Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Ntr District Ycp

Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట

Published Date :May 5, 2026 , 9:24 pm
By NTV WebDesk
  • ఎన్టీఆర్‌ జిల్లాలో బలంగా ఉన్న కాపు ఓట్‌ బ్యాంక్‌
  • గత ఎన్నికల్లో కూటమికి ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు గుర్తింపు
  • జనసేన వైపు కాపుల మొగ్గు, కూటమి పార్టీలకు కలుసుబాటు
  • గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుకు టిక్కెట్‌
Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్టీఆర్‌ జిల్లాలోని ఆ కీలకమైన సామాజికవర్గంపై వైసీపీ ఫోకస్‌ పెట్టిందా? గత ఎన్నికల్లో ఎక్కడ నష్టం జరిగిందో తొలిసొచ్చిందా? అందుకే బలమైన ఆ ఓట్‌ బ్యాంక్‌ ఈసారి చెదిరిపోకుండా ఇప్పట్నుంచే జాగ్రత్తలు మొదలుపెట్టిందా? ఇంతకీ ఏ కులం మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది ఫ్యాన్‌ అధిష్టానం? డ్యామేజ్‌ని కవర్‌ చేసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్‌ వేస్తోంది? ఎన్టీఆర్‌ జిల్లాలో, ప్రత్యేకించి బెజవాడ నగరంలో కాపు సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది వైసీపీ. ఆ విషయంలో సీరియస్‌గానే వర్కౌట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా జనసేనకు, తర్వాత పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలకు పడుతున్నట్టు గుర్తించిందట ఫ్యాన్‌ అధిష్టానం. గత ఎన్నికల ఫలితాలు ఇదే విషయం చెప్పాయని అంటున్నారు. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం ఓట్‌ బ్యాంక్‌ బలంగా ఉంది. సిటీలోని మూడు నియోజకవర్గాలతో పాటు అటు జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం సెగ్మెంట్స్‌లో కూడా కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2019 2024 ఎన్నికలను పరిశీలిస్తే… ఇదంతా జనసేనకు, టీడీపీకి ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు లెక్కలేస్తోంది వైసీపీ అధిష్టానం. కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతం జనసేన వైపు మొగ్గు చూపుడం…. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కూటమిలోని మిగతా రెండిటికి కూడా కలిసి వచ్చందని వైసీపీ స్థానిక నేతలు గుర్తించారట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై అధిష్టానం దగ్గర రకరకాల ప్రతిపాదనలు పెడుతున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీకి గతంలో బలమైన కాపు నేతలు అండగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుకి, విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రాధాకృష్ణకు వైసీపీ అధిష్టానం టిక్కెట్లు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయినా… టిక్కెట్ల కేటాయింపుతో… ఆ సామాజిక వర్గానికి దగ్గరగా ఉన్నామన్న సందేశం కాపుల్లోకి వెళ్లిందని నమ్ముతున్నారు.

అయితే 2019కి వచ్చేసరికి కాపు కోటాలో జగ్గయ్యపేట నుంచి ఉదయభానుకు మాత్రమే టికెట్ కేటాయించారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకే దక్కింది. కానీ…. ప్రస్తుతం సామినేని వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి టికెట్ ఎక్కడ కేటాయించాలన్న అంశంపై వైసీపీలో చర్చ జరుగుతోందట. స్థానిక నాయకత్వం మాత్రం విజయవాడ నగరంలో ఒక టికెట్‌ కాపులకు ఇవ్వాలన్న విషయాన్ని పదేపదే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది.కాపు సామాజిక వర్గానికి పార్టీ దగ్గరవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారట లోకల్‌ లీడర్స్‌. విజయవాడ సిటీలో ఒక సీటు ఇస్తే….మొత్తం మూడు నియోజకవర్గాల్లో కాపు ఓట్‌ బ్యాంక్‌ వైసీపీ వైపు మళ్లుతుందని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో అధిష్టానం కూడా నగరంలో కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నేత ఎవరున్నారన్న అంశంపై దృష్టి పెట్టడంతో పాటు గతంలో తమతో పనిచేసి బయటికివెళ్ళి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో ఉన్న కొందరు కాపు సామాజికవర్గ నేతలు కూడా మేం లైన్‌లో ఉన్నామంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారట. గత ఎన్నికల సమయంలోనే వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా సాధ్యపడలేదు. ఆయన సోదరి ఆశ వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా అదీ లేదు. మరోవైపు గతంలో కాపు సామాజిక వర్గానికి కేటాయించిన జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన తన్నీరు నాగేశ్వరరావును ఇన్ఛార్జ్‌గా పెట్టింది పార్టీ. ఈ పరిస్థితుల్లో… మొత్తం జిల్లాలో కాపు సామాజిక వర్గానికి వైసీపీ దగ్గర కావాలంటే విజయవాడ నగరంలో లేదా జిల్లాలో ఒక సీటును కేటాయించి తీరాల్సిందేనని అంటున్నారు.
అయితే… అది ఎక్కడన్న విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అసలు జిల్లాలో ఎక్కడా ఇవ్వకుంటే మాత్రం దాని ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. కూటమి నుంచి కాపు ఓట్లను వైసీపీకి మళ్లించడానికి టిక్కెట్‌ కేటాయింపు ఒక్కటే మార్గమని అంటున్నారు పార్టీ లీడర్స్‌.

Also Read

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
  • Off The Record : పదేపదే పార్టీలు మారి దెబ్బతిన్న కొత్తపల్లి సుబ్బారాయుడు
  • Off The Record : ఏఐసీసీ కార్యదర్శులకు తెలంగాణ కలిసివస్తోందా..?

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • off the record
  • ycp

తాజావార్తలు

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

  • Modi-Trump: బెంగాల్‌లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్

  • Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?

  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions