OTR : తొడలు కొట్టిన నేతలు.. ఇప్పుడు వెనక్కి తగ్గారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కారాలు, మిరియాలు నూరిన వాళ్ళు సడన్‌గా కాళ్ళ బేరానికి ఎందుకొచ్చారు? అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే మాది సోలో ఫైట్ అంటూ బీరాలు పలికిన వాళ్ళు బెగ్గింగ్ రేంజ్‌కి ఎందుకు వెళ్ళారు? ఒక్కసారి కమిట్ అయితే…. మా మాట మేమే వినబోమంటూ మీసాలు మెలేసిన వాళ్ళు తెల్లారేసరికి మీ దయ, మా ప్రాప్తం అన్నట్టు ఎందుకు సరెండర్ అయ్యారు? సింహపురి సీట్ల పంపకాల వెనక ఏం జరిగింది? జనసేన వైఖరి ఎందుకు మారింది? తగ్గేదే లేదన్నారు.. మా సత్తా చూపిస్తామన్నారు…. మేం డిసైడ్ అయ్యాం, టాప్ గేర్ వేసేశాం. ఇక మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్…. మేం అడిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్లో 30 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని టీడీపీకి డిమాండ్ పెట్టారు నెల్లూరు జనసేన నాయకులు. కాదు కూడదంటే చెప్పండి…. పొత్తు ధర్మం పాటిస్తూనే సింగిల్‌గా పోటీకి కూడా సై అంటూ ప్రకటించేశారు. ఇదంతా గమనిస్తున్న పొలిటికల్ పరిశీలకులు సింహపురి కూటమిలో ఏదో జరగబోతోంది, మిన్ను విరిగి మీద పడుతుందేమోనన్నంతగా ఫీలైపోయాకు. కట్‌చేస్తే….ఇప్పుడు.. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్న పాటను గుర్తు చేసుకుంటున్నారట. ముందు 21 సీట్లకు తగ్గే ప్రసక్తే లేదన్న గ్లాస్ లీడర్స్ ఫైనల్‌గా 8తో సర్దుకుపోవడం వెనక ఏం జరిగిందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
వాస్తవానికి నెల్లూరు సిటీయేకాదు, మొత్తం జిల్లాలోనే జనసేనకు అంత బలం లేదన్నది లోకల్ టాక్. అసలు జిల్లా పార్టీలో అంతమంది ఆ స్థాయి నాయకులు కూడా లేరని అంటారు. పొత్తు లేకుండా సొంతగా పోటీ చేస్తే గెలుస్తామన్న గ్యారంటీ లేదని నెల్లూరు జిల్లా గ్లాస్ నేతలే ఆఫ్ ద రికార్డ్‌లో ఒప్పుకుంటారట. కానీ… వీటేటినీ పట్టించుకోకుండా, గ్రౌండ్ రియాలిటీతో సంబంధం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు 30 శాతం సీట్లు ఇవ్వాల్సిందే, లేదంటే మేం సొంతగా పోటీ చేస్తామని ప్రకటించేశారు ఆ పార్టీ రాష్ట్ర నేత శివశంకర్. కానీ… సడన్‌గా ఆ తర్వాత సీన్ మారిపోయింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేన అనుసరించిన విధానం ఇప్పుడు సింహపురి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. డిమాండ్ చేసిన స్థాయి నుంచి.. సడన్‌గా ఎన్నిచ్చినా సర్దుకుంటాం అనే టోన్‌లోకి ఎందుకు వచ్చారంటూ రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 72 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 30% అంటే… 21 సీట్లు కావాలంటూ జనసేన మొదట్లో డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఫార్ములా ఉందని, ఇక్కడ కూడా అదే కావాలంటూ వత్తిడి తీసుకువచ్చారట లోకల్ గ్లాస్ లీడర్స్. నాలుగైదు స్థానాలు ఇద్దామనుకున్న టీడీపీకి ఈ డిమాండ్ కాస్త ఓవర్‌గా అనిపించిందట. క్షేత్రస్థాయిలో వారి బలమేంటో తెలుసుకోకుండా జనసేన నేతలు ఎక్కువ ఆశిస్తున్నారంటూ టీడీపీలో అంతర్గత చర్చలు కూడా జరిగాయంటున్నారు.
Also Read
ఆ పార్టీని ఎక్కడా తక్కువ చేయకుండా….జనసేన బలంగా ఉన్న నాలుగైదు డివిజన్స్‌ను వారికే కేటాయించి హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ ఉండేలా చూద్దామని, పూర్తి సహకారం అందించి ఆ సీట్లలో వాళ్ళను గట్టెక్కిద్దామని అటు మంత్రి నారాయణ, ఇటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావించారట. కానీ స్థానిక జనసేన నేతల ఆలోచనలతో మ్యాచ్ అయ్యే పరిస్థితి కనిపించక వాళ్ళను పట్టించుకోలేదని చెబుతున్నారు. అదే సమయంలో పొత్తుల గురించి మాట్లాడేందుకు నెల్లూరు వచ్చిన జనసేన నేత శివశంకర్ సైతం మంత్రి నారాయణను, ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలవకుండా.. తాను బస చేసిన హోటల్‌కే వాళ్ళను పిలిపించుకున్నారట. అదే ఊపులో మా డిమాండ్ 30 శాతం….. ఇది నా మాట కాదు, మా అధినేత పవన్ మాట అని కూడా వెనకా ముందూ ఆలోచించకుండా చెప్పేసినట్టు తెలిసింది. సామరస్యంగా చర్చించుకోవడానికి బదులు మాట తీరు ఏదో తేడాగా ఉందని భావించిన టీడీపీ ముఖ్యులు అక్కడికక్కడే ఆ నిర్ణయానికి ఓకే చెప్పకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు. దాంతో… తాము ఒంటరిగా పోటీ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించేశారు శివశంకర్. కానీ… ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తమ పార్టీ రాష్ట్ర నేత ప్రకటనపై నెల్లూరు స్వయంగా నెల్లూరు జనసైనికులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. స్థానిక పరిస్థితుల్ని తెలుసుకోకుండా ఆయన మాట్లాడారని, ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేమని, ఉన్న పరువు కూడా పోతుందంటూ కొందరు నాయకులు శివశంకర్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది.
పొత్తులో వెళితే కనీసం నాలుగైదు సీట్లయినా గెలుస్తామని, కాదు.. కుదరదంటే ఒక్కరంటే ఒక్కరు కూడా మన పార్టీ తరపున కార్పొరేషన్లో అడుగుపెట్టలేరని పూర్తిగా విడమరిచి అర్థమయ్యేలా చెప్పారట. 30 కాదు, 10 శాతం ఇచ్చినా తీసుకుందామని, టీడీపీతో కలిసి వెళితే అన్ని సీట్లు గెలుస్తామని వివరించడంతో… మళ్ళీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ను రాయబారానికి పంపినట్టు తెలిసింది. ఆయన టిడిపి జిల్లా అధ్యక్షుడు రవిచంద్రతో పాటు మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చలు జరిపారు. సిటీ, రూరల్‌లో కలిపి మొత్తం జనసేనకు 8 సీట్లు ఇస్తామని చెప్పడంతో వాటికే ఓకే చేశారని అంటున్నారు. ఆ లెక్కన చూస్తే… జనసేనకు 11 శాతం సీట్లు దక్కినట్టు. ఇదీ రియాలిటీ అని ఇప్పుడు ఆ పార్టీ జిల్లా నేతలే అంటున్నారు. నేల విడిచి సాము చేసే బదులు వాస్తవాలకు దగ్గరగా ఆలోచిస్తే…. కూటమి బలపడటంతో పాటు మనం కూడా పిడికిలి బిగించే ఉంటామని, అలా కాదని దాన్ని ఓపెన్ చేస్తే ఏం ఉండబోదని జనసేన నేతలు మాట్లాడుకోవడం ఇప్పుడు సింహపురి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.
- Tags
- janasena
- Nellore
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!