTV Telugu
- OTR
- tdp
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!