Site icon NTV Telugu

Off The Record: ఎక్కడ తగ్గేదేలే అంటూ ఎర్రన్నల దూకుడు..?

Kothagudem

Kothagudem

Off The Record: అక్కడ మిత్రపక్షాలు రెండూ నువ్వా నేనా అంటున్నాయా? మేటర్‌… మంత్రి వర్సెస్‌ ఎమ్మెల్యే అన్నట్టుగా మారిపోతోందా? సరైన నాయకత్వం లేకుండానే మంత్రి పట్టు కోసం ప్రయత్నిస్తున్నారా? ఎక్కడా తగ్గేదే లే అంటూ ఎర్రన్నలు దూకుడుగా ఉన్నారా? ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కామ్రేడ్స్‌ ఢీ అంటే ఢీ అంటున్నారు? ఏ విషయంలో పోటీ పెరిగింది?

Read Also: Sundarakanda: ఆగస్టు 27న నారా రోహిత్ ‘సుందరకాండ’

భద్రాద్రి జిల్లాకు హెడ్‌ క్వార్టర్‌ కొత్తగూడెం. ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను… ఒక్క కొత్తగూడెం మాత్రమే జనరల్ సీటు. మిగతా నాలుగు ఎస్టీ రిజర్వ్‌డ్‌. ఇక నియోజకవర్గంలో మొన్నటి వరకు రెండు మున్సిపాలిటీలు ఉండగా… అందులో పాల్వంచకు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టుబట్టి రెండు మున్సిపాలిటీలకు మరి కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అలా.. ఇక్కడ పట్టు సాధించేందుకు కూనంనేని వ్యూహరచన చేస్తుండగా.. మంత్రి పొంగులేటి కూడా సేమ్‌ ప్లాన్‌లో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సీపీఐ కొత్తగూడెంలో గెలిచి కూనంనేని ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్‌తో పాటు స్థానికంగా కమ్యూనిస్ట్‌లకు ఉన్న బలం కలిసి ఆయన గెలుపు తేలికైందని చెప్పుకుంటారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గం మీద నియోజకవర్గం మీద పట్టు సాధించేందుకు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారట కూనంనేని. ఓవైపు బీఆర్‌ఎస్‌ నాయకులకు వల వేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత పోరును ఆసరా చేసుకుని ఓ వర్గాన్ని దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తున్నారట. అక్కడే మంత్రి పొంగులేటి వర్గానికి మండిపోతున్నట్టు తెలుస్తోంది.

Read Also: Off The Record: రామ్మోహన్ నాయుడు మాటలన్నీ పైపై డబులేనా..?

ఇప్పటికే గూడెం మున్సిపాలిటీలో బలం పెంచుకున్న సీపీఐ.. ఇప్పుడు గ్రామాల మీద దృష్టి పెడుతోందట. సర్పంచ్, ఎంపిటిసి పదవుల ఆశలు చూపి పలువురిని పార్టీలోకి లాక్కునే ప్రయత్నం జరుగుతోందట. అలా మొత్తంగా కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ను తన గ్రిప్‌లో ఉంచుకోవాలన్నది ఎమ్మెల్యే ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. అందుకే… తాజాగా కొత్తగూడెం, పాల్వంచ ఏరియాలో సీపీఐ వార్డు మహాసభల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇదంతా పార్టీ నిర్మాణంలో భాగమైనా.. అసలు లక్ష్యం మాత్రం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డుల్లో సీపీఐ సత్తా చాటాలని. అటు గూడెం కాంగ్రెస్‌లో వర్గపోరు తక్కువేం లేదు. కానీ… ఓవరాల్‌గా మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డే బాధ్యత తీసుకుంటున్నారు. ఇక్కడ ఆయన అనుచరగణం కూడా ఎక్కువే.

Read Also: Telangana: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అయినా సరే.. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే… ఇక్కడ తనకు పట్టు చిక్కడం లేదన్న అసంతృప్తి మంత్రిలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేటలో తన మనుషులే ఎమ్మెల్యేలుగా ఉన్నా… కీలకమైన కొత్తగూడెంలో మాత్రం పూర్తి స్థాయిలో మాట నెగ్గడం లేదన్న అసహనం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దానికితోడు పట్టు బిగించేందుకు ఎమ్మెల్యే కూనంనేని చేస్తున్న ప్రయత్నాలతో అలర్ట్‌ అయిన మంత్రి… తన వర్గానికి గ్రిప్‌ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటికే అక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా… ఆ బాధ్యతల్ని తన వియ్యంకుడు, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి అప్పగించారు. తాజాగా…. స్థానిక ఎన్నికల టార్గెట్‌తో ఒక అంతర్గత సమావేశం నిర్వహించారు.

Read Also: Cyclone and Heavy Rains: భారీ వర్షాలపై సర్కార్‌ హైఅలర్ట్.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

ఆ మీటింగ్‌కు ఎంపీ రఘురామిరెడ్డితో పాటు మంత్రి పొంగులేటి కూడా హాజరై… అనుచరగణానికి దిశానిర్దేశం చేశారట. దీన్నిబట్టి చూస్తుంటేనే… కొత్తగూడెం విషయంలో మంత్రి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.అయితే గతంలో ఇక్కడ కాంగ్రెస్‌కు ఏ మాత్రం పట్టు లేదు. బీఆర్‌ఎస్‌ వర్సెస్ సిపిఐగా పొలిటికల్‌ పోరు నడిచేది. మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డు మాత్రమే గెలిచింది కాంగ్రెస్. అటు సీపీఐ పరిస్థితి వేరుగా ఉంది. బీఆర్‌ఎస్‌ మాంఛి ఊపులో ఉన్నప్పుడు కూడా తట్టుకుని ఉనికి చాటుకోగలిగింది. అదే ధైర్యంతో ఇప్పుడు ముందుకు వెళ్తున్నారట కామ్రేడ్స్‌. నియోజకవర్గంలో తామే బలంగా ఉన్నామని నమ్ముతున్న సీపీఐ లీడర్స్‌…రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడ పట్టు బిగించే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇటు మంత్రి పొంగులేటి కూడా అదే టార్గెట్‌ పెట్టుకోవడంతో… మేటర్ రసవత్తరంగా మారుతోంది. మిత్రపక్షాల మధ్య మొదలైన ఈ ఆధిపత్య పోరు ఎంతవరకు వెళ్తుందోనన్న ఉత్కంఠ సైతం పెరుగుతోంది రాజకీయవర్గాల్లో. స్థానిక ఎన్నికలు కావడంతో ఫైట్‌ లోకల్‌గానే జరుగుతుందా… లేక సెగలు హైదరాబాద్‌ను తాకుతాయా అన్న అనుమానాసు సైతం ఉన్నాయి కొన్ని వర్గాల్లో.

Exit mobile version