OTR : కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వార్ ఓపెన్ అయిపోయిందా? ఆ జిల్లాలో తెలుగు తమ్ముళ్ళకి, జనసైనికులకు మధ్య ఫైటింగ్ పీక్స్‌కు చేరుతోందా? మనం మనం బరంపురం అంటూ పైకి చెబుతున్నా… గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందా? రెండు పార్టీల నేతలు పోటాపోటీ నామినేషన్స్ వేసుకుని ఎవరి లెక్కలు వారివే అంటోంది ఎక్కడ? అసలా లెక్కలు, ఎక్కాలేంటి? కాకినాడ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, 20 జడ్పీటీసీ, 401 ఎంపీటీసీలు ఉన్నాయి. కూటమి పొత్తులో భాగంగా జనసేన మూడు మున్సిపాలిటీలు ఒక నగర పంచాయతీలో పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒక మున్సిపాలిటీ, ఒక నగర పంచాయతీ బరిలో ఉంది. అయితే సీట్ల పంపకాల పరంగా పై స్థాయిలో బాగానే ఉన్నా…. రెండు పార్టీల్లో అసంతృప్తులు మాత్రం తగ్గేదే లే అంటున్నారట. ఇరు పక్షాల నుంచి రెబెల్స్ ఇష్టం వచ్చినట్టు నామినేషన్లు వేసేశారు. వాళ్ళంతా ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాల విషయంలో ఇంకా ఒక స్పష్టత రాలేదు. దానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ… మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినా నో మోర్ కాంప్రమైజ్ అంటున్నారట రెబెల్స్.
Also Read
వార్డుల్లో అయితే… ఈ పరిస్థితి మరింత హీటెక్కిస్తోందంటున్నారు. ఒక వార్డులో టిడిపి అభ్యర్థి బరిలో ఉంటే…అక్కడే జనసేన తరపున టిక్కెట్ ఆశించిన నేత రెబెల్‌గా నామినేషన్ వేశాడు. నచ్చజెప్పడానికి పెద్దలు ప్రయత్నించినా ససేమిరా అంటున్నారట అలాంటి వాళ్ళు. కాదు కూడదంటే చెప్పండి… ఇండిపెండెంట్‌గా అయినా పోటీలో ఉండి తీరతానని అంటున్నట్టు సమాచారం. ఇలా ఎక్కువ వార్డుల్లో తేడా జరిగిపోతుండటంతో…. కూటమి తరపున అధికారికంగా కన్ఫామ్ అయిన అభ్యర్థు కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నారట. దీంతో… పైన నాయకత్వ స్థాయిలో చెప్పేవాళ్ళు చాలా చెబుతున్నా… అంతా బాగుందని బిల్డప్‌లు ఇస్తున్నా…. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు తేడాగా ఉన్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. వార్డు స్థాయి పోటీలో ప్రతి ఓటు కీలకంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇండిపెండెంట్ పేరుతోనో, మరో రూపంలోనో కూటమి ఓట్లు చీలిపోతే… కచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండి తీరుతుంది. అదే ఇప్పుడు అధికారిక అభ్యర్ధుల్ని కంగారు పెడుతోందట. మరోవైపు జడ్పిటిసిలు, ఎంపీటీసీల విషయంలో టిడిపి, జనసేన నేతల నామినేషన్లు స్పీడందుకున్నాయి. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా స్థానిక నేతలు పోటీలో దిగిపోతున్నారు.
పార్టీ తమకే బీఫామ్ ఇస్తుందని ఫిక్స్ అయిపోతున్నారుగానీ… లెక్క తప్పి ఎవరికి వాళ్ళు పోటీలో ఉంటే మాత్రం దాని ఈక్వేషన్స్ కూడా వేరేగా ఉంటాయంటున్నారు. ఇన్నాళ్ళు మండల స్థాయిలో మేం రాజకీయాలు నడిపాం. ఇప్పుడు అంతా… పొత్తులు ఎత్తులంటే కుదరని కూల్‌గా సమాధానం చెబుతున్న నేతలు కాకినాడ కూటమిలో పెరుగుపోతున్నారట. పోటీ చేయాలని మేం ఫిక్స్ అయిపోయాం. దానికి అనుగుణంగా మీరు సీటు కన్ఫర్మ్ చేస్తే… అంతా స్మూత్‌గా, మండుటెండలో తిరిగొచ్చి కూల్‌డ్రింక్ తాగినంత హాయిగా ఉంటుంది. లేదంటే మాత్రం… రచ్చ రాజకీయం చేయడం మాక్కూడా వచ్చునన్న హెచ్చరికలు నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయట. మాకు ఒక కన్ను పోయినా ఫర్లేదుగానీ… అవతలి వాళ్ళకు రెండు కళ్లు పోవాలన్న వైఖరి ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతుందన్న భయాలు సైతం పెరుగుతున్నాయి. మేం ఓడిపోతే పోయాంగానీ… సొంత కూటమికే చెందిన అవతలి వాళ్లను మాత్రం గెలవనివ్వబోమంటూ కొందరు నాయకులు సన్నిహితులతో అంటున్నట్టు జరుగుతున్న ప్రచారం అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోందట.
దీని గురించి ఇటు తెలుగు తమ్ముళ్లు, అటు జనసైనికులు గట్టిగానే చర్చించుకుంటున్నారట. కానీ…. వెనక్కి తగ్గడానికి ఎవరూ ఒప్పుకోకపోవడమే అసలైన విషాదం అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో వార్ ఓపెన్ అయింది.. ఇక గేర్ మార్చడమే తప్ప చేసేదేం లేదన్న డైలాగ్స్ రెండు శిబిరాల నుంచి వినిపిస్తుండటం కేడర్ని టెన్షన్ పెడుతోందట. మొత్తానికి జిల్లాలో అటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఇటు పరిషత్‌లలో ఎవరి దారి వారిదే ఉన్నట్టుగా టీడీపీ, జనసేన పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ డివైడ్ పాలిటిక్స్‌తో ఈక్వేషన్స్ ఎలా మారుతాయోనన్న చర్చ మొదలైంది జిల్లాలో. ఇన్నేళ్ళు ఇంత సర్వీస్ చేసి, జెండాలు మోసి ఇప్పుడు కూడా కామ్‌గా కూర్చుని సినిమా చూడాల్నా అంటూ రెండు పక్షాల నాయకులు ఫీలైపోవడమే ఇందుకు అసలు కారణం అంటున్నారు. దీన్ని ఇప్పుడే సెట్ చేయకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
- Tags
- Janasena vs TDP
- Kakinada
- Kutami
- ntv
- OTR
తాజావార్తలు
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
-
OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!