OTR : పులివెందుల్లోనూ పాగా.. అయినా కూటమి నేతలకు దిగులెందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి కిక్కు రాలేదా? ప్రత్యేకించి టీడీపీ ఈ ఘన విజయాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతోందా? 90 పర్సంట్కు పైగా ఫలితాలతో సూపర్ డూపర్ విక్టరీ కొట్టినా… ఇంకా ఎక్కడో అసంతృప్తి వెంటాడుతోందా? ఇంతటి ఘన విజయంలో కూడా అంత అసంతృప్తి దేనికి? టీడీపీ పెద్దలు ఏం ఆశించారు? పోలింగ్ రోజున వాళ్ళు అనుకున్నది ఏం జరగలేదు? ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. 90 శాతానికి పైగా… స్ట్రైక్ రేట్‌తో దూసుకు వెళ్ళి, రాజకీయ ప్రత్యర్థి గుక్క తిప్పుకోవడానికి కూడా వీల్లేని విజయం సాధించింది. వైసీపీకి కంచుకోటలే కాదు… అంతకు మించి అన్నట్టుగా ఉండే కడప, పులివెందులలో పాగా వేసింది. మామూలుగా అయితే… ఇది కూటమి పెద్దలు ఎగిరి గంతేయాల్సిన విజయం ఇది. పండగ చేసుకోవాల్సిన సందర్భం. కానీ… లోపలి వాతావరణం అలా కనిపించడం లేదంటున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు. కూటమి ముఖ్యుల్ని లోలోపల ఇంకా ఏదో అసంతృప్తి వెంటాడుతోందట. ఎక్కడో మిస్ అయ్యామన్నట్టు కనిపిస్తోందంటున్నారు. ఇంకా చెప్పాలంటే… ఈ మున్సిపల్ ఫలితాలు కూటమి నేతల్ని కుదురుగా ఉండనీయడం లేదని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. అలా ఎందుకని అంటే… వాళ్ళ విశ్లేషణలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. పోలింగ్ శాతం బాగా తగ్గడమే కూటమి ముఖ్యుల ఆందోళనకు కారణం అంటున్నారు. మనం గెలిచాం, సీట్లు వచ్చాయి సరేగానీ… అసలు రావాల్సిన పాజిటివ్ ఓటింగ్ ఎక్కడ? గడిచిన రెండున్నరేళ్ళలో ప్రభుత్వం చేసిన మంచి పనులు చూసి ఓటేసేందుకు జనం ఊపుగా ముందుకు రావాల్సిన సందర్భం కదా…ఇది. అలా ముందుకు వస్తే పోల్ పర్సంటేజ్ పెరగాలి కదా… మరి ఎందుకు పెరగలేదంటూ కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారట. కీలక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం తగ్గడంపై కూటమిలో ఆందోళన కనిపిస్తోందంటున్నారు. ఎంత చెప్పినా పోలింగ్ పెరగకపోవడానికి కారణాలపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కార్పొరేషన్స్‌లో కనీసం 70 శాతం పోలింగ్ కూడా నమోదవకపోవడం చూసి అధికార ముఖ్యులు ఆలోచనలో పడ్డారట.
ఎలాంటి ఎన్నిక జరిగినా.. పోలింగ్ శాతం పెరగాలి…..మనం విజయం సాధించాలి. 2024 సాధారణ ఎన్నికల కన్నా పోలింగ్ ఎక్కువ నమోదవ్వాలి. సీఎం చంద్రబాబు ఇటీవల తరచూ చెబుతున్న మాట ఇది. కానీ… తీరా మున్సిపల్ ఎన్నికల్లో ఇది ఆచరణలో కనిపించలేదు. కనీసం 60 శాతం పోల్ పర్సంటేజ్ నమోదవని కార్పొరేషన్స్ కూడా ఉండటం కూటమి పెద్దల్ని కంగారు పెడుతున్నట్టు తెలుస్తోంది. పెరిగే పర్సంటేజ్ మొత్తం పాజిటివ్ ఓటింగ్‌గా మారుతుందని లెక్కలేసుకుంటున్న క్రమంలో……దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ఒక పక్క ఘన విజయాన్ని చూసి ఆనంద పడాలో….లేక లెస్ పోలింగ్‌తో దిగులు పడాలో అర్ధం కాని పరిస్థితి లో కూటమి నేతలు ఉన్నట్టు సమాచారం. పాజిటివ్ ఓటింగ్ జరగాలని ఎప్పుడూ చెప్పే సీఎం చంద్రబాబుతో పాటు ఇతర కూటమి నేతలు కడా తక్కువగా పోలింగ్ జరగడంపై ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. తమ రెండున్నరేళ్ల పాలనకు గీటురాయిలా ఎన్నికలు జరుగుతాయని అనుకుంటే…. కనీసం 60 శాతం కూడా జరగని పోలింగ్ కూటమి నేతలకు మింగుడు పడటం లేదని అంటున్నారు. టీడీపీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలపై దృష్టి పెట్టింది. క్లస్టర్ ఇంచార్జ్‌లు, స్థానిక నేతలు, క్యాడర్, ద్వితీయ శ్రేణి నేతలు… ఇలా అందర్నీ ఎన్నికల కోసం అలర్ట్ చేశారు. ప్రతి రోజు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో…భారీ పోలింగ్రై దృష్టి పెట్టేలా ఆదేశాలు ఇచ్చారు.
Also Read
కానీ గ్రౌండ్ లెవల్లో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. కొన్ని కార్పొరేషన్స్‌లో తక్కువ పోలింగ్ నమోదైంది. టీడీపీతో పాటు జనసేన బీజేపీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినా పర్సంటేజ్ పరమైన ఫలితాలు కనిపించలేదు. కమిటీలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం నిర్వహించినా… లెస్ పోలింగ్ నమోదైంది. దాంతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. ఇక నుంచి ఎక్కడా తగ్గకుండా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పెషల్ టాస్క్ అప్పగించినట్టు తెలిసింది. మున్సిపల్ వార్ వన్‌సైడ్ అయినా…. పోల్ పర్సంటేజ్ తగ్గడం మాత్రం అధికార పక్షానికి మింగుడు పడని అంశంగా మారిందని అంటున్నారు.ఎంత కసరత్తు చేసినా ఇంతే అన్నట్టు పరిస్థితి ఉండడంతో కూటమి నేతల్లో లెస్ పోలింగ్‌పై చర్చ విస్తృతంగానే జరుగుతోందట. ఎన్నికల్లో గెలుపు ఓటములు తర్వాతి సంగతి. ముందు ఓటర్లను బూత్ వరకు రప్పించడమే…పెద్ద సమస్యగా మారిందనే చర్చ కూటమి పార్టీల్లో జరుగుతోంది. 2024 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ బాగా తగ్గిందని, ప్రభుత్వంపై పాజిటివ్ మోడ్ తో ఓట్ వేయాలని ప్రజలు అనుకుంటే…ఇంత తక్కువ శాతం పోలింగ్ అయ్యేది కాదంటూ కూటమి నేతలు బాగా ఫీలవుతున్నట్టు తెలస్తోంది. దీంతో ఓవరాల్‌గా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిశాక దీనిపై ప్రత్యేకంగా సమీక్షించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో… పాజిటివ్ ఓట్ పెంచుకోవడానికి కూటమి పెద్దలు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- NTV Telugu
- off the record
- tdp
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..