Off The Record : హైదరాబాద్‌లో పొలిటికల్ ఫ్యామిలీ స్టార్స్‌కు దిక్కులేకుండా పోయిందా..?
- జీహెచ్ఎంసీలో రాజకీయ వారసులపై చర్చ
- పీజేఆర్, ముఖేష్‌గౌడ్ వారసుల విషయంలో చర్చ
- హైదరాబాద్ రాజకీయాల మీద పీజేఆర్ బలమైన ముద్ర
- రాజకీయాల్లోకి వారసులు విష్ణు, విజయారెడ్డి
- ఒకసారి ఎమ్మెల్యేగా పని చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో పొలిటికల్ ఫ్యామిలీ స్టార్స్‌కు దిక్కులేకుండా పోయిందా? తండ్రులు ఓ వెలుగు వెలిగిపోగా… వారసులు ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వాళ్ళని లైట్ తీసుకున్నాయా? ఫేడౌట్ అయిపోవడానికి కారణం వాళ్ళలో సత్తా లేకపోవడమా? లేక పార్టీల పట్టింపులేని తనమా? ఎక్కడుంది లోపం? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగబోతున్న టైంలో… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతల వారసుల వైపు మళ్లుతోంది చర్చ. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అంటే…పి.జనార్ధన్‌రెడ్డి, ముఖేష్ గౌడ్ పేర్లు వినబడేవి. అంతలా వాళ్లు తమ ముద్ర వేసుకున్నారు. కానీ… వాళ్ళ వారసుల రాజకీయ జీవితంపై మాత్రం ఇప్పుడు నీలి నీడలు అలుముకున్నాయి.
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
పార్టీని నిలబెట్టిన నేతల పిల్లలకు ఇప్పుడు పార్టీ అండగా నిలబడటం లేదా..? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు పీజేఆర్ రాజకీయ వారసుల పరిస్థితి ఏంటి..? ముఖేష్ గౌడ్ వాసుల పరిస్థితి ఏంటి..? అంటూ మాట్లాడుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్‌లో. హైదరాబాద్ రాజకీయాల మీద తనదైన ముద్రవేయడంతో పాటు… మంచి మాస్ లీడర్ ఇమేజ్ సంపాదించుకున్నారు పి.జనార్ధన్‌రెడ్డి. ఆయన వారసులుగా విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు…గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో పార్టీ టిక్కెట్‌ని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యకే ఇవ్వడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో… విష్ణు భవిష్యత్ ప్లానింగ్ ఏంటన్నది చర్చనీయాంశమైంది.
వచ్చే ఎన్నికపై ఆయన ఆశతో ఉన్నా…. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకే దక్కుతుందన్న గ్యారంటీ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆమె మీద గెలిచిన నాటి బీఆర్ఎస్ అభ్యర్థి…. దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. విజయారెడ్డి ప్రస్తుతం కార్పొరేటర్‌గానే కొనసాగుతున్నారు. రాజకీయంగా ఆమె భవిష్యత్ ఏంటన్నది క్లారిటీ లేదు. పీజేఆర్ లాంటి బలమైన నాయకుడి వారసులు సరిగా రాణించలేక ఇలా వెనుకబడిపోతున్నారా? లేక పార్టీ వాళ్ళకు సరైన ప్లాట్‌ఫాం కల్పించలేకపోతోందా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మరో సీనియర్ కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుల పరిస్థితి కూడా అంతే. ముఖేష్ కుమారుడు విక్రమ్…. తనకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కలేదని..బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఆశించిన పదవులు లేవు. దాంతో… కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీకి ప్రయత్నం చేసినా బ్రేక్‌లు పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్ ఉప ఎన్నికల సందర్భంగా తన అనుచరులతో భేటీ అయ్యారాయన. ముఖేష్ గౌడ్ పాత టీంతో మీటింగ్ పెట్టుకున్నారు. రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారట ఆయన. మొత్తంగా…ఒకప్పుడు గ్రేటర్ లో కీలకంగా పని చేసిన నాయకుల వారసులు ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!