Site icon NTV Telugu

Off The Record : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది?

Ponguleti

Ponguleti

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది? అదే అంశంపై పదేపదే ఎందుకు బలంగా వాదిస్తోంది? పొంగులేటిని గులాబీ పార్టీ టార్గెట్ చేసుకోవడానికి కారణమేంటి? ఏ ఆధారాలు….ఆయుధమని చెబుతోంది? తెలంగాణలో రాజకీయం అంతా రాఘవ కన్స్ట్రక్షన్స్ చుట్టే తిరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీగా చెబుతున్న BRS..దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. క్రషర్ కు పర్యావరణ అనుమతులు లేవని, జీఓ నెంబర్ 111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని చాలా కాలంగా గులాబీ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో ఈ అంశాన్ని సభలో లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీ. రెండు రోజులపాటు నిరసన తెలిపింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ క్రషర్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని గా పట్టుబట్టారు. ఇదే అంశంపై శాసనసభలో ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు సస్పెండ్ కూడా అయ్యారు.
విజువల్స్

అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై బీఆర్ఎస్ ఎందుకంతగా ఫోకస్ పెట్టింది అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పొంగులేటి ఇష్యూపై బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ క్రషర్‌కు అనుమతులు లేవని, పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. స్వయంగా ప్రభుత్వమే జరిమానా విధించిందని చెబుతోంది. ఈ జరిమానాల ఆధారాలనే ఆయుధంగా మలచుకున్నామంటోంది గులాబీ పార్టీ. సభలో పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించింది. దీనితో పాటు రెండున్నరేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన సుమారు 19 స్కాములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. స్వయంగా మంత్రికి చెందిన మైనింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణల ఇష్యూను అంత ఈజీగా వదలొద్దని డిసైడ్ అయ్యామంటోంది బీఆర్ఎస్.

Exit mobile version