OTR : కొండా సురేఖ కులం కార్డును కాంగ్రెస్ తెలివిగా వాడుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2009… 2026 సేమ్ సీన్ రిపీట్ అయింది. కొండా సురేఖ కి మంత్రి పదవులు కలిసి రావడం లేదా..? అప్పుడు సీఎంతో పొసగలేదు… ఇప్పుడు సీఎంతో పొసగకనే వేటు. ఇంతకీ మంత్రి పదవులు కొండా సురేఖకు ఎందుకు అచ్చి రావడం లేదు?మరోవైపు కొండా కులం కార్డును కాంగ్రెస్ తెలివిగా వాడుకుందా?.కొండా తప్పించినందుకు ముగ్గురు బీసీ మహిళా నేతలకు పదవులు ఇచ్చి బ్యాలెన్స్ చేసిందా? మాజీమంత్రి కొండా సురేఖకు మంత్రి పదవులు అచ్చిరావడం లేనట్టు కనబడుతోంది.. 2009లో రోశయ్య కేబినెట్ నుంచి కొండా సురేఖ తప్పుకున్నారు. అప్పట్లో వందరోజుల పాటు మంత్రిగా పనిచేశారు. సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి వెయ్యి రోజులకు బర్తరఫ్ వేటుపడింది. మొదట వైయస్ రాజశేఖర్ రెడ్డి కోసం… ఇప్పుడు తన కూతురు చేసిన వ్యాఖ్యలతో పార్టీ క్రమశిక్షణ చర్యల కి కొండా సురేఖ మంత్రి పదవి పోయింది.
2009లో వైఎస్ మరణం తర్వాత రోశయ్య కేబినెట్లో తిరుగుబాటు నేతగా వ్యవహరించారు. జగన్ కోటరీ లో ఉంటూ… రోశయ్యని ముఖ్యమంత్రిగా చూడలేమని… ఆ కేబినెట్ లో కొనసాగలేమంటూ నేరుగా గవర్నర్ వద్దకే వెళ్లి రాజీనామాను సమర్పించారు కొండ సురేఖ. దీంతో 2009 మే 25న ప్రమాణం చేసిన సురేఖ..సరిగ్గా 100 రోజులకే పదవికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం వెయ్యి రోజుల రేవంత్ కేబినెట్ లో తమ పదవి నుంచి బర్తరఫ్ చేశారు.గతంలో మాదిరిగా ప్రస్తుతం విభాగాలు ఏమీ లేకపోయినా… కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంత్రివర్గం నుంచి బర్తరఫ్లకు కారణమయ్యాయి. మొదటిసారి సీఎంపై మాట్లాడిన సందర్భంలోనే కొంత పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఉంది. కానీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు సయోధ్య కుదిరించారు. కానీ ఇప్పుడు సీఎంని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో… పార్టీ నాయకత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డికి బాసటగా నిలబడింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు తల్లి మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అందుకే… కొండా సురేఖ వివాదాలకు దూరంగా ఉన్న… కూతురు రూపంలో వివాదం వచ్చి పడింది. దీనికి మంత్రి పదవులు వదులుకోవాల్సి వచ్చింది.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
మరోవైపు కొండా సురేఖ కులం కార్డును తెలివిగా అడ్డుకుంది కాంగ్రెస్ అధిష్టానం. తాను బీసీ మహిళనని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చి… కొండా కులం కార్డుకు కౌంటర్ ఇచ్చింది హైకమాండ్. గౌడ సామాజికవర్గానికి చెందిన నేరెళ్ల శారదకి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చింది. అలాగే.. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్పర్సన్ నియమించింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా ఛైర్ పర్సన్ పదవి ఇచ్చింది. కొండా మురళి, కొండా సురేఖ సామాజిక వర్గాలతోపాటు మరో గౌడ కమ్యూనిటీకి చెందిన మహిళకు కూడా పదవులు ఇచ్చింది.
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!