OTR : ఏపీ కేబినెట్ విస్తరణలో మంత్రి దుర్గేష్‌ను పక్కన పెడతారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విషయం వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉండాలంటారు. ఇప్పుడు ఏపీ మంత్రి ఒకరు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారట. అదిగో అక్కడ అలా, ఇదిగో ఇక్కడ ఇలా అంటూ కబుర్లే తప్ప… వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయని సొంతోళ్ళే అంటున్నారట. అంతెందుకు, మంత్రికి దగ్గరగా ఉంటే ఆ నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కడ తమ మీద పడుతుందోనని టీడీపీ ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉంటున్నారు. ఎవరా మినిస్టర్? ఎక్కడ తేడా కొడుతోంది? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో మాటలు కోటలు దాటుతుంటే… అభివృద్ధి గడప దాటడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా… ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. విదేశీ పర్యటనలు, సమ్మిట్లతోనే రెండున్నరేళ్ళ పుణ్యకాలం పూర్తయింది తప్ప.. ఆయన తన ముద్ర ఏం వేశారంటూ కొందరు కూటమి నాయకులే ప్రశ్నిస్తున్నారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడంతో భారీగా ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. కేవలం ఈ రెండున్నరేళ్లలోనే ఏపీ టూరిజంలోకి 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే… అందులో మంత్రిగా దుర్గేష్ పాత్ర ఎంత? ఓవరాల్‌గా తీసుకున్న నిర్ణయాల ప్రభావానికి మించి ఆయనేం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. ఏపీకే సొంతమైన అరకు కాఫీ, మారేడుమిల్లి బేంబూ చికెన్, ఆయుర్వేదం, యోగ, ప్రకృతి వైద్యం లాంటి వాటికి ప్రత్యేక గుర్తింపు తెచ్చామని మంత్రి గొప్పలు చెబుతున్నా… వాస్తవానికి వీటన్నిటికి ఎప్పుడో గుర్తింపు వచ్చిందేతప్ప ఆయన చేసిందేమీా లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 21 వస్తువులకు జి.ఐ. ట్యాగ్ కల్పించామంటూ అన్నింటిని కలిపి మంత్రి తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు కర్టెన్ రైజర్ అంటూ….’గోదావరి పిలుస్తోంది – ది గోదావరి కాల్స్’ పేరుతో కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు మంత్రి. కుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహించడానికి విస్తృత ప్రచారం కల్పిస్తామని, ఆంధ్ర వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తామని, 96 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతున్నారు పర్యాటక శాఖ మంత్రి.
Also Read
అయితే… ఆ విషయమై సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారానికి వాస్తవాలకు పొంతన ఉంటడం లేదన్నది రాజమండ్రి టాక్. అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద వైసీపీ హయాంలో నిధులు తీసుకువస్తే….కూటమి హయాంలో పనులు జరుగుతున్నాయి. అయితే….. ఈ పనుల్లో సైతం నాణ్యత ప్రమాణాలను పాటించటం లేదని స్థానిక కూటమి నాయకులే ఆరోపిస్తున్నారు. పుష్కర ఘాట్లలో పనులు ప్రణాళికాబద్దంగా కాకుండా… అస్తవ్యస్తంగా చేస్తున్నారన్న అభిప్రాయం సైతం ఉంది. అందుకే…. ఈ అపవాదు మాకొద్దంటూ…రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం వీటికి దూరంగా ఉంటున్నారని టీడీపీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహిస్తే…స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ పాల్గొనకపోవడం చర్చనీయాంశం అయింది. పర్యాటక శాఖ కార్యక్రమాల్లో జనసేనకు చెందిన మంత్రి దుర్గేష్ వన్‌మ్యాన్ షో చేస్తున్నారని కూటమిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు టిడిపి ఎమ్మెల్యేలకు కనీసం ఆహ్వానాలు కూడా పంపడం లేదని అంటున్నారు. మంత్రిగా జిల్లాను శాసించాల్సిన దుర్గేష్…. తన చర్యలతో రాజకీయంగా ఒంటరి అవుతున్నారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఇదే సమయంలో మంత్రి వైఖరి మారకుంటే… రేపు కేబినెట్ విస్తరణలో పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న ప్రచారం సైతం మొదలైంది. ఇదే సమయంలో పర్యాటక శాఖకు ఎలివేషన్ పేరుతో… ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్స్ని పిలిచి హడావిడి చేశారు మంత్రి. అయితే… అది పర్యాటకం కోసం కాదని, పర్సనల్ ఎలివేషన్ కోసమన్న విమర్శలున్నాయి. పోనీ… అదన్నా జరిగిందా అంటే… ఆశించిన ప్రయోజనం కలగలేదన్న బాధలో ఉన్నారట మంత్రి. దీంతో… అరిటాకు భోజనాలు పెట్టి అనుకూలంగా మాట్లాడించుకుని డప్పుకొట్టుకుంటే… పబ్లిసిటీ రాదండీ…. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్‌గా అదే వస్తుందంటూ అదే సోషల్ మీడియాలో ఉతికి ఆరేసే వారు సైతం పెరుగుతున్నారు.
- Tags
- kandula durgesh
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!