Site icon NTV Telugu

Off The Record : అగ్గి రేపుతున్న మందుల సామేల్‌ మాటలు

Mandula

Mandula

ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాటలు తెలంగాణలో పొలిటికల్‌ మంటలు రేపుతున్నాయా? మేటర్‌ మెల్లిగా కులం, మతం కలర్‌ పులుముకుంటోందా? బీజేపీ ఎంట్రీతో ఎట్నుంచి ఎటో తిరుగుతోందా? ఎవరా శాసనసభ్యుడు? ఆయన మాటలతో బ్రాహ్మణుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ ఎందుకు పెరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య కొత్త వార్‌ మొదలైంది. అయితే… ఇది గతానికి పూర్తి భిన్నం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ అగ్గి రేపారు. ప్రస్తుతం ఆయన మాటలు మంటలు లేపుతున్నాయి. రెండు పార్టీల మధ్య రచ్చ ఒక ఎత్తయితే… ఎమ్మెల్యే తమను తీవ్రంగా అవమానించారంటూ బ్రాహ్మణ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

ఆయన హిందువే కాదని, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలాగంటూ బీజేపీ మండిపడుతోంది. ఆ మధ్య గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బ్రాహ్మణులను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అవే ఇప్పుడు రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే సామేల్‌ తమ వృత్తిని అవమానించేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, అందుకాయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. అయితే… ఈ ఎపిసోడ్‌లోకి బీజేపీ ఎంట్రీతో మేటర్‌కు ఫుల్‌ పొలిటికల్‌ కలర్ వచ్చేసింది. పైగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీకే చుట్టుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, పైగా గాంధీభవన్‌లో, ముఖ్యమైన ప్రోగ్రామ్‌లో కావడంతో దీని నుంచి పార్టీ తప్పించుకోలేకపోవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి.

అటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు మందుల సామేల్‌ హిందువు కాదని, ఆయన చర్చిలో పెళ్లి చేసుకున్నారని, అందుకే హిందూ మతంలోని కొన్ని ప్రక్రియలను హేళన చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్స్‌. తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నది బీజేపీ డిమాండ్‌. కాంగ్రెస్ సనాతన ధర్మానికి వ్యతిరేకమని కూడా ఆరోపిస్తున్నారు కాషాయ నాయకులు. హిందువునని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి….. హిందువులను అవమానిస్తుంటే ఎందుకు స్పందించడం లేదు, తమ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది బీజేపీ లీడర్స్‌ క్వశ్చన్‌. మరోవైపు ఎమ్మెల్యే మందుల సామేల్‌ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో కూడా బాగానే రచ్చ అవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ బాగా ట్రోల్‌ అవుతున్నాయి.

ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ…. అదే ఊపులో కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తున్నారు ఎక్కువ మంది. దీంతో ఇది మదిరి పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కొందరు కాంగ్రెస్‌ నాయకులు కంగారు పడుతున్నారట. ఇంకొందరైతే…. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినాసరే… సామేల్‌ వ్యాఖ్యల్ని తప్పుపట్టినట్టు తెలుస్తోంది. దీంతో…. మేటర్‌ ఎట్నుంచి ఎటెటో వెళ్ళిపోతోందని గ్రహించిన సామేల్‌ నష్ట నినారణ చర్యలు మొదలుపెట్టాకు. ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారాయన. కానీ… బీజేపీ నాయకులు మాత్రం ఈ మేటర్‌ని ఇక్కడితో వదిలేలా కనిపిండం లేదంటున్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం పార్టీ పెద్దల డైరెక్షన్‌లోనే ఆయన మాట్లాడారని, దీనిపై సామేల్‌కు బదులు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే స్పందించాలన్నది బీజేపీ డిమాండ్‌. ఈ పరిస్థితుల్లో ఈ మేటర్‌ కొత్త మలుపు తిరుగుతుందా, ఇక్కడితో ఆగుతుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version